Lady: చెట్టుకు వేలాడుతున్న యువతి హస్తి పంజరం, మూత్రవిసర్థనకు వెళ్లిన పోలీసులకు నిలిచిపోయింది !
బెంగళూరులో ఆరు నెలల క్రితం మృతి చెందిన మహిళ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. బెంగళూరులో ఓ ప్రాంతంలో మహిళ మృతదేహం ఆరు నెలలుగా ఎవరూ గుర్తించకపోవడంతో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
బెంగళూరు: బెంగళూరులో ఆరు నెలల క్రితం మృతి చెందిన మహిళ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. బెంగళూరులో ఓ ప్రాంతంలో మహిళ మృతదేహం ఆరు నెలలుగా ఎవరూ గుర్తించకపోవడంతో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ ఘటనతో హుళిమావు పోలీస్ స్టేషన్ పోలీసులతో పాటు స్థానిక ప్రజలు షాక్ అయ్యారు.
బెంగళూరులోని హుళిమావు సమీపంలోని అక్షయ నగర్ సమీపంలోని ముళ్ల పొదల్లో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది.
పోలీసులు మూత్ర విసర్జన చెయ్యడానికి ముళ్ల పొదల సమీపంలోకి వెళ్లారు. ఈ సమయంలో ఒక మహిళ మృతదేహం యొక్క హస్తి పంజరం ఖాళీ స్థలంలోని పొదల్లో ఉన్న చెట్టుకు వేలాడుతూ కనిపిండంతో మూత్ర విసర్జన చేస్తున్న పోలీసులు ఒక్కసారిగా మూత్రం ఆగిపోయి షాక్ అయ్యారు.

కొన్ని నిమిషాలు ఏం చెయ్యాలో అర్థంకాక పోలీసులు అలాగే ఉండిపోయారని తెలిసింది, తరువాత మృతదేహం ఉన్న చెట్టు కింద మహిళలు ఉపయోగించే చెప్పులు కూడా కనపడటంతో పోలీసులు చిన్నగా అక్కడికి వెళ్లారు. కుళ్లిపోయిన శవం ఎవరిది ?, మహిళ చనిపోయి ఎన్ని నెలలు అయ్యింది? ఇది హత్యా ?, లేక ఆత్మహత్యా అనే పలు ప్రశ్నలకు పోలీసుల దగ్గర ఇంత వరకు సమాధానం లేదు. హుళిమావు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
హస్తిపంజరం మహిళదే అని హుళిమావు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం బెంగళూరులో గత 6 నెలల క్రితం మహిళల మిస్సింగ్ కేసుల వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏడు నెలల క్రితం హుళిమావు పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాల్ కు చెందిన యువతి మాయం అయ్యిందని మిస్సింగ్ కేసు నమోదైంది. దీంతో అదే మహిళ మృతదేహంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైద్య పరీక్షల తరువాతే అది నేపాలీ యువతి శవమా, లేక మరొకరిదా అని తెలుస్తుందని, ప్రస్తుతం కేసు విచారణలో ఉందని హుళిమావు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications