Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bengaluru: హైదరాబాద్ హైవే, మాస్క్ వేసుకోమంటే ఆర్ టీసీ కండెక్టర్ ముఖం పచ్చడి, చిరంజీవి !

బెంగళూరు/ హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చెయ్యడానికి ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్క్ వేసుకోవాలని ప్రభుత్వాలు నెత్తినోరు కొట్టుకుంటున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బతో అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బహిరంగ ప్రదేశాల్లో సంచరించే సమయంలో, బస్సుల్లో సంచరించే సమయంలో కచ్చితంగా మాస్క్ లు వేసుకోవాలని అధికారులు చూసించారు. ఆర్ టీసీ బస్సులో మాస్క్ వేసుకోమని చెప్పిన పాపానికి కండెక్టర్ ను పట్టుకున్న ఇద్దరు ప్రయాణికులు ఆయన ముక్కు, ముఖం మీద దాడి చేసి చితకబాదేశారు. బెంగళూరు- హైదరాబాద్ హైవేలో ఈ సంఘటన జరగడం కలకలం రేపింది. కండెక్టర్ మీద దాడి చేసిన చిరంజీవి చిక్కడంతో మరోకడు పరారైనాడు.

 ప్రధాని మోదీకి వివరించిన సీఎం

ప్రధాని మోదీకి వివరించిన సీఎం

కర్ణాటకలో కరోనా వైరస్ తాండవం చేస్తోంది. ఐటీ హబ్ బెంగళూరు సిటీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఢిల్లీ చేరుకుని ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యి కర్ణాటకలోని కరోనా వైరస్ పాజిటివ్ కేసుల గురించి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి చర్చించారు.

 కరోనా సెకండ్ వేవ్ కలకలం

కరోనా సెకండ్ వేవ్ కలకలం

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చెయ్యడానికి ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్క్ వేసుకోవాలని ప్రభుత్వాలు నెత్తినోరు కొట్టుకుంటున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బతో అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బతో కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.

కేఎస్ ఆర్ టీసీ బస్సులు

కేఎస్ ఆర్ టీసీ బస్సులు

బెంగళూరు నుంచి కర్ణాటకలోని ఇతర ప్రాంతాలకు, పొరుగు రాష్ట్రాలకు కేఎస్ ఆర్ టీసీ బస్సులు సంచరిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో సంచరించే సమయంలో, ఆర్ టీసీ, ప్రైవేటు బస్సుల్లో సంచరించే సమయంలో కచ్చితంగా మాస్క్ లు వేసుకోవాలని అధికారులు పదేపదే చూసిస్తున్నారు.

Recommended Video

    Loud Sound In Bengaluru, Netizens Drag Aliens On UFO Day | Oneindia Telugu
     మాస్క్ లు వేసుకోవాలని చెప్పిన కండెక్టర్

    మాస్క్ లు వేసుకోవాలని చెప్పిన కండెక్టర్

    బెంగళూరు నుంచి కేఎస్ఆర్ టీసీ బస్సు బెంగళూరు- హైదరాబాద్ హైవేలో బయలుదేరింది. ఇదే బస్సులో కండెక్టర్ క్రిష్ణయ్య ఉన్నాడు. ప్రయాణికులు కచ్చితంగా మాస్కులు పెట్టుకోవాలని కండెక్టర్ అందరికి చెప్పాడు. ఇదే బస్సులు నంది క్రాస్ లో నివాసం ఉంటున్న చిరంజీవి, బాబు అనే ఇద్దరు వ్యక్తులు మాస్కులు పెట్టుకోకుండా ప్రయాణించారు.

     కండెక్టర్ ముక్కు, మూతి పగలగొట్టేశారు

    కండెక్టర్ ముక్కు, మూతి పగలగొట్టేశారు

    ఇద్దరు మాస్క్ లు పెట్టుకోవాలని కండెక్టర్ క్రిష్ణయ్య పదేపదే చెప్పాడు. చిరంజీవి, అతని స్నేహితుడు మాస్క్ లు వేసుకోకుండా గట్టిగా తుమ్ముతూ బస్సులు ఉమ్మడం మొదలు పెట్టారని సమాచారం. మాస్క్ లు వేసుకోవాలని చెప్పిన కండెక్టర్ క్రిష్ణయ్యను పట్టుకున్న చిరంజీవి, బాబు ఆయన ముఖం, మూతి పగిలిపోయేలా దాడి చేశారు.

     చిరంజీవి అరెస్టు

    చిరంజీవి అరెస్టు


    సాటి ప్రయాణికులు హడలిపోయి పారిపోతున్న చిరంజీవిని పట్టుకోవడంతో బాబు తప్పించుకుని పారిపోయాడు. బస్సును నేరుగా చిక్కబళ్లాపురం పోలీస్ స్టేషన్ దగ్గరకు తీసుకెళ్లారు. కండెక్టర్ మీద దాడి చేసిన చిరంజీవిని చిక్కబళ్లాపురం పోలీసులకు అప్పగించామని, కండెక్టర్ క్రిష్ణయ్య చిక్కబళ్లాపురం ఆసుపత్రిలో చికిత్స చేయించామని కేఎస్ఆర్ టీసీ డివిజనల్ కంట్రోలర్ బసవరాజ్ మీడియాకు చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+