బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Friends: నక్కతోక తొక్కిన ఫ్రెండ్స్, రూ. 2 లక్షల కోసం వెళితే రూ. 2 కోట్లు, దేవుడికి లంచం ఇచ్చి, క్లైమాక్స్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మైసూరు: చిన్నచిన్న చోరీలు చేస్తున్న ఇద్దరు యువకులు కాలం గడిపేస్తున్నారు. గతంలో ఇద్దరు జైల్లో ఫ్రెండ్స్ అయ్యారు. జైలు నుంచి విడుదలైన తరువాత కలిసి చోరీలు చేస్తున్నారు. అద్దె ఇంటిలో రూ. 2 లక్షలు చిక్కితే చాలు అనుకుని వెళ్లిన నిందితులను రూ. 2 కోట్ల విలువైన బంగారు నగలు, రూ. 1. 76 కోట్ల నగదు చిక్కింది. డబ్బు మూటలు లూటీ చేసిన నిందితులు చాకచక్యంగా తప్పించుకున్నారు. కేసు నుంచి తప్పించుకున్నామని నిందితులు ఇద్దరు కొన్ని రోజులు ఫుల్ హ్యాపీ అయ్యారు.

ఈ భారీ కేసు నుంచి నువ్వు తప్పించు స్వామి అంటూ నిందితులు ఇద్దరు ఓ ప్రముఖ ఆలయానికి వెళ్లారు. కేసు నుంచి మాకు విముక్తి కావాలని దేవుడికి చోరీ చేసిన డబ్బుల్లో లంచం కూడా ఇచ్చారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా నిందితులు గుడికి వెళ్లిన సమయంలో చిక్కిన వేలిముద్రలతో రూ. 2 కోట్ల చోరీ కేసు బయటకు వచ్చేయడంతో నిందితులు షాక్ అయ్యారు. దేవుడికి లంచం ఇచ్చిన కేటుగాళ్లు అడ్డంగా బుక్కైపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Illegal affair: ప్రియుడి కోసం కిలాడీ తల్లి బిడ్డలను ఏం చేసిందంటే ?, భర్తకు ఫోన్ చేసి డ్రామాలు, చరణ్!Illegal affair: ప్రియుడి కోసం కిలాడీ తల్లి బిడ్డలను ఏం చేసిందంటే ?, భర్తకు ఫోన్ చేసి డ్రామాలు, చరణ్!

చిన్నచిన్న దొంగతనాలు

చిన్నచిన్న దొంగతనాలు

బెంగళూరు నగరంలో దిలీప్, సునీల్ అనే ఇద్దరు యువకులు నివాసం ఉంటున్నారు. చిన్నచిన్న చోరీలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సునీల్, దిలీప్ వేర్వేరు కేసుల్లో జైలుపాలైనారు. జైలు జీవితం గడుపుతున్న సమయంలో జైల్లోనే సునీల్ కు, దిలీప్ కు పరిచయం అయ్యింది. తరువాత జైలు నుంచి విడుదలైన దిలీప్, సునీల్ టచ్ లో ఉన్నారు.

మ్యాటర్ లీక్ అయ్యింది

మ్యాటర్ లీక్ అయ్యింది

జైలు నుంచి విడుదలైన తరువాత సునీల్ ఆటో నడపడం మొదలుపెట్టాడు. ఓ రోజు జేపీ నగర్ లో నివాసం ఉంటున్న వ్యక్తిని కుమారస్వామి లేఔట్ వరకు సునీల్ అతని ఆటోలో డ్రాప్ చేశాడు. ఆటోలో వెళ్లిన వ్యక్తి సందీప్ లాల్ అనే వ్యక్తి ఇంటి ముందు దిగి అతనికి భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వడం సునీల్ చూశాడు.

కొన్ని రోజులు నిఘా... ఫ్రెండ్ తో స్కెచ్

కొన్ని రోజులు నిఘా... ఫ్రెండ్ తో స్కెచ్

అప్పటి నుంచి అప్పుడప్పుడు సునీల్ ఆటోలో కుమారస్వామి లేఔట్ లోని సందీప్ లాల్ ఇంటి దగ్గరకు వెళ్లి గమనించడం మొదలుపెట్టాడు. సందీప్ లాల్ ఇంటి పక్కనే అతని తండ్రి మన్ మోహన్ లాల్, ఆయన భార్య ప్రత్యేకంగా నివాసం ఉంటున్న విషయాన్ని సునీల్ గుర్తించారు. వారి ఇంటి ముందు ఖరీదైన బైక్ లు పార్క్ చేసి ఉండటంతో ఆ ఇంట్లో చోరీ చేద్దామని సునీల్ అతని జైలు ఫ్రెండ్ దిలీప్ కు చెప్పాడు.

చిన్న దొంగతనం చేద్దామని అనుకుంటే రూ. 2 కోట్లు చిక్కాయి

చిన్న దొంగతనం చేద్దామని అనుకుంటే రూ. 2 కోట్లు చిక్కాయి

సందీప్ లాల్ కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై వెళ్లాడు. మరుసటి రోజు ఆ ఇంట్లో ఎవ్వరూ లేరని నిర్దారించుకున్న దిలీప్, సునీల్ అర్దరాత్రి 12 గంటల సమయంలో సందీప్ లాల్ ఇంట్లోకి వెళ్లారు. అర్దగంట సేపు మొత్తం వెతికినా వాళ్లకు డబ్బులు చిక్కలేదు. ఇంటిలోని సెల్ఫ్ మీద పెద్ద బ్యాగ్ ఉండటంతో దానికి కిందకు దించారు. అంతే రూ. 2 లక్షలు చిక్కితే చాలు అనుకున్న దిలీప్, సునీల్ కు రూ. 2 కోట్లు చిక్కడంతో షాక్ అయ్యారు.

చోరీ చేసిన ఇంట్లోనే లిక్కర్ పార్టీ

చోరీ చేసిన ఇంట్లోనే లిక్కర్ పార్టీ

బ్యాగ్ కిందకు దించి చూస్తే రూ. 1. 76 కోట్ల నగదుతో పాటు రూ. 12 లక్షలకు పైగా విలువైన బంగారు నగలు అందులో ఉన్నాయి. డబ్బు చిక్కిందని సంతోషపడిన దిలీప్, సునీల్ అదే సందీప్ లాల్ ఇంట్లోని విదేశీ మద్యం బాటిల్ తీసుకుని అక్కడే మద్యం సేవించారు. తరువాత డబ్బు పంచుకుని అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు.

చోరీ డబ్బులతో గోవాలో ఎంజాయ్

చోరీ డబ్బులతో గోవాలో ఎంజాయ్

చోరీ చేసిన డబ్బుల్లో దిలీప్ అతని తల్లిదండ్రులకు బంగారు నగలు తీసిచ్చాడు. దిలీప్ అతని ఫ్రెండ్స్ తో కలిసి గోవా టూర్ వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చాడు. సునీల్ మాత్రం ఆ డబ్బు ఖర్చు చెయ్యకుండా భద్రంగా దాచిపెట్టుకున్నాడు. కేసు నుంచి తప్పించుకున్నామని నిందితులు దిలీప్, సునీల్ ఇద్దరు కొన్ని రోజులు ఫుల్ హ్యాపీ అయ్యారు.

దేవుడికి లంచం ఇచ్చారు.... క్లైమాక్స్ లో?

దేవుడికి లంచం ఇచ్చారు.... క్లైమాక్స్ లో?

ఈ భారీ కేసు నుంచి నువ్వు తప్పించు స్వామి అంటూ నిందితులు దిలీప్, సునీల్ ఇద్దరు ప్రముఖ ఆలయానికి వెళ్లారు. కేసు నుంచి మాకు విముక్తి కావాలని దేవుడికి చోరీ చేసిన డబ్బుల్లో లంచం కూడా ఇచ్చారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా నిందితులు దిలీప్, సునీల్ గుడికి వెళ్లి వచ్చిన తరువాత వాళ్ల వేలిముద్రలతో రూ. 2 కోట్ల చోరీ కేసు బయటకు వచ్చేయడంతో నిందితులు షాక్ అయ్యారు. దేవుడికి లంచం ఇచ్చిన కేటుగాళ్లు సునీల్, దిలీప్ అడ్డంగా బుక్కైపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Friends: Karnataka police arrest two in Rs 2 crore theft case in Bengaluru city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X