బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Golmaal: రూ. 84 లక్షలు గోల్ మాల్, గుజరాత్, ఢిల్లీ వ్యక్తుల అకౌంట్ లో?, బ్యాంక్ క్యాషియర్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చిక్కబళ్లాపురం: బ్యాంక్ లో క్యాషియర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ప్రతిరోజు బ్యాంకుకు వెళ్లి వస్తున్నాడు. గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తితో క్యాషియర్ ఆర్థిక లావాదేవీలు కొనసాగిస్తున్నాడని సమాచారం. ఇటీవల బ్యాంకులో ఆడిటింగ్ జరిగింది. ఆడిటింగ్ లో భారీ మొత్తంలో అవకతవకలు జరిగాయని వెలుగు చూసింది.

క్యాషియర్, బ్యాంక్ మేనేజర్ ను వేరే బ్రాంచ్ లకు బదిలి చేశారు. ఇదే సమయంలో బ్యాంక్ క్యాషియర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రూ. 84 లక్షల గోల్ మాల్ వ్యవహారంలోనే క్యాషియర్ ఆత్మహత్య చేసుకోవడంతో సాటి ఉద్యోగులు హడలిపోయారు.

Lady: రాత్రి చీకటిలో 27 ఏళ్ల యువతిని 16 ఏళ్ల అబ్బాయి ఏం చేశాడంటే ?, అక్క అని వెళ్లి?Lady: రాత్రి చీకటిలో 27 ఏళ్ల యువతిని 16 ఏళ్ల అబ్బాయి ఏం చేశాడంటే ?, అక్క అని వెళ్లి?

 గ్రామీణ బ్యాంక్

గ్రామీణ బ్యాంక్

కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లాలోని గుండచిక్కనహళ్లిలో కర్ణాటక గ్రామీణ బ్యాంక్ శాఖ ఉంది. ఈ బ్యాంక్ లో గౌరీబిదనూరు తాలుకాలోని కల్లుడి గ్రామంలో నివాసం ఉంటున్న సునీల్ క్యాషియర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. సునీల్ ప్రతిరోజు బ్యాంకుకు వెళ్లి విధులు నిర్వహించి తరువాత సొంత గ్రామానికి వెలుతున్నాడు.

అప్పట్లో ఏం జరిగిందంటే?

అప్పట్లో ఏం జరిగిందంటే?

ఇంతకు ముందు సునీల్ కల్లుడి లోని కర్ణాటక గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ లో ఉద్యోగం చేసేవాడు. కల్లుడి బ్రాంచ్ బ్యాంక్ మేనేజర్ మణీంద్రరెడ్డి, క్యాషియర్ సునీల్ మద్య ఆర్థిక లావాదేవీలు ఎక్కువ అయ్యాయి. ఆ సందర్బంలో మణీంద్రరెడ్డి, శంకరప్పరెడ్డి అనే వ్యక్తి కలిసి గుజరాత్, ఢిల్లీ, కోల్ కత్తాకు చెందిన ముగ్గురు వ్యక్తులకు ఏకంగా రూ. 84. 78 లక్షలు ఆర్ టీజీఎస్ అక్రమంగా నగదు బదిలి చేశారని ఆరోపణలు ఉన్నాయి.

బ్యాంక్ మేనేజర్, క్యాషియర్ బదిలి

బ్యాంక్ మేనేజర్, క్యాషియర్ బదిలి

ఇటీవల బ్యాంకులో ఆడిటింగ్ జరిగింది. ఆడిటింగ్ లో రూ. 84.78 లక్షల అవకతవకలు జరిగాయని వెలుగు చూసింది. క్యాషియర్ సునీల్, బ్యాంక్ మేనేజర్ మణీంద్రరెడ్డిని వేరేవేరే బ్రాంచ్ లకు బదిలి చేశారు. నగదు గోల్ మాల్ వ్యవహారంలో అధికారులు విచారణ మొదలు పెట్టారు.

విచారణ భయంతో ఆత్మహత్య

విచారణ భయంతో ఆత్మహత్య

ఇదే సమయంలో రోజు బ్యాంక్ కు వెళ్లి వస్తున్న బ్యాంక్ క్యాషియర్ సునీల్ ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రూ. 84, 78 లక్షల గోల్ మాల్ వ్యవహారంలోనే క్యాషియర్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో సాటి ఉద్యోగులు హడలిపోయారు.

English summary
Golmaal: Bank cashier committed suicide near Chikkaballapuar in Karnataka
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X