యువకుడిని కత్తితో పొడిచి చంపేసిన లేడీ, హీరో సుదీప్ రోడ్ షో రద్దు, ఏం జరిగిందంటే?
బెంగళూరు/బెళగావి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా పలు పార్టీల ఫేమస్ లీడర్స్, సినీ తారల రోడ్ షోలు, బహిరంగ సభల షెడ్యూల్ చాలా రోజుల క్రితమే ఫిక్స్ చేశారు. అయితే స్టార్ హీరో రోడ్ షో కొన్ని గంటల ముందు రద్దు అయ్యింది. ఓ మహిళ కత్తితో ఓ యువకుడిని దారుణంగా పొడిచి హత్య చెయ్యడంతో ఆ ప్రాంతంలో హీరో సుదీప్ రోడ్ షో అర్దంతరంగా నిలిచిపోయింది.
కర్ణాటకలోని పలు అసెంబ్లీ నియోజక వర్గాల్లో కన్నడ స్టార్ హీరో, బహుబాషా నటుడు కిచ్చా సుదీప్ తో బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం చేయిస్తున్నారు. కొన్ని రోజులుగా వరుస రోడ్ షోలలో పాల్గొంటున్న కిచ్చా సుదీప్ తన అభిమానులను. ప్రజలను కలుసుకుని బీజేపీ నాయకులకు ఓటు వేసి గెలిపించాలని మనవి చేస్తున్నారు.

కర్ణాటకలోని బెళగావి గ్రామీణ అసెంబ్లీ నియోజక వర్గంలో సోమవారం సాయంత్రం హీరో సుదీప్ రోడ్ షోలో పాల్గొనవలసి ఉంది. ఆదివారం నుంచి హీరో సుదీప్ రోడ్ షోకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్టీలు ఎక్కువగా ఉండే తారిహాళక్క ఏరియాలో హీరో సుదీప్ తో సోమవారం సాయంత్రం రోడ్డు షో నిర్వహించాలని బీజేపీ నాయకులు చాలా రోజుల నుంచి ప్లాన్ చేశారు.
అయితే ఆదివారం రాత్రి అదే ఏరియాలో ఓ మహిళ స్థానికంగా నివాసం ఉంటున్న యువకుడి చాతి మీద కత్తితో పదేపదే పొడిచి దారుణంగా చంపేసింది. సోమవారం బెళగావిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ యువకుడి శవానికి పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ హత్యతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సోమవారం యువకుడి శవం గ్రామంలోకి తీసుకెళ్లారు. అనుకున్న సమయానికంటే ఆలస్యంగా ఆ యువకుడి శవానికి అంత్యక్రియలు నిర్వహించారు. యువకుడి శవాన్ని ఊర్లో పెట్టుకుని హీరో సుదీప్ రోడ్ షో నిర్వహించకూడదని ఆ ప్రాంతంలోని ప్రజలు హీరో సుదీప్ కు, బీజేపీ నాయకులకు మనవి చేశారు.
రోడ్ షో అర్దంతరంగా రద్దు కావడంతో బెళగావిలోని ఓ ప్రైవేట్ హోటల్ లో హీరో సుదీప్ బస చేశారు. బెళగావి జిల్లాలోని అభిమాన సంఘాల నాయకులు హీరో సుదీప్ ను కలుసుకోవడానికి హోటల్ దగ్గర మకాం వేశారు.












Click it and Unblock the Notifications