IT Hub: పండగ టైమ్ లో బంపర్ ఆఫర్, మాస్క్ లేకుంటే రూ. 250, దూరిదూరి మాట్లాడితే రూ. 250, దూలతీరింది !

బెంగళూరు: కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి ఐటీ హబ్ బెంగళూరు సిటీలో కట్టుదిట్టమైన నియమాలు అమలు చెయ్యాలని అధికారులు నిర్ణయించారు. రెండు నెలల పాటు వరుసగా పండుగలు రావడంతో కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు, కర్ణాటకలో ఎంతో ఘనంగా నిర్వహించే వరమహాలక్ష్మి వ్రతం (వరలక్ష్మివ్రతం), మోహరం, శ్రీక్రిష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, దుర్గాపూజా తదితర పండుగలు వరుసగా వస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ చాపకింద నీరుగా వ్యాపించే అవకాశం ఉందని నిపుణలు హెచ్చరించారు. బెంగళూరు నగరంతో సహ నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ల నుంచి కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులోని మార్కెట్లు, రెస్టారెంట్లు, ,హోటల్స్, మాల్స్ తో పాటు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వేసుకోకుంటే రూ. 250, భౌతిక దూరం పాటించకుంటే రూ. 250 అపరాదరుసుం వసూలు చెయ్యాలని బీబీఎంపీ అధికారులు నిర్ణయించారు. కోవిడ్ నియమాలు ఉల్లంఘించే వారి నుంచి అపరాద రుసుం వసూలు చెయ్యడానికి బెంగళూరులోని 8 విభాగాలలో బీబీఎంపీ అధికారులు ప్రత్యేకంగా మార్షల్స్ ను రంగంలోకి దింపారు.

ఐటీ హబ్ లో కరోనా దెబ్బతో హడల్

ఐటీ హబ్ లో కరోనా దెబ్బతో హడల్

కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి ఐటీ హబ్ బెంగళూరు సిటీలో కట్టుదిట్టమైన నియమాలు అమలు చెయ్యాలని అధికారులు నిర్ణయించారు. ఇటీవల కాలంలో బెంగళూరులోని అనేక ప్రాంతాల్లోని అపార్ట్ మెంట్ ఉన్న ఏరియాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని అధికారులు గుర్తించారు. బెంగళూరు నగరంలో కరోనా వైరస్ కట్టడికి బీబీఎంపీ అధికారులు, వైద్య శాఖ అధికారులు ఇప్పటికే అనేక కఠిన చర్యలు తీసుకున్నారు.

వరుసగా పండుగలు

వరుసగా పండుగలు

రెండు నెలల పాటు వరుసగా పండుగలు రావడంతో కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు, కర్ణాటకలో ఎంతో ఘనంగా నిర్వహించే వరమహాలక్ష్మి వ్రతం (వరలక్ష్మివ్రతం), మోహరం, శ్రీక్రిష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, దుర్గాపూజా తదితర పండుగలు వరుసగా వస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ చాపకింద నీరుగా వ్యాపించే అవకాశం ఉందని నిపుణలు హెచ్చరించారు.

బెంగళూరులో కరోనా హాట్ స్పాట్లు మార్కెట్లు

బెంగళూరులో కరోనా హాట్ స్పాట్లు మార్కెట్లు


బెంగళూరు నగరంతో సహ నిత్యం రద్దీగా ఉండే సిటీ మార్కెట్, శివాజీనగర, మెజస్టిక్, అవెన్యూ రోడ్డు, ఎస్ పీ రోడ్డు, జేసీ రోడ్డు, కలాసిపాళ్య, బనశంకరి, జయనగర, యశవంతపురం, యలహంక తదితర మార్కెట్లతో పాటు రద్దీగా ఉండే ఇతర ప్రాంతాల నుంచి కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులోని మార్కెట్లు, రెస్టారెంట్లు, ,హోటల్స్, మాల్స్ లో కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.

 మాస్క్ లేకుంటే రూ. 250, దూరిదూరి మాట్లాడితే రూ. 250

మాస్క్ లేకుంటే రూ. 250, దూరిదూరి మాట్లాడితే రూ. 250


బెంగళూరులోని మార్కెట్లు, రెస్టారెంట్లు, ,హోటల్స్, మాల్స్ తో పాటు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వేసుకోకుంటే రూ. 250, భౌతిక దూరం పాటించకుంటే రూ. 250 అపరాదరుసుం వసూలు చెయ్యాలని బీబీఎంపీ అధికారులు నిర్ణయించారు. కోవిడ్ నియమాలు ఉల్లంఘించే వారి నుంచి అపరాద రుసుం వసూలు చెయ్యడానికి బెంగళూరులోని 8 విభాగాలలో బీబీఎంపీ అధికారులు ప్రత్యేకంగా మార్షల్స్ ను రంగంలోకి దింపారు. మొత్తం మీద బెంగళూరులో ఇక ముందు కోవిడ్ నియమాలు ఉల్లంఘించే వారి దూల తీరుపోవడం గ్యారెంటీ అంటున్నారు ప్రజలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+