బీజేపీ సైలెంట్ ఆపరేషన్, సీఎం అప్పను ఢిల్లీకి పిలిచిన మోదీ, అమిత్ షా, ABC ప్లాన్ !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా సైలెంగ్ గా అభ్యర్థులను ఎంపిక చేస్తున్న బీజేపీ హైకమాండ్ ఫైనల్ లిస్ట్ విడుదల చెయ్యడానికి కసరత్తులు చేస్తోందని తెలిసింది. ఇప్పటికే కర్ణాటకలోని 224 నియోజక వర్గాల నాయకులతో చర్చలు జరిపిన బీజేపీ హైకమాండ్ ఓ జాబితాను సిద్దం చేసింది.

224 నియోజక వర్గాల్లో ఒక్కొక్క నియోజక వర్గంలోని నాయకుల అభిప్రయాలు సేకరించారు. ప్రతి నియోజక వర్గంలో ABC అనే ముగ్గురి పేర్లతో కర్ణాటక బీజేపీ నాయకులు ఓ లిస్ట్ రెడీ చేశారు. అందులో మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఫామ్ లో ఉన్న నాయకుల పేర్లు ఉన్నాయని ఓ బీజేపీ నాయకుడు అంటున్నారు.

Yeddyurappa rushed to Delhi

అసెంబ్లీ నియోజక వర్గాల వారిగా టిక్కెట్లు ఆశపడుతున్న నాయకుల పేర్లు ఉన్న జాబితాతో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప శుక్రవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. శనివారం, ఆదివారం ఢిల్లీలోనే మకాం వేస్తున్న బసవరాజ్ బోమ్మయ్, యడియూరప్ప బీజేపీ హైకమాండ్ తో చర్చలు జరపనున్నారు.

Yeddyurappa rushed to Delhi

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డాతో పాటు కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రులు అందరూ కలిసి చర్చలు జరపనున్నారు. ఏప్రిల్ 9 లేదా 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితా విడదల చెయ్యడానికి బీజేపీ హైకమాండ్ సిద్దం అవుతోందని తెలిసింది. అయితే ఎక్కడా అసమ్మతి ఎదురు కాకుండా చూడటానికి ఢిల్లీలోని బీజేపీ పెద్దలు పక్కాప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+