కన్నడిగులకు సినిమా చూపిస్తున్న కాంగ్రెస్, ఉచితం అంటూనే ధరలు పైపైకి!
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఐదు ఉచితహామీలు అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పని చేశాయి. ఇప్పుడు ఉచిత హామీలు నెరవేర్చడానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆధాయం ఎలా వస్తుందని ఆలోచిస్తున్నారు. ఇదే సమయంలో కర్ణాటకలో ప్రతిరోజు సుమారు 90 లక్షల లీటర్ల విక్రయించే నందిని పాల ధరలు పెంచడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.
ఆగస్టు 1వ తేదీ నుంచి నందిని పాల ధరలు లీటర్ కు రూ. 3 పెంచాలని సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన జరిగిన కేఎంఎఫ్ సరసభ్వ సమావేశంలో నిర్ణయించారు. సీఎం సిద్దరామయ్య నందిని పాల ధరలు లీటర్ కు మూడు రూపాయల పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని కేఎంఎఫ్ అధ్యక్షుడు ఎల్, భీమానాయక్ సమర్థించుకున్నారు.

మంగళవారం మీడియాతో మాట్లాడిన కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమానాయక్ పెంచిన నందిని పాల ధరల డబ్బులు నేరుగా రైతులకే ఇస్తామని, అందులో ఎలాంటి అనుమానం లేదని అన్నారు. కర్ణాటకలో పాల సహకార సంఘాలు అన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధ్యక్షతన సమావేశం అయ్యి చర్చించారు.
ఈ సందర్బంలో నందిని పాల ధరలు పెంచాలని చర్చ జరిగింది. లీటర్ పాలు మీద మూడు రూపాయలు పెంచాలని, ఆగస్టు 1వ తేదీ నుంచి నందికి కొత్త పాల ధరలు అమలులోకి రావాలని సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల సహకార సంఘాల జిల్లా అధ్యక్షులతో పాటు పదాదికారులు అంగీకరించారని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమానాయక్ అన్నారు.
నందిని పాల ధరలను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచడాన్ని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమానాయక్ సమర్థించుకున్నారు. అయితే నందిని పాల ధరలు పెంచిన విషయంలో ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓ పక్క ఉచిత హామీలు నెరవేరుస్తామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న మధ్యం ధరలు, ఇప్పుడు పాల ధరలు పెంచేసింది. ఇక ముందు ఏ ధరలు పెరుగుతాయో అని అందరూ వేచి చూస్తున్నారు.












Click it and Unblock the Notifications