కరెంట్ చార్జీలు గతంలోని ప్రభుత్వం పెంచింది, మాకు ఏమి సంబంధం. మంత్రి మాటలతో!
బెంగళూరు: మా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే బీజేపీ విద్యుత్ చార్జీలు పెంచిందని, అలాగే విద్యుత్ చార్జీల పెంపుతో మాకు సంబంధం లేదని, విద్యుత్ ఛార్జీలను పెంచింది మేము కాదని, కరెంటు చార్జీల ధరలు పెంపు నిర్ణయం ఉపసంహరించుకోలేమని కర్ణాటక మంత్రి ఎంబీ .పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం విద్యుత్ చార్జీల పెంపుపై మంత్రి ఎంబీ. పాటిల్ మీడియాతో మాట్లాడారు.
స్వయం ప్రతిపత్తి కలిగిన కేఇఆర్ సీ ఈ విద్యుత్ ఛార్జీలను పెంచిందని, అది కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే విద్యుత్ చార్జీలు పెరిగాయని, కాబట్టి ధరల పెరుగుదలతో మాకు సంబంధం లేదని. పెంచిన చార్జీలు మేము ఎలా ఉపసంహరించుకుంటామని మంత్రి ఎంబీ పాటిల్ అన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా ఇప్పటికే ఈ విషయంలో వివరణ ఇచ్చారని, అయినా తాను సీఎంతో చర్చిస్తానని మంత్రి ఎంబీ పాటిల్ చెప్పారు.

విద్యుత్ చార్జీల విషయంలో దయచేసి పరిశ్రమల యజమానులు కర్ణాటక ప్రభుత్వానికి సహకరించవలసిందిగా కోరుతున్నానని. విద్యుత్ చార్జీలను కేఇఆర్ సీ ఎప్పటికపుడు పెంచుతుందని, దానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని మంత్రి ఎంబీ పాటిల్ అన్నారు. గతంలో బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే విద్యుత్ చార్జీలు పెంచిందని కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ ఆ నిందను బీజేపీ నాయకుల మీద వేశారు.
కేఇఆర్ సీ అప్పుడప్పుడు విద్యుత్ చార్జీలు పెంచుతుందని, ఇవాళ మా ప్రభుత్వం కొత్తగా రేట్లు పెంచలేదని, దయచేసి ప్రజలు, పరిశ్రమల యజమానులు అందరూ సహకరించాలని, తాను సీఎం సిద్దరామయ్య, విద్యుత్ శాఖా మంత్రి కేజే జార్జ్ తో చర్చించి సమస్య పరిష్కారించడానికి చేతనైనంత చేస్తామని మంత్రి ఎంబీ. పాటిల్ అన్నారు. కర్ణాటకలో ఉచిత బియ్యం పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్నారు. పేదలు తినే అన్నంతో రాజకీయం చేస్తున్నారని కర్ణాటక మంత్రి ఎంబీ, పాటిల్ మండిపడ్డారు.

మొత్తం మీద విద్యుత్ చార్జీల పెంపుకు మాకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. మేము బియ్యం కావాలని కేంద్రానికి లేఖ రాశామని. సీఎం కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారని. బియ్యం అందుబాటులోలేవని తిప్పి పంపారని మంత్రి ఎంబీ పాటిల్ కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉచిత బియ్యం పంపిణి ఆగిపోదని, ప్రతి ఒక్కరికి 10 కిలోల బియ్యం ఇస్తామని, చెప్పిన మాట నిలబెట్టుకుంటామని మంత్రి ఎంబీ పాటిల్ అన్నారు.












Click it and Unblock the Notifications