Lady: బ్యాంక్ లో ఉద్యోగం, గొడవ చేసి అక్క మొగుడితో పెళ్లి చేసుకుంది, కోరియర్ బాయ్ తో లేచిపోయింది!
బెంగళూరు/ చిక్కబళ్లాపుర/ కుప్పం: దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వ్యవసాయం. వ్యాపారం చేస్తున్న తండ్రి కూతుర్లను బాగా చదివించాడు. పెద్ద కుమార్తెను పొరుగు రాష్ట్రంలో నివాసం ఉంటున్న యువకుడికి ఇచ్చిపెళ్లి చేశారు. మరో అమ్మాయిని సొంత రాష్ట్రంలో ఇచ్చి పెళ్లి చేశారు. మూడో అమ్మాయి బాగా చదువుకుని డీసీసీ బ్యాంక్ లో మంచి ఉద్యోగం చేస్తోంది.
పెద్ద అక్క భర్తను ప్రేమించిన బ్యాంక్ ఉద్యోగిని కుటుంబ సభ్యులతో గొడవపడి నానా రాద్దాంతం చేసి అక్క మొగుడిని పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులు అక్క మొగుడితో కాపురం చేసిన బ్యాంక్ ఉద్యోగిని తరువాత కోరియర్ బాయ్ తో కలిసి లేచిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

ముగ్గురు కుమార్తెలు
కర్ణాటకలోని కోలారు జిల్లాలోని ముళబాగిలు తాలుకాలోని మణిగానహళ్లి గ్రామంలో నారాయణప్ప, జయమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. నారాయణప్ప, జయమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వ్యాపారం, వ్యవసాయం చేయిస్తున్న నారాయణప్ప డబ్బులు బాగా సంపాధించి ముగ్గురు కుమార్తెలను బాగా చదివించాడు.

వి కోట అల్లుడు
నారాయప్ప పెద్ద కుమార్తె మంజులను ఆంధ్రప్రదేశ్ లోని కుప్పం సమీపంలోని వి. కోటలో నివాసం ఉంటున్న సుబ్రమణ్య అనే యువకుడికి ఇచ్చి కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేశారు. సుబ్రమణ్య, మంజుల దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నారాయనప్ప చిన్న కుమార్తె దివ్యా బీఇడీ, ఎమ్మెస్సీ చదివింది.

అక్క మొగుడి మీద కన్ను వేసిన మరదలు?
నారాయణప్ప రెండో కుమార్తెను సొంత రాష్ట్రం కర్ణాటకలోనే ఇచ్చి పెళ్లి చేశారు. మూడో అమ్మాయి దివ్యా బీఇడీ. ఎమ్మెస్సీ చదువుకోవడంతో ఆమెకు కోలారు జిల్లాలోని డీసీసీ బ్యాంక్ లో మంచి ఉద్యోగం వచ్చింది. బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్న దివ్యా ఆమె పెద్ద అక్క భర్త సుబ్రమణ్య మీద కన్ను వేసి అతనితో క్లోజ్ గా ఉండటం మొదలుపెట్టింది.

రాద్దాతం చేసి అక్క మొగుడితో పెళ్లి
అక్క మంజుల భర్త సుబ్రమణ్యతో అక్రమ సంబందం పెట్టుకున్న దివ్యా అతన్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. డీసీసీ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్న దివ్యాను పెళ్లి చేసుకోవాలని అనేక సంబంధాలు వచ్చినా ఆమె మాత్రం పెళ్లి చేసుకోవడానికి సిద్దం కాలేదు.పెద్ద అక్క మంజుల భర్త సుబ్రమణ్యను ప్రేమించిన బ్యాంక్ ఉద్యోగిని దివ్యా ఆమె కుటుంబ సభ్యులు, బంధువులతో గొడవపడి నానా రాద్దాంతం చేసి అక్క మొగుడిని క్రితమే పెళ్లి చేసుకుంది.

కొరియర్ బాయ్ తో జంప్
10 రోజుల నుంచి పెళ్లి మూడ్ లో ఉంటూ ఎంజాయ్ చేస్తున్న దివ్యా ఆమె భర్త, కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చింది. పెళ్లి జరిగిన వెంటనే దివ్యా ముళబాగిల్ డీసీసీ బ్యాంక్ నుంచి చిక్కబళ్లాపురం డీసీసీ బ్యాంక్ బ్రాంచ్ కు బదిలి చేయించుంది. అక్క మొగుడు సుబ్రమణ్యను పెళ్లి చేసుకుని 10 రోజులు కూడా పూర్తి కాకుండానే దివ్యా కోరియ్ బాయ్ తో లేచిపోయింది.

ఎందుకు ఇలా చేసింది
డీసీసీ బ్యాంక్ ఉద్యోగినికి కోరియర్ బాయ్ చంద్రశేఖర్ అనే యువకుడు పరిచయం ఉన్నాడు. బ్యాంకులో, బయట కలుస్తున్న చంద్రశేఖర్ మీద దివ్యా మనసుపారేసుకుంది. అయితే కుటుంబ సభ్యులతో గొడవపడి అక్క మొగుడిని పెళ్లి చేసుకున్న దివ్యా ఇప్పుడు కోరియర్ బాయ్ తో లేచిపోయిన దివ్యా గత జూన్ 10వ తేదీ బంగారుపేటలోని గుడిలో పెళ్లి చేసుకుంది.

ఇద్దరు భర్తలతో గేమ్స్
జూన్ 10వ తేదీ కోరియర్ బాయ్ చంద్రశేఖర్ ను పెళ్లి చేసుకుని అతనితో జల్సా చేస్తున్న దివ్యా అందరి ముందు పెళ్లి చేసుకున్న అక్క మొగుడు సుబ్రమణ్యకు హ్యాండ్ ఇచ్చింది. ఆగస్టు 10వ తేదీన ముళబాగిల్ లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న దివ్యా తరువాత ప్రియుడు చంద్రశేఖర్ తో సీక్రేట్ గా కాపురం చేస్తోంది.

మంచి జీతం తీసుకుంటూ ఇదేం పని?
ఇప్పుడు దివ్యా, కోరియర్ బాయ్ చంద్రశేఖర్ మ్యాటర్ తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు చిక్కబళ్లాపురం మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. మొత్తం మీద బ్యాంక్ లో మంచి ఉద్యోగం చేస్తూ మంచి జీతం తీసుకుంటున్న దివ్యా ఇద్దరు భర్తలతో గేమ్స్ ఆడుతోందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications