బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Leader: పవర్ ఫుల్ లీడర్ హత్య కేసులో ట్విస్ట్, శిష్యుడే హంతకుడు, తన భార్యను గురువు దూరం చేశాడని స్కెచ్!

|
Google Oneindia TeluguNews

హాసన్/ బెంగళూరు: పట్టపగలు బైక్ మీద వెలుతున్న కౌన్సిలర్ ను అందరూ చూస్తున్న సమయంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో వేటకొడవళ్లు, కత్తులతో అతి దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది. పట్టణంలో రాజకీయాలకు అతీతంగా అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్న కౌన్సిలర్ హత్యకు గురి కావడంతో హాసన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ప్రధాని, మాజీ సీఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఎంతో సన్నిహితుడైన కౌన్సిలర్ హత్యకు గురికావడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.

రాజకీయ కక్షల కారణంగా కౌన్సిలర్ హత్యకు గురైనాడని మాజీ ప్రధాని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే కౌన్సిలర్, మాస్ లీడర్ హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. ప్రతిరోజు కౌన్సిలర్ వెంట అన్నా అన్నా అంటూ తిరుగుతున్న అతని శిష్యుడే హంతకుడు అని వెలుగు చూడటంతో అందరూ షాక్ అయ్యారు. తన భార్య విషయంలో కౌన్సిలర్ జోక్యం చేసుకున్నాడని, అందుకే నా కాపురం కూలిపోయిందని రగిలిపోయిన శిష్యుడు అతని స్నేహితులతో కలిసి గురువును దారుణంగా నరికి చంపేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూడటంతో అందరూ బిత్తరపోయారు.

Illegal affair: అక్కకు చిన్న వయసు ప్రియుడు, మరో అక్క కిలాడీ, తమ్ముడి హత్యకు ఇద్దరు అక్కలు స్కెచ్, రివర్స్!Illegal affair: అక్కకు చిన్న వయసు ప్రియుడు, మరో అక్క కిలాడీ, తమ్ముడి హత్యకు ఇద్దరు అక్కలు స్కెచ్, రివర్స్!

పవర్ ఫుల్ కౌన్సిలర్

పవర్ ఫుల్ కౌన్సిలర్

కర్ణాటకలోని హాసన్ పట్టణంలోని శాంతినగర 16వ వార్డు కౌన్సిలర్ గా ప్రశాంత్ విజయం సాధించాడు. జేడీఎస్ పార్టీలో ప్రశాంత్ చాలా చరుకుగా ఉంటున్నాడు. ప్రశాంత్ హాసన్ లో మంచి పలుకుబడి సంపాధించుకున్నాడు. ప్రశాంత్ అతని అనుచరులను వెంట వేసుకుని తిరుగుతున్నాడు. ప్రతినిత్యం ఎంతో అలర్ట్ గా ఉంటున్న ప్రశాంత్ కు రాజకీయంగా శత్రువులు ఉన్నారని తెలిసింది.

వేటకొడవళ్లతో నరికి స్పాట్ లో చంపేశారు

వేటకొడవళ్లతో నరికి స్పాట్ లో చంపేశారు

పట్టపగలు తనను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని ప్రశాంత్ బైక్ మీద బయలుదేరాడు. బైక్ మీద వెలుతున్న కౌన్సిలర్ ప్రశాంత్ ను అతని ప్రత్యర్థులు అనుమానం రాకుండా ఆటోలో వెంబడించారు. ఆ సమయంలో జవనేహళ్ళి మఠం సమీపంలో అందరూ చూస్తున్న సమయంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో వేటకొడవళ్లు, కత్తులతో ప్రశాంత్ ను అతి దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది.

మాజీ ప్రధాని ఫ్యామిలీకి చాలా క్లోజ్

మాజీ ప్రధాని ఫ్యామిలీకి చాలా క్లోజ్

హాసన్ పట్టణంలో రాజకీయాలకు అతీతంగా అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్న కౌన్సిలర్ ప్రశాంత్ హత్యకు గురి కావడంతో హాసన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ, మాజీ సీఎం హెచ్,డీ. కుమారస్వామి, మాజీ మంత్రి హెచ్ డీ. రేవణ్ణ, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులకు ఎంతో సన్నిహితుడైన కౌన్సిలర్ ప్రశాంత్ హత్యకు గురికావడంతో హాసన్ లో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.

కౌన్సిలర్ హత్య కేసులో ట్విస్ట్

కౌన్సిలర్ హత్య కేసులో ట్విస్ట్

హాసన్ లో మద్యం షాపులు మూసివేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. స్వచ్చందంగా మార్కెట్ బంద్ చేశారు. రాజకీయ కక్షల కారణంగా కౌన్సిలర్ హత్యకు గురైనాడని మాజీ ప్రధాని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే కౌన్సిలర్, మాస్ లీడర్ హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది.

హంతకుడు కౌన్సిలర్ శిష్యుడు

హంతకుడు కౌన్సిలర్ శిష్యుడు

ప్రతిరోజు కౌన్సిలర్ ప్రశాంత్ వెంట అన్నా అన్నా అంటూ పూర్ణచంద్ర అనే వ్యక్తి తిరుగుతున్నాడు. ప్రశాంత్ ను హత్య చేసింది అతని శిష్యుడే అని వెలుగు చూడటంతో అందరూ షాక్ అయ్యారు. తన భార్య విషయంలో కౌన్సిలర్ ప్రశాంత్ జోక్యం చేసుకున్నాడని, అందుకే నా కాపురం కూలిపోయిందని రగిలిపోయిన శిష్యుడు పూర్ణచంద్ర అతని స్నేహితులతో కలిసి గురువును దారుణంగా నరికి చంపేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూడటంతో అందరూ బిత్తరపోయారు.

పంచాయితీ చేసిన పాపానికి హత్య

పంచాయితీ చేసిన పాపానికి హత్య

జేడీఎస్ కౌన్సిలర్ ప్రశాంత్ శిష్యుడు పూర్ణచంద్రకు పెళ్లి జరిగింది. భార్యతో పూర్ణచంద్రకు గొడవలు జరిగాయి. ఆ సమయంలో పూర్ణచంద్ర పంచాయితీ చెయ్యడానికి కౌన్సిలర్ ప్రశాంత్ ను పిలుచుకుని వెళ్లాడు. ఆ సందర్బంలో నువ్వు నీ భర్తతో సంతోషంగా కాపురం చెయ్యాలని ప్రశాంత్ అతని శిష్యుడు పూర్ణచంద్ర భార్యకు చెప్పి వెళ్లాడు.

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య..... గురువు మీద పగ పెంచుకున్న శిష్యుడు

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య..... గురువు మీద పగ పెంచుకున్న శిష్యుడు

పంచాయితీ జరిగిన కొంతకాలానికే పూర్ణచంద్ర భార్య పుట్టింటికి వెళ్లింది. నా భార్య పుట్టింటికి వెళ్లడానికి నా గురువు ప్రశాంత్ కారణం అని, అతని వలనే నా భార్య నాకు దూరం అయ్యిందని కక్ష పెంచుకున్న పూర్ణచంద్ర అప్పటి నుంచి మంచి టైమ్ కోసం వేచి చూసి అతని గురువు ప్రశాంత్ ను చంపేశాడని హాసన్ పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
Leader: Hassan City Municipal Council member and JDS party leader Prashant murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X