Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lovers: పెళ్లి రోజు ప్రేమికులు కారులో సజీవదహనం, ఆత్మహత్య కేసులో ట్విస్ట్, ఫోటోలు, మెసేజ్ పంపించి!

బెంగళూరు/ఉడిపి: ఐటీ హబ్ లో యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్న ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత ఎదురైయ్యింది. పెద్దలను ఎదిరించి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్న ప్రేమికులు అన్ని ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న ప్రేమికులు ప్రతిరోజూ ఒకరిని ఒకరు చూసుకుంటూ దగ్గర కాలేక తల్లడిల్లిపోయారు. పెళ్లి చేసుకుని పెద్దలను కాదని కాపురం చెయ్యలేమని ప్రేమికులు డిసైడ్ అయ్యారు.

విడిపోయి జీవితాంతం సుఖం జీవించడం కంటే ఆత్మహత్య చేసుకోవడం మేలని ప్రేమికులు అనుకున్నారు. అంతే 300 కిలోమీటర్ల దూరం వెళ్లిన ప్రేమికులు కారు సీటులో వెనుక కుర్చుని మీద పెట్రోల్ పోసుకుని ఒకరిని ఒకరు కౌగిలించుకుని నిప్పంటిచుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఆత్మహత్య చేసుకునే ముందు ప్రియురాలు ఆమె కుటుంబ సభ్యులకు, ప్రియుడు అతని కుటుంబ సభ్యులకు పంపించిన ఫోటోలు, వాట్సాప్ మెసేజ్ బంధువులు, పోలీసులు షాక్ అయ్యారు. పెళ్లి చేసుకున్న కొన్ని గంటల్లోనే ప్రియులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

బెంగళూరులో లవర్స్

బెంగళూరులో లవర్స్

బెంగళూరు నగరంలోని హెబ్బాళలో యశవంత్ యాదవ్ అలియాస్ యశవంత్ (23), జ్యోతి (23) అనే యువతి, యువకుడు నివాసం ఉంటున్నారు. ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న యశవంత్, జ్యోతి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్న ప్రేమికులు యశవంత్, జ్యోతి పెద్దల నుంచి వ్యతిరేకత ఎదురైయ్యింది.

ఒకే ఏరియాలో ఉన్నా కలుసుకోలేని పరిస్థితి

ఒకే ఏరియాలో ఉన్నా కలుసుకోలేని పరిస్థితి

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోలేమని ప్రేమికులు యశవంత్, జ్యోతి అనుకున్నారు. అయితే పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదని యశవంత్, జ్యోతి తెలుసుకున్నారు. ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న ప్రేమికులు యశవంత్, జ్యోతి ప్రతిరోజూ ఒకరిని ఒకరు చూసుకుంటూ దగ్గర కాలేక తల్లడిల్లిపోయారు.

ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్

ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్

పెళ్లి చేసుకుని పెద్దలను కాదని కాపురం చెయ్యలేమని ప్రేమికులు యశవంత్, జ్యోతి డిసైడ్ అయ్యారు. విడిపోయి జీవితాంతం సుఖం జీవించడం కంటే ఆత్మహత్య చేసుకోవడం మేలని ప్రేమికులు యశవంత్, జ్యోతి అనుకున్నారు. మే 18వ తేదీన యశవంత్, జ్యోతి బెంగళూరు నుంచి మంగళూరు వెళ్లిపోయారు.

కారు అద్దెకు తీసుకున్న ప్రేమికులు

కారు అద్దెకు తీసుకున్న ప్రేమికులు

బెంగళూరు నుంచి మంగళూరు వెళ్లిన ప్రేమికులు అక్కడ హుసేన్ అనే వ్యక్తికి చెందిన షిఫ్ట్ కారు ( కేఏ 04 JX 0263 నెంబర్ కారును సెల్ఫ్ డ్రైవ్ పేరుతో అద్దెకు తీసుకున్నారు. మంగళూరులోనే ఓ గుడిలో యశవంత్, జ్యోతి పెళ్లి చేసుకున్నారు వివాహం చేసుకున్న తరువాత మంగళూరు నుంచి ప్రేమికులు ఉడిపి జిల్లాలోని బ్రహ్మావర పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవి ప్రాంతంలోకి వెళ్లారు.

షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రేమికులు

షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రేమికులు

బ్రహ్మావర్ సమీపంలోని అటవి ప్రాంతంలోకి వెళ్లిన ప్రేమికులు యశవంత్, జ్యోతి కొన్ని గంటల పాటు కారులో కుర్చుని మాట్లాడుకున్నారు. ప్రేమికులు యశవంత్, జ్యోతి కారు సీటులో వెనుక కుర్చుని శరీరం మీద పెట్రోల్ పోసుకుని ఒకరిని ఒకరు కౌగిలించుకుని నిప్పంటిచుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

కాలిబూడిద అయిన ప్రేమికులు, కారు

కాలిబూడిద అయిన ప్రేమికులు, కారు

ఆత్మహత్య చేసుకున్న ప్రేమికుల వివరాలు నాలుగు రోజుల పాటు తెలీలేదు. ఇద్దరి శరీరాలు, కారు కాలి బూడిద అయిపోవడంతో పోలీసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొని చివరికి కారు నెంబర్ ఆధారంగా బెంగళూరుకు చెందిన యశవంత్, జ్యోతి ఆత్మహత్య చేసుకున్నారని గుర్తించారు.

పెళ్లి రోజే ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు

పెళ్లి రోజే ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు

ఆత్మహత్య చేసుకునే ముందు ప్రియురాలు జ్యోతి ఆమె కుటుంబ సభ్యులకు, ప్రియుడు యశవంత్ అతని కుటుంబ సభ్యులకు పంపించిన పెళ్లి ఫోటోలు, మీరు మా పెళ్లికి అంగీకరించలేదు, ,అందుకే మేము ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నామని వాట్సాప్ లో పంపించిన మెసేజ్ చూసిన బంధువులు, పోలీసులు షాక్ అయ్యారు. పెళ్లి చేసుకున్న కొన్ని గంటల్లోనే ప్రేమికులు యశవంత్, జ్యోతి ఆత్మహత్య చేసుకోవడం బెంగళూరులో, ఉడిపి జిల్లాలో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+