lovers: రూమ్ లో గర్ల్ ఫ్రెండ్ ను చంపేశాడు, రైల్లో నుంచి దూకేసి, కాలేజ్ లో అదే అనుమానం !
బెంగళూరు: కాలేజ్ అమ్మాయితో లవ్ లో పడిన డెలివరీ బాయ్ రెండు సంవత్సరాలు ఆమెతో సంతోషంగా గడిపేశాడు. ప్రియురాలి తీరుతో అనుమానం పెంచుకున్న ప్రియుడు ఆమెకు దూరం అయ్యాడు. విరహవేదన తట్టుకోలేక చివరికి ప్రియురాలు ఓ మెట్టుదిగి ప్రియుడి రూమ్ కు వెళ్లింది. అంతే అక్కడ కథ రివర్స్ అయ్యింది. ప్రియురాలిని చంపేసి రూమ్ లో పెట్టి తాళం వేసిన ప్రియుడు నేరుగా రైలు ఎక్కి కొంతదూరం వెళ్లి తరువాత కిందకు దూకేసి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రియురాలిని చంపిన ప్రియుడు ప్రాణాలు గట్టివి కావడంతో ఐసీయూలో ఉన్నాడు.

డెలివరీ బాయ్. కాలేజ్ అమ్మాయి
బెంగళూరులోని సోమసంద్రపాళ్యలో రాజు (25) అనే యువకుడు ఓ రూమ్ అద్దెకు తీసుకుని రెండు సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాడు. ఓ ప్రముఖ సంస్థలో రాజు డెలివరీ బాయ్ గా ఉద్యోగం చేస్తున్నాడు. సోమసంద్రపాళ్యలోని రాజు రూమ్ సమీపంలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల అమ్మాయి ఇంటర్ విద్యాభ్యాసం చేస్తున్నది.

రెండేళ్లు రాజు లవ్ స్టోరీ
ఒకే ప్రాంతంలో ఉంటున్న రాజు, కాలేజ్ అమ్మాయికి పరిచయం ఉంది. రాజు, కాలేజ్ అమ్మాయి పరిచయం ప్రేమగా మారింది. గత రెండు సంవత్సరాల నుంచి రాజు, కాలేజ్ అమ్మాయి ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి కాలేజ్ కు వెళ్లి వచ్చే సమయంలో ఆమెను ప్రియుడు రాజు కలుస్తున్నాడు. అందరు ప్రేమికులు లాగా రాజు, కాలేజ్ అమ్మాయి కలిసి బైక్ లో షికార్లు, ఏకాంత ప్రదేశాలకు తిరిగేశారు.

ప్రియుడికి అనుమానం
ప్రియురాలు కాలేజ్ లో ఎవరితోనో మాట్లాడుతుందని, కాలేజ్ లో చదువుతున్న యువకుడిని ప్రేమిస్తోందని అనుమానం పెంచుకున్న రాజు ఆమెతో గొడవపెట్టుకున్నాడు. ఇదే విషయంలో చాలాసార్లు రాజు ప్రియురాలితో గొడపడ్డాడు. చాలాకాలం గొడవపడిన ప్రేమికులు కొంతకాలం నుంచి మాట్లాడుకోవడం లేదు.

కాలేజ్ నుంచి నేరుగా రూమ్ లోకి
ఈనెల 3వ తేదీన యువతి కాలేజ్ వకు వెళ్లింది. సాయంత్రం కాలేజ్ పూర్తి అయిన తరువాత నేరుగా సోమసంద్రపాళ్య సర్కిల్ వరకు ఫ్రెండ్స్ కలిసి వెళ్లిన యువతి మీరు ఇంటికి వెళ్లండి, నేను రాజు రూమ్ కు వెళ్లి వస్తానని ఫ్రెండ్స్ కు చెప్పింది. సోమసంద్రపాళ్య సర్కిల్ నుంచి ప్రియురాలు నేరుగా ప్రియుడు రాజు రూమ్ లోకి వెళ్లింది.

ప్రియుడి చేతిలో ప్రాణం పోతుందని ఊహించలేదు
రూమ్ లోకి వెళ్లిన తరువాత ప్రియుడు రాజుతో ప్రియురాలు మాట్లాడింది. తరువాత అదే విషయంలో ఇద్దరి మద్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగిపోవడంతో ఇద్దరు తీవ్రస్థాయిలో వాదించుకున్నారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన రాజు రూమ్ లోకి వెతుక్కుంటూ వచ్చిన ప్రియురాలు గొంతును తాడుతో బిగించి చంపేశాడు. ప్రియుడి కోసం వెళ్లిన కాలేజ్ అమ్మాయి అదేరోజు ప్రియుడి చేతిలో ప్రాణం పోతుందని అసలు ఊహించి ఉండదు.

రైల్లో నుంచి దూకి ఆత్మహత్యాయత్నం
రాత్రి పొద్దుపోయినా కూతురు ఇంటికి రాకపోవడంతో కాలేజ్ అమ్మాయి తల్లిదండ్రులు బండేపాళ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా అమ్మాయిని రాజు పిలుచుకుని వెళ్లిపోయి ఉంటాడని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియురాలిని చంపేసి రూమ్ లో పెట్టి తాళం వేసిన ప్రియుడు రాజు నేరుగా యశవంతపురం వెలుతున్న రైలు ఎక్కాడు. యశవంతపురం సమీపంలో వేగంగా వెలుతున్న రైలులో నుంచి ప్రియుడు రాజు కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.

నా లవర్ శవం తెచ్చుకోండి
రైలులో నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేసిన రాజు స్పృహ కోల్పోయి తీవ్రగాయాలు కావడంతో అతన్ని రాజీవ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల తరువాత స్పృహలోకి వచ్చిన రాజును పోలీసులు ప్రశ్నించారు. తన ప్రియురాలు చనిపోయిందని, శవం నా రూమ్ లో ఉందని చెప్పాడు. యువతి మెడను తాడుతో బిగించి హత్య చేసిన గుర్తులు ఉన్నాయని పోలీసులు అన్నారు. ప్రస్తుతం రాజు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, అతని మీద హత్య, ఫోక్సో చట్టంకింద కేసు నమోదు చేశామని బండేపాళ్య పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications