సిట్టింగ్ సీఎంకు టిక్కెట్ ఇస్తారో లేదో తెలీదు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత, సేమ్ పార్టీ ఎంపీ కామెంట్స్!

బెంగళూరు/దావణెరె: అధికారంలో ఉన్న పార్టీ నాయకులను ప్రతిపక్షాలు విమర్శించడం, ప్రతిపక్షాలను అధికార పార్టీ నాయకులు విమర్శించడం మనం ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చూస్తూనే ఉన్నాము. సొంత పార్టీ నాయకుల మీద అదే పార్టీకి చెందిన నాయకులు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ సీఎంకు టిక్కెట్ వస్తుందో లేదో మాకు తెలీదు అని సొంత పార్టీకి చెందిన ఎంపీ మాట్లాడటం హాట్ టాపిక్ అయ్యింది.

సీఎంకు ఎమ్మెల్యే టిక్కెట్ వస్తుందా?

సీఎంకు ఎమ్మెల్యే టిక్కెట్ వస్తుందా?

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బోమ్మయ్ కి టిక్కెట్‌ వస్తుందో రాదో తనకు తెలియదని కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ ఎంపీ జీ.ఎం. సిద్దేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేసి అందర్ని ఆశ్చర్యపరిచారు.

కర్ణాటకలోని దావణగెరెలోని జీఎంఐటీ పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్న గ్రౌండ్ స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఎంపీ సిద్దేశ్వర్ మీడియాతో మాట్లాడారు.

 సీఎం మీద సెటైర్లు వేసిన ఎంపీ

సీఎం మీద సెటైర్లు వేసిన ఎంపీ

బసవరాజ్ బోమ్మయ్ షిగావ్ నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఇక్కడి నుంచే సీఎం బసవరాజ్ బోమ్మయ్ రంగంలోకి దిగుతారని చెప్పొచ్చు. అయితే ఆ నిర్ణయం మన చేతుల్లో లేదని. అంతా హైకామండ్ చేతిలో ఉందని బీజేపీ ఎంపీ సిద్దేశ్వర్ అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత ఎవరికి టిక్కెట్టు ఇస్తారు. ఎవరికి టిక్కెట్లు ఇవ్వరు అని తెలుస్తుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ప్రమాణాలు కూడా కీలకమే కాబట్టి అర్హులైన వారికే బీజేపీ హైకామండ్ టిక్కెట్లు ఇస్తుందని బీజేపీ ఎంపీ సిద్దేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చెత్త పార్టీతో పోలిక ఎందుకు?

చెత్త పార్టీతో పోలిక ఎందుకు?

కర్ణాటక మంత్రి వీ. సోమన్న బీజేపీతోనే ఉంటారని, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరరని ఎంపీ సిద్దేశ్వర్ చెప్పారు. బీజేపీ నేతలు ఎవ్వరూ కాంగ్రెస్‌లో చేరరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్నకర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లు గెలుచుకుంటుందని బీజేపీ ఎంపీ సిద్దేశ్వర్ జోస్యం చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 25వ తేదీన దావణగెరెకు రానున్నారు. జీఎంఐటీకి ఆనుకుని ఉన్న వందలాది ఎకరాల భూమిని చదును చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. లోక్ సభ సభ్యుడు జీ.ఎం. సిద్దేశ్వర్‌తో పాటు బీజేపీ నేతలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సీబీ రిష్యంత్‌తో ఎంపీలు చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+