Student: లైంగిక దాడి కేసు, ప్రొఫెసర్ భార్యకు నోటీసులు, యువతి రివర్స్, ట్విస్టుల మీద ట్విస్టులు !

బెంగళూరు/మైసూరు: యూనివర్శిటీలో పీహెచ్ డీ విద్యాభ్యాసం చేస్తున్న యువతి మీద లైంగిక దాడి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ తో పాటు ఆయన భార్యకు నోటీసులు జారీ చేశారు. విశ్వవిధ్యాలయంలో చదువుతున్న అమ్మాయి మొదట తన మీద ప్రోఫెసర్ లైంగిక దాడి చేసి చిత్రహింసలకు గురి చేశాడని అధికారులకు ఫిర్యాదు చేసింది. తాను ఏ తప్పు చెయ్యలేదని, కావాలనే ఆ అమ్మాయి తన మీద లైంగిక దాడి ఆరోపణలు చేస్తోందని ఆ ప్రొఫెసర్ ఆరోపించారు. ఇదే సమయంలో తన భర్త అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్థిస్తాడని, వివాహం జరిగినప్పటి నుంచి అతని బుద్ది తనకు తెలుసని, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రోఫెసర్ భార్య డిమాండ్ చెయ్యడంతో కథ కొత్త మలుపు తిరిగింది. ఇంత రామాయణం జరుగుతున్న సమయంలో తన మీద ప్రొఫెసర్ లైంగిక దాడి చెయ్యాలని ఆ యువతి మరోసారి స్టేట్ మెంట్ ఇవ్వడంతో కథ రసవత్తరంగా మారింది. ఈ విషయంలో ప్రొఫెసర్, ఆయన భార్యకు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చెయ్యడంతో కథ మరో మలుపు తిరిగింది.

లైంగిక దాడి కేసు పెట్టిన పీహెచ్ డీ అమ్మాయి

లైంగిక దాడి కేసు పెట్టిన పీహెచ్ డీ అమ్మాయి


మైసూరు విశ్వవిధ్యాలయంలో రామచంద్రప్ప ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఇదే మైసూరు విశ్వవిద్యాలయంలో చాలా మంది పీహెచ్ డీ విద్యాభ్యాసం చేస్తూ ప్రొఫెసర్ల సూచనల మేరకు పరిశోధనలు చేస్తున్నారు. గత గురువారం మైసూరు యానివర్శిటీలో పీహెచ్ డీ చేస్తున్న యువతి తన మీద ప్రొఫెసర్ రామచంద్రప్ప రేప్ చెయ్యడానికి ప్రయత్నించి లైంగిక దాడికి పాల్పడ్డాడని మైసూరులోని జయలక్ష్మిపురం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.

ప్రొఫెసర్ క్లారిటీ

ప్రొఫెసర్ క్లారిటీ

విశ్వవిధ్యాలయంలో చదువుతున్న పీహెచ్ డీ అమ్మాయి తన మీద ప్రోఫెసర్ రామచంద్రప్ప తన మీద లైంగిక దాడి చేసి చిత్రహింసలకు గురి చేశాడని పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసింది. తాను ఏ తప్పు చెయ్యలేదని, కావాలనే ఆ అమ్మాయి తన మీద లైంగిక దాడి ఆరోపణలు చేస్తోందని ప్రొఫెసర్ రామచంద్రప్ప ఆరోపించారు.

ప్రొఫెసర్ భార్య రివర్స్

ప్రొఫెసర్ భార్య రివర్స్

మైసూరు యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న రామచంద్రప్ప భార్య కువెంపు కన్నడ రీసెర్చ్ సంస్థలో లెక్చరర్ గా పని చేస్తున్న డాక్టర్ లోలాక్షి కట్టుకున్న భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తన భర్త ప్రొఫెసర్ రామచంద్రప్ప కాలేజ్ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్థిస్తాడని, పెళైనప్పటి నుంచి అతని బుద్ది తనకు బాగా తెలుసని, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రోఫెసర్ రామచందప్ప భార్య డాక్టర్ లోలాక్షి పోలీసులకు మనవి చెయ్యడంతో కథ కొత్త మలుపు తిరిగింది.

పీహెచ్ డీ అమ్మాయి రివర్స్

పీహెచ్ డీ అమ్మాయి రివర్స్

ఇంత రామాయణం జరుగుతున్న సమయంలో తన మీద ప్రొఫెసర్ రామచంద్రప్ప లైంగిక దాడి చెయ్యాలని ఆ యువతి మరోసారి స్టేట్ మెంట్ ఇవ్వడంతో కథ రసవత్తరంగా మారింది. తాను పీహెచ్ డీ పూర్తి చెయ్యడానికి ప్రొఫెసర్ రామచంద్రప్ప పూర్తిగా సహకరిస్తున్నారని, ఆ విషయం గురించి చర్చించడానికి తన ఇంటికి ఆయన వచ్చారని, అదే సమయంలో ఆయన భార్య డాక్టర్ లోలాక్షి వచ్చి పెద్ద గొడవ చేసి తనతో బలవంతంగా ఆయన మీద లైంగిక దాడి కేసు పెట్టించిందని స్టేట్ మెంట్ ఇవ్వడంతో పోలీసులకు పిచ్చిపట్టినట్లు అయ్యింది.

ప్రొఫెసర్ దంపతులకు నోటీసులు

ప్రొఫెసర్ దంపతులకు నోటీసులు

పీహెచ్ డీ అమ్మాయి రివర్స్ తిరగడంతో ఈ కేసు రసవత్తరంగా మారింది. ఈ విషయంలో ప్రొఫెసర్ రామచంద్రప్ప, ఆయన భార్య డాక్టర్ లోలాక్షికి మైసూరు యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ శివప్ప నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చెయ్యడంతో కథ మరో మలుపు తిరిగింది. మొత్తం మీద ప్రొఫెసర్ రామచంద్రప్ప, డాక్టర్ లోలాక్షి దంపతుల గొడవ ఎక్కడ వరకు దారితీస్తుందో వేచి చూడాలని అంటున్నారు యూనివర్శిటీలోని వారి సాటి ఉద్యోగులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+