బెంగళూరులో నాన్ స్టాప్ వన్ మ్యాన్ షో, మోదీ రోడ్ షో అదుర్స్, ప్రధాని ఓపికకు హ్యాట్సాప్!
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ తన సత్తా చాటుకుంటున్నారు. శనివారం బెంగళూరులో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకు బీజేపీ నాయకులు ఊహించినదానికంటే ప్రజల నుంచి ఎక్కువ మద్దతు రావడంతో ఆ పార్టీ నాయకులు ఆకాశంతో తేతిపోతున్నారు. ఇది మోదీ హవా అంటూ బెంగళూరు ప్రజలు అంటున్నారు.
శనివారం ఉదయం మైఖ్రి సర్కిల్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కోణెణకుంటే క్రాస్ లోని కాలేజ్ లోని హెలిప్యాడ్ కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ కోణెణకుంటేలో రోడ్ షో మొదలుపెట్టారు. ఇంచుమించు ఉదయం 10.15 గంటలకు మొదలైన ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో ఎక్కడా విరామం లేకుండా కొనసాగింది.

ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకు ఉపయోగించిన ప్రత్యేక వాహనంలో బెంగళూరు బీజేపీ ఎంపీలు పీసీ మోహన్, తేజస్వి సూర్య మాత్రమే ఉండటానికి ప్రధాని నరేంద్ర మోదీ అనుమతి ఇచ్చారు. పీసీ మోహన్, తేజస్వి సూర్య ఇద్దరూ బెంగళూరు ఎంపీలు కావడంతో ఆ ఇద్దరికి మాత్రమే అవకాశం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ అనుకున్నారని తెలిసింది.
బెంగళూరుకు చెందిన బీజేపీ మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారం వాహనంలో ఎక్కడానికి ప్రధాని నరేంద్ర మోదీ అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే బెంగళూరులోని పలు నియోజక వర్గాల్లో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో జరిగింది. అందువలన అన్ని నియోజక వర్గాల బీజేపీ అభ్యర్థులు ప్రచార వాహనంలో ఉంటే లేనిపోని ఇబ్బందులు ఎదురౌతాయని అధికారులు బావించారు.
ಪ್ರಧಾನಿ ಮೋದಿಯನ್ನು ಬೀದಿ ಬೀದಿಯಲ್ಲಿ, ಗಲ್ಲಿ ಗಲ್ಲಿಗಳಲ್ಲಿ ಅಲೆಯುವಂತೆ ಮಾಡಿದ್ದು @BJP4Karnataka ಯ ಸೋಲಿನ ದಿಗಿಲು!
— Karnataka Congress (@INCKarnataka) May 6, 2023
ಮೋದಿಯನ್ನು ಈ ಪರಿ ಗೋಳಾಡಿಸುವುದು ಸರಿಯೇ?
ಸೋಲುತ್ತೇವೆ ಎಂದು ಗೊತ್ತಿದ್ದೂ ಮೋದಿಯನ್ನು ಕರೆಸುವ ಮೂಲಕ ಮೋದಿಯ ಇಮೇಜ್ ಡ್ಯಾಮೇಜ್ ಮಾಡುವ ಹುನ್ನಾರ ನಡೆಸಿದ ಮೋದಿ ಶತ್ರುಗಳು ಬಿಜೆಪಿಯಲ್ಲೇ ಇದ್ದಾರೆ!!
ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో కోసం బెంగళూరులో ప్రత్యేకంగా తయారు చేసిన వాహనంలో మోదీ, బీజేపీ ఎంపీలు పీసీ మోహన్, తేజస్వి సూర్యతో పాటు ప్రధాని భధ్రతా సిబ్బంది మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన రోడ్ షో వెళ్లిన రహదారులు అన్ని బీజేపీ జెండాలు, కాషాయ జెండాలు, జై హనుమాన్, జై భజరంగిబలి జెండాలతో రెపరెపలాడాయి.
కోణెణకుంటే క్రాస్ నుంచి కొనసాగిన ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో శనివారం మధ్యాహ్నం 12.40 గంటల సమయంలోని మల్లేశ్వరం 18వ క్రాస్ లోని స్యాంటి ట్యాక్ సమీపంలో ముగిసింది. ప్రధాని నరేంద్ర మోదీ 26 కిలోమీటర్లు పొడవునా ఎలాంటి అలసట లేకుండా ప్రతిఒక్కరికి అబివాదం చేస్తూ ప్రధాని మోదీ అందరిలో ఉత్సాహం నింపారు.
సుమారు 2. 40 గంటల పాటు ప్రధాని నరేంద్ర మోదీ కదలకుండా నిలబడుకుని నిమిషం గ్యాప్ లేకుండా రెండు చేతులు ప్రజలవైపు ఊపుతు ఎన్నికల ప్రచారం చెయ్యడంతో బెంగళూరు ప్రజలు షాక్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఎంత ఓపిక, ఈ వయసులో ఇంతసేపు కొన్ని కిలోమీటర్లు రోడ్ షో నిర్వహించి ప్రతి ఒక్కరికి అభివాదనం చేశారని బెంగళూరు ప్రజలు అంటున్నారు.












Click it and Unblock the Notifications