దేశంలోనే అతి పెద్ద తెల్లరంగు కొండ చిలువ, అర్దరాత్రి ఇంటి పక్కకు ఎలా వచ్చిందంటే!
బెంగళూరు/ మంగళూరు: కొండచిలువలు ప్రతిచోటా సాధారణం. కానీ రెండో సారి కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని కుముటాలో తెల్లరంగు కొండచిలువ కనిపించింది. అంతే కాకుండా ఈ తెల్ల కొండ చిలువ పాము భారతదేశంలో ప్రజలు పట్టుకున్న అతిపెద్ద తెల్లటి కొండచిలువ అని అటవి శాఖ అధికారులు అంటున్నారు.
ఉత్తర కన్నడ జిల్లాలోని కుమటా సమీపంలోని గ్రామంలో నివాసం ఉంటున్న హెగ్డే గాంధీ నగర్‌కు చెందిన దేవి నారాయణ్ ముక్రి ఇంటి పెరట్‌లో మంగళవారం రాత్రి తెల్లటి కొండచిలువ కనిపించింది. తెల్లటి పామును చూసిన నారాయణ్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే ఇంటి సమీపంలో నివాసం ఉంండే హోమ్ గార్డు గణేష్ ముక్రి ద్వారా రెప్టైల్ స్పెషలిస్ట్ పవన్ నాయక్‌ను సంప్రదించారు.

అర్దరాత్రి 12 గంటల సమయంలో ఘటనా స్థలానికి వెళ్లిన విషపూరిత పాములు పట్టే నిపుణుడు పవన్ నాయక్ తెల్లటి కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నాడు. గతేడాది కూడా మిర్జాన్‌లో తెల్లటి కొండచిలువ కనిపించడంతో పవన్ నాయక్ వెళ్లి రాత్రి రక్షించారు. ఈ కొండచిలువ తెలుపు రంగులో ఉండటం, చాలా అరుదుగా కనిపిస్తుండటంతో దానిని చూడటానికి ప్రజలు పోటీపడ్డారు.
విషయం తెలుసుకున్న ప్రజలుు తెల్లటి కొండచిలువ పాపును చూడటానికి పరుగు తీశారు. తెల్లటి కొండ చిలువ పాము ఫోటోలు, వీడియో తీశారు. ఇప్పుడు ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. గత ఏడాది దే ప్రాంతంలో దొరికిన తెల్లటి కొండ చిలువ కంటే దాదాపు 3 రెట్లు పెద్ద కొండచిలువ ఇప్పుడు కనిపించడంతో కుతూహలంతో దాన్ని చూసేందుకు జనం తరలివచ్చారు.
ఇది సాధారణ పైథాన్ జాతికి చెందిన పైథాన్. కానీ చర్మానికి రంగును ఇచ్చే పిగ్మెంట్ గ్రంధి అంటే మెలనిన్ లేదా పిగ్మెంట్ లేకపోవడం వల్ల చర్మం రంగు మారదు, ఫలితంగా తెలుపు రంగు వస్తుంది. దీనిని అల్బినో స్నేక్స్ అని కూడా అంటారు. కానీ అల్బినో పాముల విషయంలో, కళ్ళు కూడా ఎరుపు మరియు తెలుపు రంగులో ఉండాలి. దీని కళ్లు సగం తెల్లగా, మిగిలిన సగం రాగి రంగులో ఉన్నందున దీనిని అల్బినో పాముల జాబితాలో చేర్చలేమని పవన్ నాయక్ తెలియజేశారు.
కర్ణాటకలో తెల్లటి కొండచిలువను రక్షించడం ఇది మూడోసారి, కుముటాలో మాత్రమే రెండు సార్లు తెల్లటి కొండచిలువను రక్షించారని అటవి శాఖ అధికారులుఅంటున్నారు. ఇది భారతదేశంలో అతిపెద్ద తెల్ల కొండచిలువగా అంచనా వేయబడింది. కొండ చిలువను రక్షించింది రాత్రి కావడంతో కొండచిలువను బుధవారం ఉదయం కుమట అటవీశాఖ అధికారులకు అప్పగించారు. కొండ చిలువ పాములకు చిన్నపాటి గాయాలు కావడంతో దానిని మైసూర్ జూకి పంపారు.












Click it and Unblock the Notifications