revolver: ఎస్ఐ మీద తిరగబడిన రౌడీ, నడిరోడ్డులో ఏం చేశారంటే ?, దెబ్బకు జీవితాంతం అవటివాడు!
పట్టుకొవడానికి వెళ్లిన పోలీసుల మీద రౌడీ మారణాయుధాలతో దాడి చెయ్యడానికి ప్రయత్నించాడు. ఎస్ఐకి మండిపోయింది. ఎస్ఐ కాల్చి పారేయడంతో రౌడీ షీటర్ కాలును డాక్టర్లు పూర్తిగా నరికేయడం హాట్ టాపిక్ అయ్యింది.
బెంగళూరు/కలబురిగి: రాత్రిపూట నిత్యం రద్దీగా ఉండే సూపర్ మార్కెట్ సర్కిల్ లో కత్తి, వేట కొడవలి చేతిలో పట్టుకుని ఓ రౌడీ నానా హంగామా చేశాడు. అటువైపు వెళ్లిన ప్రజలు, పోలీసులు అతనికి బుద్దిమాటలు చెప్పి మారణాయుధాలు కిందపడేయాలని చెప్పారు. దెబ్బకు షర్టుకూడా విప్పేసిన నిందితుడు రెచ్చిపోయాడు. పోలీసులు, ఎస్ఐ ఎంత చెప్పినా రౌడీ షీటర్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు.
పట్టుకొవడానికి వెళ్లిన పోలీసుల మీద మారణాయుధాలతో దాడి చెయ్యడానికి ప్రయత్నించాడు. ఎస్ఐకి మండిపోయింది. ఎస్ఐ కాల్చి పారేయడంతో రౌడీ షీటర్ కాలును డాక్టర్లు పూర్తిగా నరికేయడం హాట్ టాపిక్ అయ్యింది.

షాపింగ్ ఏరియా
కర్ణాటకలోని కలబురిగి నగరంల అబ్దుల్ జాఫర్ సాబ్ అలియాస్ జాఫర్ అనే రౌడీ నివాసం ఉంటున్నాడు. కలబురిగిలోని సూపర్ మార్కెట్ సర్కిల్ జంక్షలో నాలుగు రోడ్లు ఉన్నాయి. స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలు నిత్యం ఈ ప్రాంతంలోనే ఎక్కువగా షాపింగ్ చేస్తుంటారు. శనివారం, ఆదివారం షాపింగ్ చేసే వారి సంఖ్య రెండింతలు ఉంటుంది.

జంక్షన్ లో రెచ్చిపోయిన రౌడీ
వాహన సంచారం కూడా ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. ఆదివారం రాత్రి జాఫర్ చేతిలో కత్తి, వేటకొడవలి పట్టుకుని సూపర్ మార్కెట్ జంక్షన్ లోకి వెళ్లాడు, నడిరోడ్డులో వేటకొడవలి పట్టుకుని ఆ ప్రాంతంలోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. కొందరు అయితే భయంతో ఆ ప్రాంతంలో నుంచి పరుగు తీశారు.

ఎస్ఐ చెప్పినా మాటమాత్రం వినలేదు
స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. జాఫర్ ను వేటకొడవలి కిందపడేయాలని పోలీసులు సూచించారు. ఆ సందర్బంలో ఇంకా రెచ్చిపోయిన జాఫర్ షర్ట్ కూడా తీసేసి నానా హంగామా చేశాడు. ఐదు నిమిషాల తరువాత కలబురిగి ఎస్ఐ వాహిద్ కోత్వాల్ అక్కడికి వెళ్లి మర్యాదగా లొంగిపోవాలని, లేదంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించారు.

రివాల్వర్ తో కాల్చి పారేసిన ఎస్ఐ
10 మందికి పైగా పోలీసులు, ఎస్ఐ ఎంత చెప్పినా రౌడీ షీటర్ జాఫర్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. పట్టుకొవడానికి వెళ్లిన పోలీసుల మీద మారణాయుధాలతో దాడి చెయ్యడానికి ప్రయత్నించాడు. వందలాది మంది ప్రజల ముందు రౌడీ రెచ్చిపోవడంతో ఎస్ఐ వాహిద్ లొంగిపోవాలని మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ సందర్బంలో బుల్లెట్లు రౌడీ జాఫర్ కాలికి దూసుకుపోవడంతో అతను కుప్పకూలిపోయాడు.

జీవితాంతం కుంటోడు అయ్యాడు
ప్రజల సమక్షంలోనే ఎస్ఐ వాహిద్ రౌడీమీద కాల్పులు జరిపారు. వెంటనే జాఫర్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే బుల్లెట్ గాయాలు ఎక్కువ కావడంతో జాఫర్ పరిస్థితి విషమంగా మారింది. జాఫర్ ప్రాణాలకు ముప్పు రావడంతో బుధవారం అతని కాలును డాక్టర్లు పూర్తిగా నరికేయడం హాట్ టాపిక్ అయ్యింది. సామాన్య ప్రజలను భయపెట్టాలని ప్రయత్నించి పోలీసుల జరిపిన కాల్పుల్లో ఓ రౌడీ కాలును వైద్యులు నరికేయడం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications