పంతం నెగ్గించుకున్న సీఎం, ఆ ముగ్గురు ఇక ఎమ్మెల్సీలు, మేడమ్ ఉమాశ్రీకి పదవి!
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ దళిత నేతల వ్యతిరేకత ఉన్నప్పటికీ హెచ్‌పీ సుదామ్ దాస్ గురువారం బెంగళూరులోని విధానసౌదలో విధాన పరిషత్ సభ్యునిగా (ఎమ్మెల్సీగా) ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక విధాన పరిషత్ నూతన సభ్యులుగా ప్రముఖ కన్నడ నటి ఉమాశ్రీ,, ఎంఆర్ సీతారామ్, హెచ్‌పీ సుదమ్ దాస్ విధానసౌధలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ బసవరాజ హొరట్టి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రులు హెచ్‌కే పాటిల్, బోసరాజుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, కొత్త ఎమ్మెల్సీల కుటుంబ సభ్యులు, వారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కొత్తగా ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన సుధామ్ దాస్ మాట్లాడుతూ నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాపై నమ్మకంతో పార్టీ నన్ను ఎమ్మెల్సీగా నియమించిందని, పెద్దల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.

అగ్రశ్రేణి వ్యక్తులు అలంకరించిన పదవి తనకు అవకాశంగా వచ్చింది. ఈ పదవికి పూర్తి న్యాయం చేస్తానని, ప్రభుత్వ అధికారిగా పనిచేసిన అనుభవాన్ని ఇక్కడ ఉపయోగించుకుంటానని సుధామ దాస్ అన్నారు. మీకు పదవి ఇచ్చే విషయంలో కొందరు మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారని మీడియా అడిగిన ప్రశ్నకు సమాదానం ఇచ్చిన సుధామ దాస్ ఇలాంటివి మామూలే, ముందు ముందు వాళ్లే నన్ను ఆశీర్వదిస్తారని అన్నారు
ఈ సందర్భంగా కన్నడ నటి, మాజీ మంత్రి ఉమాశ్రీ మాట్లాడుతూ మా పార్టీ నేతలు సీఎం సిద్ధరామయ్య, మల్లికార్జున్ ఖార్గే, డీసీఎం డీకే శివకుమార్ అందరూ నన్ను ఆశీర్వదించారని, అందుకే తనకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందని, అందరికి తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. సిద్ధరామయ్య అంటే అందరికీ ప్రేమ, గౌరవం. సకాలంలో తనకు పదవి లభించినందుకు సంతోషంగా ఉందని ఉమాశ్రీ అన్నారు.
గృహలక్ష్మి పథకం అమలుపై మీడియా అడిగిన ప్రశ్నకు సీఎం సిద్దరామయ్య సమాధానం ఇస్తూ మా ప్రభుత్వం చెప్పినట్లే చేస్తోందని, ఎన్నికల ముందు ఇచ్చిన ఉచిత హామీల పథకాలన్ని అమలు చేస్తున్నామని, ఒక్కో పథకాన్ని దశలవారీగా అమలు చేస్తున్నామని అన్నారు.
గృహలక్ష్మి పథకం బుధవారం అమలులోకి వచ్చింది. ఇది చాలా అనుకూలమైన పథకం, ఏ స్త్రీ అయినా రూ. 2, 000 పొందుతారని, మహిళలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. గృహలక్ష్మి పథకం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భవిష్యత్తులో యువత కోసం కూడా ప్రణాళిక తీసుకువస్తామని సీఎం సిద్దరామయ్య అన్నారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications