బ్యాంకులో ఉద్యోగాలు, కిలాడీ లేడీస్ ఏం చేశారంటే, తల్లి అకౌంట్ కు రూ. కోట్లు బదిలి!
బెంగళూరు: మీ ఇంటికి వాస్తు దోషం ఉందని, అందుకే లేనిపోని కష్టాలు వస్తున్నాయని ఓ వృద్ధురాలికి చెందిన కోట్ల రూపాయల విలువైన ఇంటిని విక్రయించి తర్వాత ఆమెను మోసం చేసి రూ. మూడు కోట్ల రూపాలు లూటీ చేసిన కిలాడీ గ్యాంగ్ పోలీసులకు చిక్కింది. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న ఇద్దరు మహిళా ఉద్యోగినులుతో పాటు వారి కుటుంబ సభ్యులను బెంగళూరులోని బనశంకరి పోలీసులు అరెస్టు చేశారు.
బెంగళూరులోని నాగరబావిలో నివాసం ఉంటున్న రాకేశ్, ఆయన భార్య ఆరుంధతి, శివమొగ్గ జిల్లాకు చెందిన విశాల, ఆమె కుమార్తె అపూర్వలను అరెస్టు చేశారు. తప్పించుకున్న సంజీవప్ప, పరిమల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కొంత కాలం క్రితం తమకు తెలిసిన బెంగళూరు నగరంలోని పద్మనాభనగర్‌లో నివాసం ఉంటున్న శాంత (65) అనే మహిళను బ్యాంక్ ఉద్యోగాలు అపూర్వ, ఆరుంధతి కలిశారు.

ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేసి శాంత భర్త కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించారు. కొన్ని సంవత్సరాల క్రితం బసనవగుడిలోని ఓ ప్రైవేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్న ఆరుంధతి, అపూర్వ శాంతకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి శాంతకు ఇద్దరు కిలాడీ లేడీలు టచ్ లో ఉన్నారు. వీరి స్నేహంతో శాంత ఆమె ఆర్థిక వ్యవహారాలను గురించి అపూర్వ, అరుందితో చర్చించారు.
ఈ విధంగా రెండు సంవత్సరాల క్రితం పద్మనాభనగరలోని శాంతకు చెందిన కోట్ల రూపాయల విలువైన ఇంటి మీద అపూర్వ, అరుంధతి కన్ను వేశారు. శాంత ఇంటిని తక్కువ ధరకు విక్రంచి వచ్చిన డబ్బును కొట్టేయాలని స్కెచ్ వేశారు. మీ ఇంటికి వాస్తు దోషం ఉందని, మీకు లేనిపోని కష్టాలు వస్తున్నాయని, అందుకే ఇంటిని అమ్మేసి ప్రశాంత జీవితం గడపాలని అపూర్వ, అరుమంధతి పరిచయం ఉన్న శాంతకు మాయమాటలు చెప్పారు.
శాంత ఆమె ఇల్లు అమ్మేసే విధంగా ఆరుంధతి, అపూర్వ కలసి బ్రైన్ వాష్ చేశారు. తర్వాత ఆరుధంతి భర్త రాకేశ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా అవతారం ఎత్తాడు. రాకేష్ ద్వారానే శాంత ఇంటిని రూ. 4. 50 కోట్లకు అమ్మేశారు. ఇల్లు అమ్మడంతో వచ్చిన డబ్బులో శాంత రెండు బ్యాంక్ అకౌంట్లలో ఫిక్సెడ్ డిపాజిట్లు చేశారు. బ్యాంక్‌లో ఉన్న మీ ఎఫ్‌డీ ఖాతాని క్లోజ్ చెయ్యాలని, డబ్బు షేర్ మార్కెట్ లో పెడితే రెండింతలు అవుతుందని అరుంధతి, అపూర్వ కలిసి శాంతకు మాయమాటలు చెప్పారు.
నిందితుల మాయమాటలు నమ్మిన శాంత కత్రిగుప్పెలో ఉన్న జాతీయ బ్యాంక్ శాఖలో ఉన్న ఫిక్సెడ్ డిపాజిట్ రూ. 1.9 కోట్ల రూపాయల వితడ్రా చెయ్యాలని ఆలోచించారు. తరువాత అపూర్వ, అరుంధతి కలిసి శాంత తగ్గర ఖాళీ చెక్ ల మీద సంతకాలు, కొన్ని పేపర్లలో సంతకాలు చేయించుకున్నారు.
ఇలా శాంతకు చెందిన అకౌంట్ లలో నుంచి ఆర్‌టీజీఎస్ చేసిన నిందితులు శాంత ఖాతా నుంచి కోటి రూపాయలు జూన్‌లో అపూర్వ తల్లి విశాల అకౌంట్ కు, ఆమె మామ సంజీవప్ప బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశారు. అయితే ప్రతినెల ఫిక్సెడ్ డిపాజిట్ లకు సంబంధించి వడ్డీ డబ్బులు ఎంత వచ్చాయి అని మొబైల్ కు బ్యాంక్ నుండి ఎస్‌ఎమ్‌ఎస్‌కు రాకపోవడంతో శాంతకు అనుమానం వచ్చింది.
శాంత బ్యాంకు అధికారులను సంప్రదించారు. బ్యాంకు అధికారులు ఆరా తీస్తే అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. వెంటనే బ్యాంకు అదికారులు, శాంత ఈ విషయం బనశంకరి పోలీస్ పోలీసులకు శాంత ఫిర్యాదు. చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా హుండిపుర గ్రామానికి చెందిన ఆరుంధతి గతంలో మైసూరులో ఓ ప్రైవేట్ బీమా కంపెనీలో పని చేసింది.
రాకేశ్‌తో వివాహమైన తర్వాత బెంగళూరుకు వచ్చి ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగంలో చేరిందని, బీమా చేయించే విషయం గురించి శాంతతో పరిచయం పెంచుకుని ఆరుంధతితో కలిసి నిలువునా లూటీ చేసిందని పోలీసులు అన్నారు. నిందితుల నుంచి రూ. 1 కోటి రికవరీ చేశామని, ఇంకా మిగిలిన డబ్బు స్వాధీనం చేసుకోవలని ఉందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications