బిగ్‌బాస్ హౌస్‌లో ఘోరం.. ఆ బ్యూటీ కంటికి గాయం: గోళ్లతో..ఎరుపెక్కిన కళ్లతో: హింసాత్మకంగా?

బిగ్‌బాస్‌లో హౌస్‌ వేడెక్కుతోంది. కంటెస్టెంట్ల మధ్య అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతోంది. ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని సాధించుకోవడానికి ముష్టిఘాతాలకు దిగుతున్నట్లు కనిపిస్తోంది. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య వాడివేడిగా చర్చలు సాగడం, తోసుకోవడం, అరచుకోవడం, బీప్ సౌండ్ వినిపించాల్సిన పదాలు వారి నోటి నుంచి వెలువడటం వంటి సందర్భాలను ఇప్పటిదాకా చోటు చేసుకుంటూ వచ్చాయి. ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ మరో అడుగు ముందుకేసినట్లుగా ఉంది. చేయి చేసుకునేంత వరకూ వెళ్లిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

ఆ బ్యూటీ కంటికి గాయం..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్-14 సీజన్‌లో హౌస్‌మేట్స్ మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ సందర్భంగా వారి మధ్య ఈ ఘటన సంభవించి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ వారం ఎలిమినేషన్‌కు గురైన సారా గుర్పాల్ కంటికి గాయం కావడం ఈ అనుమానాలకు తావిస్తోంది. కంటికి ఎలా గాయమైందనే విషయాన్ని ఆమె వెల్లడించనప్పటికీ.. బిగ్‌బాస్ ఇచ్చిన ఓ టాస్క్ సందర్భంగా గాయపడిందని అంటున్నారు. ఎలిమినేషన్‌కు గురై బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తరువాత ఆమె ఆసుపత్రికి వెళ్లిందని చెబుతున్నారు.

ఆ కారణంతోనే ఎలిమినేషన్?

ఆ కారణంతోనే ఎలిమినేషన్?


సారా గుర్పాల్ పంజాబీ గాయని. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ఎంపిక అయ్యారు. బిగ్‌బాస్ ఇచ్చిన ఓ టాస్క్‌ను పూర్తి చేసే సమయంలో నిక్కీ తంబోలి, ఇతర కంటెస్టెంట్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని, ఆ సమయంలో కంటికి గాయమైందని చెబుతున్నారు. టాస్క్ సమయంలో నిక్కీ తంబోలి గోళ్లు ఆమె కంటికి తగిలాయని, ఫలితంగా గాయమైందని అంటున్నారు. ఉద్దేశపూరకంగా ఈ ఘటన చోటు చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కంటికి గాయం తరువాత.. సారా గుర్పాల్ హౌస్‌లో కొనసాగలేకపోయారని, వైద్యం చేయించుకోవాలనే కారణంతోనే ఆమెను ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది.

Recommended Video

    After Virat Kohli-Anushka Sharma, Zaheer Khan and Sagarika Ghatge Expecting First Child!!
    సారా ఎలిమినేషన్‌పై..

    సారా ఎలిమినేషన్‌పై..

    సారా గుర్పాల్ ఎలిమినేషన్‌పై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ కంటెస్టెంట్లలో చాలామందితో పోల్చుకుంటే ఆమె మెరుగ్గా గేమ్‌ను ఆడుతున్నప్పటికీ.. ఎలిమినేషన్‌కు గురయ్యారని అంటున్నారు. బిగ్‌బాస్-7 సీజన్ ఫేమ్ వీజే ఆండీ వంటి మాజీ కంటెస్టెంట్లు.. సారా గుర్పాల్‌ ఎలిమనేషన్‌ను తప్పు పడుతున్నారు. సారా గుర్పాల్ వంటి సాఫ్ట్ నేచర్ గల వారు బిగ్‌బాస్ హౌస్‌లో ఎక్కువ కాలం పాటు కొనసాగలేరనే సందేశాన్ని ఇచ్చినట్టయిందని మాజీ కంటెస్టెంట్స్ అభిప్రాయపడుతున్నారు. ఆమె ఎలిమినేషన్ కావడం వల్ల పంజాబ్ నుంచి రెప్రజెంట్ చేసే వారి సంఖ్య తగ్గిందని, దాని ప్రభావం టీఆర్పీపై పడుతుందనే వాదనలూ ఉన్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+