Bigg Boss:వాళ్లెవరు నన్ను ఎలిమినేట్ చేయడానికి.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కంటెస్టెంట్..

సల్మాన్‌ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్ 14 నుంచి తనను అన్యాయంగా ఎలిమినేట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది పంజాబీ సింగర్ సారా గుర్పాల్. ఇప్పటికే తెలుగు బిగ్‌బాస్‌ షోలో జరుగుతున్న ఎలిమినేషన్ ప్రక్రియపై కంటెస్టెంట్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తుండగా ఇటు హిందీ కంటెస్టెంట్లు కూడా ఎలిమినేషన్ ప్రక్రియపై పెదవి విరుస్తున్నారు.

 అన్యాయంగా ఎలిమినేట్ చేశారు

అన్యాయంగా ఎలిమినేట్ చేశారు

హిందీ బిగ్‌ బాస్ షో నుంచి తొలివారంలో ఎలిమినేట్ అయిన సింగర్ సారా గుర్పాల్... ఎలిమినేషన్ ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా జరిగిందో చాలామందికి తెలియదని ఇందులో పూర్తిగా అన్యాయమే జరిగిందని చెప్పుకొచ్చింది. అంతకుముందు బిగ్‌బాస్ సీజన్లలో పాల్గొన్న సిద్ధార్థ్ శుక్లా, గౌహార్ ఖాన్, హీనా ఖాన్‌లు తనను ఎలా ఎలిమినేట్ చేస్తారని ఆమె ప్రశ్నించింది. కేవలం ఒకవారం మాత్రమే ఇంట్లో ఉన్నట్లు చెప్పిన సారా... తనకు అనుభవం లేదని ఆ ముగ్గురు ఎలా నిర్ణయించి ఎలిమినేట్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర ఇంటి సభ్యుల్లానే తనకు కూడా జాన్ కుమార్ సాను నుంచి మాత్రమే నామినేషన్ వచ్చిందని , అలాంటప్పుడు తనను మాత్రమే ఎలా ఎలిమినేట్ చేస్తారని ప్రశ్నించింది.

 సిద్ధార్థ్ శుక్లా నన్ను ఎలిమినేట్ చేసేందుకు ఫిక్స్ అయ్యాడు

సిద్ధార్థ్ శుక్లా నన్ను ఎలిమినేట్ చేసేందుకు ఫిక్స్ అయ్యాడు

తనను ఎలిమినేట్ చేసేందుకు గత సీజన్ విజేత సిద్ధార్థ్ శుక్లా పట్లుదలతో ఉన్నాడని, ఫిక్స్ అయి వచ్చాడని అందుకే ఎలిమినేట్ చేశాడని సారా ఆరోపించింది. అయితే ఎలిమినేషన్ ప్రక్రియ ఆడియెన్స్‌కు అప్పగించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది. ఇంట్లో నుంచి బయటకు తనను పంపేందుకు ఎవరికీ ఇష్టం లేదని ఒక్క సిద్ధార్థ్ శుక్లాకు మాత్రమే ఉందని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది. గౌహర్ ఖాన్, హీనా ఖాన్‌లకు నిశాంత్‌ను ఎలిమినేట్ చేయాలని భావించారు కానీ, సిద్ధార్థ్ మాత్రం తన ఎలిమినేషన్ పై మాత్రమే ఫోకస్ చేసినట్లు సారా వెల్లడించింది. బిగ్ బాస్ అనేది ప్రేక్షకుల షో.. అలాంటప్పుడు ఎలిమినేట్ చేసే అవకాశం వారికివ్వకుండా గత సీజన్‌ కంటెస్టెంట్లకు ఇవ్వడమేంటని ప్రశ్నించింది సారా.

Recommended Video

    Bigg Boss Telugu 4 : Monal Ghajjar Extra Glamour క్లివెజ్ షో తో మోనాల్ రచ్చ || Oneindia Telugu
     సారాకు నెటిజెన్లు మద్దతు

    సారాకు నెటిజెన్లు మద్దతు

    ఇదిలా ఉంటే సారా ఎలిమినేట్ అయిన తర్వాత ఒక వర్గంకు చెందిన నెటిజెన్లు మాత్రం ఎలిమినేషన్ ప్రక్రియపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రక్రియ సరికాదంటూ ఏకంగా షో హోస్ట్ సల్మాన్ ఖాన్‌ను ట్రోల్ చేశారు. వెంటనే సారా గుర్పాల్‌ను తిరిగి ఇంటిలోకి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మరో అవకాశం ఆమెకు ఇవ్వాలని సారాకు అండగా నిలిచారు. ఇప్పటి వరకు తెలుగులోనే జరిగిన ఎలిమినేషన్ రచ్చ.. ఇప్పుడు హిందీలో కూడా వివాదంగా మారుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+