Bigg Boss Telugu 6: తొలి వారం ఎలిమినేషన్.. ట్విస్ట్ అద్దిరిపొయ్యెన్..!!
హైదరాబాద్: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అప్పుడే తొలివారాన్ని పూర్తి చేసుకుంది. అంచనాలకు అందని విధంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ మధ్య బిగ్‌బాస్ పెట్టే గేమ్స్ ఆసక్తిని రేపుతున్నాయి. తొలివారం హౌస్ కేప్టెన్‌గా బాలాదిత్య సెలెక్ట్ అయ్యాడు. స్టార్ ఆఫ్ ది వీక్ టైటిల్‌ను కూడా ఎగరేసుకెళ్లాడు. ఫస్ట్ గిఫ్ట్ హ్యాంపర్‌ను అందుకున్నాడు.

స్టార్‌గా..
మెరీనా-రోహిత్, ఆదిరెడ్డి, బాలాదిత్య, గీతూ రాయల్, నేహా చౌదరి, ఆర్జే సూర్య మధ్య కొనసాగిన కెప్టెన్సీ టాస్క్‌లో బాలాదిత్య విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఆదివారం రాత్రి నాటి ఎపిసోడ్‌లో నిర్వహించిన క్విజ్‌లో టాపర్‌గా నిలిచాడు బాలాదిత్య. స్టార్ ఆఫ్ ద వీక్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. కంటెస్టెంట్స్ మధ్య టాస్కులు కాస్త మోతాదు మించుతున్నట్టు అనిపిస్తోన్నప్పటికీ- స్పాంటేనియస్ కనిపిస్తోంది. టాస్కుల్లో పాల్గొనే సమయంలో కంటెస్టెంట్లు- శతృవుల్లా వ్యవహరిస్తోన్నారు.

చివరి వరకు సస్పెన్స్..
బిగ్‌బాస్ సీజన్‌లో ఆదివారం వచ్చేసరికి ఎవరో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడం సాధారణం. తొలివారమే హౌస్ నుంచి వెళ్లిపోయే ఆ కంటెస్టెంట్ ఎవరనేది చిట్టచివరి వరకూ టెన్షన్‌కు గురి చేస్తుంటుంది వీక్షకులకు. ఈ సీజన్ ఫస్ట్ ఎలిమినేషన్ కూడా దానికి ఏ మాత్రం తీసిపోలేదు. చివరి వరకూ సస్పెన్స్ కొనసాగింది. శ్రీసత్య, చలాకి చంటి, రేవంత్, ఆరోహి, ఫైమా, ఇనయ సుల్తానా, అభినయశ్రీ.. ఎలిమినేషన్‌కు ఎంపికయ్యారు. వారిలో శ్రీసత్య, చలాకి చంటి శనివారమే సేఫ్ అయ్యారు.

ఎక్కువ కంప్లైంట్లు..
రేవంత్, ఆరోహి, ఫైమా, ఇనయ సుల్తానా, అభినయశ్రీల్లో ఒకరు తొలివారమే ఎలిమినేట్ కావడం ఖాయమైందనుకున్న దశలో హోస్ట్ అక్కినేని నాగార్జున అక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చాడు హోస్ట్ అక్కినేని నాగార్జున. ఈ అయిదుమందిలో ఫైమా, రేవంత్ సేఫ్ అయ్యారు. ఆరోహి, ఇనయ సుల్తానా, అభినయశ్రీ చివరి వరకు నిలిచారు. ఇనయపై ఏకంగా 14 మంది కంటెస్టెంట్లు కంప్లైట్లు ఇవ్వడంతో ఆమె కన్నీటిపర్యంతమైంది.

నో ఎలిమినేషన్..
ఎక్కువ కంప్లైంట్లు అందుకున్న ఇనయనే తొలివారం ఎలిమనేట్ అవుతారని భావించారంతా. అందరి అంచనాలకు తలకిందులు చేశారు అక్కినేని నాగార్జున. ఈ వారం ఎవ్వరినీ ఎలిమినేట్ చేయట్లేదంటూ ప్రకటించారు. ఎక్కువమంది కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసినప్పుడే ఇలాంటి ట్విస్ట్ ఏదో ఒకటి ఉండొచ్చంటూ నెటిజన్లు ముందే అనుమానాలు వ్యక్తం చేశారు. వాటిని నిజం చేశాడు నాగార్జున. ఫస్ట్ వీక్- నో ఎలిమినేషన్‌గా మారింది.












Click it and Unblock the Notifications