Bigg Boss Telugu 6: హౌస్‌లో గ్లామర్ ట్రీట్: యవ్వారం వేరే లెవెల్: ప్రొమో అవుట్..!!

హైదరాబాద్: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 వచ్చేసింది. ఇంకొన్ని గంటల్లో ప్రతి ఇంటినీ పలకరించబోతోంది. ఇవ్వాళ్టి నుంచే బిగ్ బాస్ సీజన్ 6 ఆరంభం కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా కొద్దిసేపటి కిందటే విడుదలైంది. నాగార్జున తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌‌పై దీన్ని పోస్ట్ చేశారు. ఆ వెంటనే అది వైరల్‌గా మారింది.

జూనియర్‌తో..

ఇప్పటివరకు అయిదు సీజన్లల్లో బిగ్ బాస్ హౌస్‌లో కనిపించిన గ్లామర్ వేరు.. ఇప్పుడు చూడబోయే ట్రీట్ వేరు. ప్రోమో దీన్ని ప్రూవ్ చేస్తోంది కూడా. 2017లో తొలిసారిగా తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలైంది. నిరాటంకంగా కొనసాగుతూ వస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల్లో కూడా దీనికి బ్రేక్ పడలేదు. తొలి సీజన్‌కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆ తరువాత ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నాడు. ఆ సీజన్‌లో నటుడు శివబాలాజీ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. ఆదర్శ్ రన్నరప్.

గత సీజన్‌లో..

గత సీజన్‌లో..

రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్‌లో కౌశల్ మందా విన్నర్ కాగా.. ప్లేబ్యాక్ సింగర్ గీతా మాధురి రెండో స్థానంలో నిలిచారు. మూడో సీజన్ నుంచి అక్కినేని అందగాడి హవా మొదలైంది. 2019 నాటి మూడో సీజన్‌లో నేపథ్య గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ విజేతగా ఆవిర్భవించాడు. టాప్ యాంకర్ శ్రీముఖి రెండో స్థానానికి పరిమితం అయ్యారు. నాలుగో సీజన్‌ టైటిల్‌ను అభిజిత్ ఎగరేసుకెళ్లాడు. అఖిల్ సార్థక్ రన్నరప్. ఆ తరువాతి సీజన్‌లో వీజే సన్నీ ఛాంపియన్ కాగా యూట్యూబర్ షణ్ముఖ్‌ది రెండోస్థానం.

గ్లామరస్ ట్రీట్..

గ్లామరస్ ట్రీట్..

ఈ సారి కంటెస్టెంట్లల్లో ప్లేబ్యాక్ సింగర్ ఎల్వీ రేవంత్, శ్రీహాన్, నటుడు బాలాదిత్య, టీవీ కపుల్స్ మరినా అబ్రహం-రోహిత్ సాహ్ని, నటి అభినయ శ్రీ, జబర్దస్త్ ఫేమ్ తన్మయ్, చలాకి చంటి, యాంకర్ ఆరోహి రావ్, వీజే/స్పోర్ట్స్ రెప్రజెంటేటర్ నేహా చౌదరి, యూట్యూబర్ ఆదిరెడ్డి, నటి శ్రీ సత్య, నటి సుదీప పింకీ, బిగ్ బాస్ రివ్యూవర్ గీతు రాయల్, నటి వాసంతి కృష్ణన్, ఇనయ సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, కీర్తి భట్, అర్జున్ కల్యాణ్, రాజశేఖర్, షానీ సోలొమన్ ఉన్నారు. వీరిలో కొందరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు.

అంతకుమించి..

అంతకుమించి..

బిగ్ బాస్ సీజన్ 6 అంతకుమించి అనే స్థాయిలో ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. హౌస్‌ను ఇంకాస్త డిఫరెంట్‌గా తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగా కంటెస్టెంట్ల లిస్ట్ కూడా మరింత గ్లామరస్‌గా కనిపిస్తోంది. గ్లామర్ ట్రీట్‌ డోస్ మరింత పెంచేలా గేమ్స్‌ను నిర్వాహకులు డిజైన్ చేశారనే ప్రచారం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+