14 ఏళ్లకే స్టార్టప్ అధినేత, బుర్జ్ ఖలీఫాలో ఆఫీస్.. భారత సంతతి బాలుడి రికార్డ్!

విజయానికి వయస్సుతో సంబంధం లేదని నిరూపించాడు ఓ 14 ఏళ్ల బాలుడు. తన తెలివితేటలతో వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేశాడు. ఆ బాలుడు మరెవరో కాదు భారత సంతతికి చెందిన జైనమ్ జైన్. ఈ బాలుడు స్కూలుకు వెళ్లే సమయంలోనే ఓ పెద్ద వ్యాపారాన్ని నిలబెట్టి అద్భుతం సృష్టించాడు. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే దుబాయ్‌లోని ప్రపంచంలోనే ఎత్తైన భవనం 'బుర్జ్ ఖలీఫా' 141వ అంతస్తులో తన కంపెనీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. ఈ ఘనత సాధించడం ద్వారా దుబాయ్ వ్యాపార రంగంలోనే సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంతకీ ఇంత చిన్న ప్రాయంలోనే ఆ అబ్బాయి సాధించిన విజయ రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఏఐ స్టార్టప్ 'మెంగో ఇంజిన్'
జైనమ్ జైనమ్ తన పద్నాలుగో ఏటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్టార్టప్‌ను ప్రారంభించాడు. దీనికి 'మెంగో ఇంజిన్' అని పేరు పెట్టాడు. ఈ క్రమంలో దుబాయ్‌లోనే అతి పిన్న వయస్కుడైన ఏఐ స్టార్టప్ ఫౌండర్‌గా జైనమ్ రికార్డు సాధించాడు. అంతే కాకుండా.. ఇతను ఒక TEDx స్పీకర్ కూడా. జైనమ్ జైన్ పేరిట ఇప్పటికే రెండు పేటెంట్లు ఉండగా.. మరికొన్ని ఇంకా ప్రాసెస్‌లో ఉన్నాయి. ఒక పుస్తకాన్ని కూడా రచించిన జైనమ్ జైన్.. యూట్యూబ్‌లో 1,45,000 మందికి పైగా సబ్‌స్క్రైబర్లతో ఓ పెద్ద కమ్యూనిటీని నడుపుతున్నాడు. ఈ విజయాలన్నింటికీ అతడిలో ఉన్న నిరంతర కృషి అనే ఒకే ఒక్క అలవాటు వల్లే ఇవన్నీ సాధించగలిగాడు.

14-Yr-Old Jainam Jain Opens AI Startup Office at Burj Khalifa Sets New Record Full Details

అసలు ఈ స్టార్టప్ ఏం చేస్తుందంటే?
జైనమ్ జైన్ ప్రారంభించిన ఈ ఏఐ స్టార్టప్.. వివిధ వ్యాపార సంస్థలకు సంబంధించిన మార్కెటింగ్, కస్టమర్ ఎంగేజ్మెంట్, సేల్స్, కంటెంట్ క్రియేషన్‌ను సులభతరం చేసేందుకు డిజైన్ చేయబడింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం ఓ బజ్ వర్డ్‌గా మారకముందే జైనమ్ దీనిపై పని చేయడం ప్రారంభించాడు. కంపెనీల మార్కెటింగ్, లీడ్ మేనేజ్మెంట్, న్యూస్ లెటర్స్, కస్టమర్ కమ్యూనికేషన్ వంటి పనులను ఇది సులభతరం చేస్తుంది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫారమ్ బీటా స్టేజ్‌లో ఉంది. ఎన్నో కంపెనీలు దీనిని ఉపయోగించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ఆరేళ్ల వయసులోనే వ్యాపార పాఠాలు
తన వ్యాపార ప్రయాణం గురించి జైనమ్ జైన్ మాట్లాడుతూ.. తన ఆరేళ్ల ప్రాయంలోనే తన తండ్రి తనను మొదటి బిజినెస్ మీటింగ్‌కు తీసుకెళ్లారని.. అక్కడే తనకు వ్యాపారానికి సంబంధించిన తొలి పాఠం లభించిందని వెల్లడించాడు. ఆ చిన్ననాటి అనుభవమే అతనిలో బిజెనెస్ పట్ల కుతూహలాన్ని పెంచింది. సాధారణ చదువులకే పరిమితం కాకుండా.. ప్రజలను కలవడం, ఈవెంట్లలో పాల్గొనడం ద్వారా ప్రాక్టికల్‌గా విషయాలను నేర్చుకున్నాడు. ఈ భిన్నమైన ఆలోచనా విధానమే అతని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కలలను నిజం చేసుకోవడానికి సమయాన్ని ఇచ్చింది.

యూనికార్న్ కంపెనీయే లక్ష్యం
భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే ఓ యూనికార్న్ కంపెనీని నిర్మించడమే తన లక్ష్యమని జైనమ్ జైన్ ధీమాగా చెబుతున్నాడు. ఈ బుజ్జి బిజినెస్ మ్యాన్ 10 ఏళ్ల వయసు నుంచే అతను తనకు తానుగా 50 రోజుల సవాళ్లు ఇచ్చుకునేవాడు. అందులో భాగంగా 50 పుస్తకాలు చదవడం, 50 నెట్వర్కింగ్ ఈవెంట్స్‌కు హాజరవడం, ఎంతో మంది వ్యాపారవేత్తలను కలిసి వారి నుంచి విషయాలు నేర్చుకోవడానికి భారత్ అంతటా దాదాపు 6,000 కిలోమీటర్లు ప్రయాణించడం విశేషం. జైనమ్ జైన్ సాధించిన ఈ విజయం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+