ముంబై ఎయిర్పోర్టుకు మహర్దశ-బిలియన్ డాలర్లను సమీకరించిన అదానీ గ్రూప్..!

అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ (AAHL) ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (MIAL) కోసం ఒక బిలియన్ డాలర్ల నిధులను విజయవంతంగా సమీకరించింది. ఇందులో 750 మిలియన్ డాలర్ల నోట్స్ ద్వారా సేకరించిన నిధులు ఉన్నాయి. ఈ నిధుల సమీకరణ ద్వారా మూలధన వ్యయం, స్థిరత్వ కార్యక్రమాలను మరింత మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ముంబై ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి బిలియన్ డాలర్ల నిధులు

భారతదేశంలో అతిపెద్ద విమానాశ్రయ నిర్వాహకులలో అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ (AAHL) ఒకటి. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి కోసం ఒక బిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. ఇందులో భాగంగా 750 మిలియన్ డాలర్ల విలువైన నోట్స్‌ (బాండ్లు)ను జారీ చేయడం ద్వారా నిధులను సమీకరించారు. ఈ బాండ్లు 2029లో మెచ్యూర్ అవుతాయి. ఈ నిధులను మునుపటి రుణాలను తిరిగి చెల్లించడానికి ఉపయోగిస్తారు.

మిగిలిన 250 మిలియన్ డాలర్లను విమానాశ్రయం అభివృద్ధి, ఆధునీకరణ, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం వినియోగించనున్నారు. ఈ పెట్టుబడి భారతదేశ మౌలిక సదుపాయాల రంగంలో వృద్ధికి దోహదం చేస్తుంది.

అపోలో మేనేజ్‌డ్ ఫండ్స్, బ్లాక్‌రాక్ మేనేజ్‌డ్ ఫండ్స్ ఇతర పెట్టుబడిదారులు అదానీ ఎయిర్‌పోర్ట్స్ యొక్క ఈ ప్రయత్నంలో భాగస్వాములయ్యారు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెట్టారు. MIAL యొక్క రుణ నాణ్యత BBB-/stableగా ఉంది. ఇది దీర్ఘకాలిక వృద్ధికి నిదర్శనం.

విమానాశ్రయాన్ని ఆధునీకరించడం, విస్తరించడం, డిజిటలైజేషన్ చేయడంతో పాటు వివిధ విభాగాలను సమగ్రపరచడం MIAL యొక్క ప్రధాన లక్ష్యాలు. ఈ లక్ష్యాలను 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. AAHLకు సంబంధించి 750 మిలియన్ డాలర్ల నోట్లకు పలు బ్యాంకుల నుండి ఆదరణ లభించింది.

అదానీ ఎయిర్‌పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ భారతదేశ తదుపరి తరం విమానాశ్రయాలకు ఒక వేదికగా నిలుస్తుందని అదానీ గ్రూప్ పేర్కొంది. అపోలో మేనేజ్‌డ్ ఫండ్స్ పెట్టుబడిదారులకు మూలధనాన్ని సమకూర్చడానికి సహాయపడుతుంది. తద్వారా పెట్టుబడులపై మంచి రాబడి పొందే అవకాశం ఉంది.

అపోలో మేనేజ్‌డ్ ఫండ్స్ అధిక-నాణ్యత గల సంస్థాగత పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. పెట్టుబడి-గ్రేడ్ క్రెడిట్ ప్రమాణాలను పాటిస్తూ దీర్ఘకాలిక విలువను సృష్టిస్తుంది అని సంబంధిత వర్గాలు తెలిపాయి.ఈ ట్రాన్సాక్షన్ కోసం MIAL కు A&O షియర్‌మన్ మరియు సిరిల్ అమర్‌చంద్ మంగల్‌దాస్ లీగల్ సలహాదారులుగా వ్యవహరించగా, మిల్ బ్యాంక్ ఎల్‌ఎల్‌పి మరియు ఖైతాన్ & కో. ఇన్వెస్టర్ల కౌన్సిల్స్‌గా పనిచేశాయి.

ఈ పెట్టుబడి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి, ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడానికి దోహదం చేస్తుంది. దేశీయ విమానయాన రంగానికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+