అదానీ గ్రూప్‌కు కేదారనాథ్ రోప్‌వే నిర్మాణ బాధ్యతలు
అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (AEL) సోన్‌ప్రయాగ్ నుంచి కేదార్‌నాథ్‌కు రోప్‌వే ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ ప్రాజెక్ట్ లక్షలాది మంది భక్తులకు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అంతేకాకుండా, భద్రతను మెరుగుపరుస్తుంది.
నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (NHLML) నుంచి అదానీ పోర్ట్‌ఫోలియోలోని అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన లెటర్ ఆఫ్ అవార్డ్ (LoA) అందింది. AEL రోడ్స్, మెట్రో, రైల్, వాటర్ (RMRW) విభాగం ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తుంది.

12.9 కిలోమీటర్ల పొడవైన ఈ రోప్‌వే అందుబాటులోకి వస్తే, 9 గంటల కష్టతరమైన నడక మార్గం 36 నిమిషాలకు తగ్గుతుంది. తద్వారా కేదార్‌నాథ్ యాత్ర సులభతరం, సురక్షితంగా మారుతుంది. ఈ రోప్‌వే గంటకు 1,800 మంది ప్రయాణికులను ఒక దిశలో తరలించగలదు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులకు సేవలు అందిస్తుంది. కేదార్‌నాథ్‌కు ఏటా సుమారు 20 లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యతను ఇది తెలియజేస్తుంది.
ఈ రోప్‌వే "పర్వతమాల పరియోజన"లో భాగంగా నేషనల్ రోప్‌వేస్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగం. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) పద్ధతిలో అభివృద్ధి చేయబడిన ఈ ప్రాజెక్ట్ పూర్తవడానికి ఆరు సంవత్సరాలు పడుతుంది. నిర్మాణానంతరం AEL దీనిని 29 సంవత్సరాల పాటు నిర్వహిస్తుంది. ఈ ప్రాజెక్ట్ అనుసంధానాన్ని మెరుగుపరచడమే కాకుండా, ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. పర్యాటకాన్ని పెంచుతుంది.
"కేదార్‌నాథ్ రోప్‌వే కేవలం ఇంజినీరింగ్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఇది భక్తికి, ఆధునిక మౌలిక సదుపాయాలకు మధ్య ఒక వారధి" అని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. "ఈ పవిత్ర యాత్రను సురక్షితంగా, వేగంగా, మరింత అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, మేము లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తున్నాము. NHLML, ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో మా భాగస్వామ్యం ద్వారా ఉత్తరాఖండ్ ప్రజలకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాము. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ దేశానికి సేవ చేయడమే కాకుండా, ప్రజలను ప్రయోజనాలను చేకూర్చే మౌలిక సదుపాయాలను నిర్మించాలనే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది" అని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications