వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైట్లీజీ!: బ్యాంకుల్ని కాపాడండి.. ఏఐబీఈఏ.. మొండి రుణాల్లో ఇళ్ల రుణాలకూ వాటా

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌/ ముంబై : బ్యాంకింగ్‌ రంగం కాపాడుకోవడానికి పటిష్ఠంగా రక్షణాత్మక చర్యలు చేపట్టాలని ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీకి అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) కోరింది. ఈ మేరకు ఆర్థిక శాఖ, బ్యాంకు యాజమాన్యాలు, బ్యాంకు ఉద్యోగ సంఘాలతో త్రైపాక్షిక సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం కోరారు.
బ్యాంకు ఉద్యోగులు, అధికారులను ఏక మొత్తంగా బదిలీలు చేయకూడదని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం కోరారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్బీ)లో నీరవ్‌ మోదీ కుంభకోణం నేపథ్యంలో ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీకి ఆయన లేఖ రాశారు.

 సీవీసీ సూచన మేరకు ఉద్యోగులు, అధికారుల బదిలీ

సీవీసీ సూచన మేరకు ఉద్యోగులు, అధికారుల బదిలీ

పీఎన్బీలోని వివిధ స్థాయి ఉద్యోగుల నిర్లక్ష్యం వల్లే ఈ కుంభకోణం జరిగిందని అంటున్నారని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి వెంకటాచలం గుర్తు చేశారు. కానీ, అత్యున్నత స్థాయి ఆడిటర్లను ఎవరూ ప్రశ్నించడం లేదని ఆరోపించారు. ఇటీవల సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సూచనల మేరకు యాజమాన్యాలు.. ఉద్యోగులనూ, అధికారులను బదిలీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

 15న బ్యాంకు ఉద్యోగుల సమ్మె స్వచ్ఛందంగా విరమణ

15న బ్యాంకు ఉద్యోగుల సమ్మె స్వచ్ఛందంగా విరమణ

ఈ నెలలో ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఈ బదిలీలు ప్రతి బ్యాంకుకూ ఒక సమస్యగా మారనున్నాయని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి వెంకటాచలం తెలిపారు. పైగా ఉద్యోగుల పిల్లలు పరీక్షలు రాసే సమయం కూడా ఇదేనని దీన్నీ దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. మార్చి 15న యునైటైడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్‌ తరఫున తలపెట్టిన బ్యాంకు ఉద్యోగుల సమ్మెను స్వచ్ఛందంగా విరమించుకున్నట్లు తెలిపారు.

 చౌక ఇండ్ల నిర్మాణానికి ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం

చౌక ఇండ్ల నిర్మాణానికి ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం

ఒక వైపు చౌక గృహ నిర్మాణానికి ప్రభుత్వం మంచి ప్రోత్సాహం లభిస్తుండగా.. మరో వైపు మాత్రం ఆ రుణాలు ఎగవేతకు గురయ్యే అవకాశం ఉందని క్రిఫ్ హైమార్క్ నివేదిక చెప్పింది. గతేడాది నవంబర్ నాటికి మొత్తం గృహ రుణాల్లో 1.96 శాతం మేర రుణాలు 90 రోజులు బకాయిలు చెల్లించడం లేదు. రూ.25 లక్షల్లోపు గృహ రుణాల్లోనూ ఇవి 2.33 శాతం ఉన్నాయని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ క్రిఫ్‌ హైమార్క్‌ పేర్కొంది.

 అందుబాటులో ఇళ్ల రుణాలు 7.79 లక్షల కోట్లు

అందుబాటులో ఇళ్ల రుణాలు 7.79 లక్షల కోట్లు

రూ.10 లక్షలలోపు గృహ రుణాల విషయానికొస్తే 90 రోజులుగా బకాయిలు చెల్లించనివి నాలుగు శాతం క్రిఫ్ హైమార్క్ పేర్కొన్నది. పరిశ్రమ సగటుతో పోలిస్తే రెట్టింపని తెలిపింది. మొత్తం గృహ రుణాలు రూ.15.8 లక్షల కోట్లు కాగా.. అందులో అందుబాటు గృహ రుణాల వాటా 50 శాతం (రూ.7.79 లక్షల కోట్లు) అని ఉంది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో గృహ రుణాల ద్వారా ఏర్పడిన మొండి బకాయిలు ఏప్రిల్‌ నుంచి చూస్తే 13.6 శాతం మేర పెరిగాయి.

 2017 సెప్టెంబర్ నాటికి 1.96 శాతానికి పెరిగిన బకాయిలు

2017 సెప్టెంబర్ నాటికి 1.96 శాతానికి పెరిగిన బకాయిలు

విదేశీ బ్యాంకులు సైతం రూ.10 లక్షల్లోపు గృహ రుణాల విషయంలో 16.2 శాతం మొండి బకాయిలను ఎదుర్కొంటున్నాయి. మొత్తం మొండి బకాయిల్లో వీటి భాగం చాలా తక్కువైనా.. వీటికి గృహ రుణాల విషయంలో అధిక ఒత్తిడి ఉంటోందని క్రిఫ్ హైమార్క్ ఆందోళన వ్యక్తం చేసింది. 2016 మార్చి నాటికి మొత్తం గృహ రుణాల విభాగంలో 90 రోజుల పాటు చెల్లించకుండా ఉన్నవి 1.36 శాతం. కానీ ఆ తర్వాత అవి పెరుగుతూ వచ్చాయి. 2017 జూన్‌ నాటికి 1.89 శాతం, 2017 నాటికి సెప్టెంబర్‌కల్లా 1.96 శాతానికి పెరిగాయి. దేశ రాజధాని నగర ప్రాంతం న్యూఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో గృహ రుణ రంగంలో అధిక ఒత్తిడి ఉంటోంది.

బ్యాంకుల నుంచి ఇళ్ల రుణాలు 59 శాతమే

బ్యాంకుల నుంచి ఇళ్ల రుణాలు 59 శాతమే

చౌక గృహ రుణాల విషయానికొస్తే కోల్‌కతా, చెన్నై, ఘజియాబాద్‌లలో ఎక్కువ ఒత్తిడి కనిపిస్తోంది. మొత్తం రూ.15.78 లక్షల కోట్ల గృహ రుణాల్లో 23 శాతంతో అతిపెద్ద గృహ రుణ మార్కెట్‌గా మహారాష్ట్ర నిలిచింది. గృహ రుణ కంపెనీలు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు మొత్తం గృహ రుణాల్లో 40 శాతం చొప్పున వాటాలున్నాయి. గృహ రుణ కంపెనీలు పెద్ద స్థాయి గృహ రుణాలిచ్చే విషయంలో బలంగా ఉండగా.. ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాల్లో అందుబాటు రుణాలే 59 శాతంగా ఉన్నాయి.

English summary
Hyderabad: All India Bank Employees' Association (AIBEA) suggested Finance Minister Arun Jaitley to convene a a tripartite meeting of the Finance Ministry, Indian Banks Association/Bank managements and Apex Bank Unions (UFBU) immediately under your personal guidance so that concrete and concerted measures are taken in the banking sector.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X