సుందర్ పిచాయ్ కు మైండ్ బ్లాక్ శాలరీ ప్యాకేజ్ ఆఫర్
ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ మరోసారి వార్తల్లోకెక్కారు. ఆయన జీతం భారీగా పెరిగింది. కళ్లు చెదిరే శాలరీని అందుకోనున్నాడు. రాబోయే మూడేళ్లలో సుమారు 6,200 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని అందుకోనున్నాడు. దీని విలువ 692 మిలియన్ డాలర్లు. సవరించిన ఈక్విటీ ప్లాన్ ప్రకారం.. ఆయనకు ఈ మొత్తం అందబోతోంది. ఈ ప్యాకేజీలోని ఒక ముఖ్యమైన భాగం ఆల్ఫాబెట్ కు చెందిన అత్యంత కీలకమైన ప్రాజెక్టులు వేమో (Waymo), వింగ్ (Wing) పనితీరుతో ముడిపడి ఉంది.
శుక్రవారం యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC)కి సమర్పించిన ఫైలింగ్‌లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ప్లాన్ ద్వారా పిచాయ్ ఆదాయంలో ఎక్కువ భాగం ఆల్ఫాబెట్ కొత్త వ్యాపారాల వృద్ధిపై ఆధారపడనుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ పరిహార ప్యాకేజీ మూడు సంవత్సరాల సైకిల్‌ను కవర్ చేస్తుంది. ఇందులో అనేక ఈక్విటీ భాగాలు ఉన్నాయి. 2022లో పిచాయ్‌కు మంజూరు చేసిన ప్యాకేజీ కంటే అదనం. కొన్ని కొత్త ప్రోత్సాహకాలు చేరాయి ఇందులో.

సెల్ప్ డ్రైవింగ్ టెక్నాలజీ కంపెనీ వేమో, డ్రోన్ డెలివరీ సర్వీస్ వింగ్‌కు సంబంధించిన ఇన్సెంటివ్‌లు తాజా ప్యాకేజీలో భాగం అయ్యాయి. కొత్త శాలరీ స్ట్రక్చర్ లో కొంత భాగం వేమో అంచనా వేసిన ఫైనాన్షియల్ బ్యాలెన్స్ షీట్ తో ముడిపడి ఉంది. అంటే- మూడేళ్ల కాలంలో ఈ కంపెనీ ఈక్విటీ యూనిట్ల విలువ పెరిగితే 260 మిలియన్ డాలర్ల వరకు స్టాక్ ఇన్సెంటివ్‌లను పొందే అవకాశం సుందర్ పిచాయ్ కు లభిస్తుంది. ఈ చెల్లింపును నిర్ణయించడానికి ఉపయోగించే అసెస్ మెంట్ ను ఆల్ఫాబెట్ కమిటీ నిర్ణయిస్తుంది.
ప్యాకేజీలో మరో భాగం- కంపెనీ డ్రోన్ డెలివరీ వ్యాపారమైన వింగ్. దీనికి సంబంధించిన ఈక్విటీ యూనిట్‌లను సుందర్ పిచాయ్‌కు మంజూరు చేశారు. రాబోయే మూడేళ్లలో కంపెనీ విలువ పెరిగినట్లయితే ఈ యూనిట్ల విలువ 90 మిలియన్ డాలర్ల వరకు చేరుకోవచ్చు. ఆల్ఫాబెట్ బోర్డు ఈ వెంచర్లతో సీఈఓ ప్యాకేజీలో కొంత భాగాన్ని అనుసంధానించడానికి గల కారణాన్ని ఫైలింగ్‌లో పొందుపరిచింది.
2026లో వేమో తన వాణిజ్య సేవలను డల్లాస్, హ్యూస్టన్, శాన్ ఆంటోనియో, ఓర్లాండో వంటి నగరాలకు కూడా విస్తరించింది. 2012లో వింగ్ ను ఆల్ఫాబెట్ ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఆ తర్వాత 2018లో స్వతంత్ర అనుబంధ సంస్థగా మారింది. చిన్న ప్యాకేజీలను నేరుగా వినియోగదారులకు రవాణా చేయడానికి రూపొందించిన డ్రోన్ ఆధారిత డెలివరీ సేవలను వింగ్ నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో తన డెలివరీ నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రణాళికలో భాగంగా 2027 నాటికి 300 స్టోర్‌లకు తన కార్యకలాపాలను విస్తరించనుంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications