మీకు తెలుసా! బ్యాంక్ అకౌంట్ లేకున్నా ఫిక్స్‌డ్ డిపాజిట్
ఆన్‌లైన్ షాపింగ్ అంటే గుర్తుకొచ్చేది అమెజాన్. కానీ ఇప్పుడు అదే అమెజాన్... పొదుపు పెట్టుబడులకూ వేదికగా మారింది. ఇప్పటివరకు బ్యాంక్ బ్రాంచ్‌ల చుట్టూ తిరగాల్సిన ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వ్యవహారం, ఇప్పుడు మొబైల్‌లో రెండు క్లిక్స్‌తో పూర్తయ్యే స్థాయికి చేరింది. అమెజాన్ పే(Amazon Pay) ద్వారా ఫిక్సిడ్ డిపాజిట్ లో పెట్టుబడి అవకాశం అందుబాటులోకి రావడంతో, డిజిటల్ సేవింగ్స్‌కు కొత్త ఊపొచ్చింది.
Amazon Pay యాప్‌లోని "Invest / Fixed Deposit" సెక్షన్ ద్వారా రూ.1,000 నుంచే FD ప్రారంభించవచ్చు. వివిధ చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, NBFC లతో భాగస్వామ్యం ద్వారా ఈ సేవ అందిస్తున్నారు. పెట్టుబడి కాలం (Tenure) ఎంపిక చేసుకుని, వడ్డీ రేటు చూసి నిర్ణయం తీసుకోవచ్చు. కొన్ని ఎంపికల్లో ఏడాదికి 8 శాతం వరకు వడ్డీ లభించే అవకాశం కూడా ఉంది.

ఈ డిపాజిట్లకు భద్రత కూడా ఉంది. Amazon Pay ద్వారా బ్యాంకుల్లో పెట్టే FDలకు RBI ఆధ్వర్యంలోని DICGC బీమా కింద రూ.5 లక్షల వరకు రక్షణ ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ, మహిళా ఇన్వెస్టర్లకు ప్రత్యేక ప్రయోజనాలు కూడా కొన్ని భాగస్వామ్య సంస్థలు అందిస్తున్నాయి. దీంతో తక్కువ రిస్క్‌తో స్థిర ఆదాయం కోరుకునే వారికి ఇది ఆకర్షణీయంగా మారింది.
FD ప్రక్రియ పూర్తిగా డిజిటల్. ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా తెరవాల్సిన అవసరం లేదు. Amazon యాప్‌లోనే KYC పూర్తి చేసి, డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసి FD బుక్ చేయవచ్చు. డిపాజిట్ వివరాలు, మెచ్యూరిటీ తేదీ, వడ్డీ మొత్తం అన్నీ యాప్‌లోనే స్పష్టంగా కనిపిస్తాయి. అవసరమైతే ముందస్తు ఉపసంహరణ (Premature Withdrawal) అవకాశం కూడా ఉంటుంది.
మొత్తానికి, Amazon Pay FD సౌలభ్యం, భద్రత, తక్కువ ప్రారంభ పెట్టుబడి వంటి అంశాలతో కొత్త తరహా సేవింగ్స్ ఆప్షన్‌గా మారుతోంది. బ్యాంక్‌లకు వెళ్లే సమయం లేకుండా, డిజిటల్‌గా పొదుపు పెంచుకోవాలనుకునే వారికి ఇది సరైన ఎంపికగా నిపుణులు చెబుతున్నారు. షాపింగ్ యాప్‌గా మొదలైన అమెజాన్, ఇప్పుడు మీ పొదుపు భాగస్వామిగా కూడా మారిందని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications