రిలయన్స్ గ్రూప్ లో భారీగా నిధుల దారి మళ్లింపు: కోబ్రాపోస్ట్ సంచలన ఆరోపణలు

దిగ్గజ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌ లో రూ. 41,900 కోట్లకు పైగా నిధుల మళ్లింపు జరిగిందని దర్యాప్తు సంస్థ కోబ్రాపోస్ట్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ నిధుల మళ్లింపు 2006 నుండి జరిగిందని పేర్కొంది. దీన్ని ఆర్థిక మోసంగా కోబ్రాపోస్ట్ సంస్థ అభివర్ణించింది. అయితే, రిలయన్స్ గ్రూప్ ఈ ఆరోపణలను కొట్టి పారేసింది. తమ స్టాక్ ధరలను తగ్గించే లక్ష్యంతోనే తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపింది.

కోబ్రాపోస్ట్ నివేదిక ప్రకారం.. రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ తదితర లిస్టెడ్ గ్రూప్ సంస్థల నుండి బ్యాంక్ రుణాలు, IPO ఆదాయాలు, బాండ్ల ద్వారా సేకరించిన రూ. 28,874 కోట్లను ప్రమోటర్- సంబంధిత కంపెనీలకు మళ్లించినట్లు కోబ్రాపోస్ట్ ఆరోపణలు చేసింది.

అదనంగా.. 1.535 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 13,047 కోట్లు) సింగపూర్, మారిషస్, సైప్రస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, US, UK వంటి దేశాల్లోని ఆఫ్ షోర్ సంస్థల ద్వారా "మోసపూరితంగా" భారత్ లోకి మళ్లించారని కోబ్రాపోస్ట్ కీలక ఆరోపణలు చేసింది. దీని కోసం అనేక అనుబంధ సంస్థలు, షెల్ కంపెనీల నెట్‌ వర్క్‌ ను ఉపయోగించారని పేర్కొంది.

ఒక సింగపూర్ కంపెనీ, ఎమర్జింగ్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ట్రేడింగ్ పిటిఈ (EMITS), నెక్స్‌ జెన్ క్యాపిటల్ నుండి 750 మిలియన్ డాలర్లు పొందిందని, ఆ తర్వాత ఈ మొత్తాన్ని రిలయన్స్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన రిలయన్స్ ఇన్నోవెంచర్స్‌ కు బదిలీ చేసిందని, తర్వాత ఆ కంపెనీ రద్దు అయిందని కోబ్రాపోస్ట్ తన నివేదికలో పేర్కొంది. ఈ లావాదేవీలు "మనీలాండరింగ్‌ కు" సమానం కావొచ్చని ఆరోపణలు చేసింది.

కోబ్రాపోస్ట్ నివేదిక కంపెనీల చట్టం, FEMA, PMLA, SEBI చట్టం, ఆదాయపు పన్ను చట్టాల ఉల్లంఘనలను ప్రస్తావించింది. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, SEBI, NCLT, RBI నుండి పొందిన అధికారిక పత్రాలు, ఉత్తర్వుల ఆధారంగా ఈ ఆరోపణలు చేసినట్లు తెలిపింది. కార్పొరేట్ నిధులను వ్యక్తిగత విలాసవంతమైన కొనుగోళ్లకు దుర్వినియోగం చేశారని కూడా ఆరోపణలున్నాయి. 2008లో అనిల్ అంబానీ 20 మిలియన్ డాలర్ల విలువైన యాచ్‌ ను ఒక లిస్టెడ్ గ్రూప్ కంపెనీ ద్వారా కొనుగోలు చేసినట్లు నివేదిక పేర్కొంది.

ADA గ్రూప్ సంస్థలు డజన్ల కొద్దీ పాస్-త్రూ ఎంటిటీలు, SPVలను ఉపయోగించి నిధులను మళ్లించాయని, తర్వాత అవి రద్దు చేశారని దర్యాప్తు సంస్థ ఆరోపణలు చేసింది. దీని వల్ల ఆరు కీలక లిస్టెడ్ కంపెనీలు ఆర్థిక సంక్షోభంలో పడ్డాయని వివరించింది. ఈ మేరకు కోబ్రాపోస్ట్ ఎడిటర్ అనిరుద్ బహల్ మాట్లాడుతూ.. ఈ దర్యాప్తు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, SEBI, NCLT, RBI వంటి ఏజెన్సీల నుండి సేకరించిన అధికారిక దస్త్రాలు, కోర్టు ఉత్తర్వులపై ఆధారపడిందని తెలిపారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టాలు, మొండి బకాయిలతో కలిపి రూ. 3.38 లక్షల కోట్ల "ప్రజల సంపద పూర్తిగా హరించుకుపోయింది" అని ఆయన కీలక ఆరోపణలు చేశారు.

అయితే ఈ ఆరోపణలను రిలయన్స్ గ్రూప్ ఖండించింది. ఈ నివేదిక "పునర్నిర్మిత, ఎజెండా-ఆధారిత కార్పొరేట్ హిట్ జాబ్" అని అభివర్ణించింది. ఈ ఆరోపణలు "పాత, బహిరంగంగా లభ్యమయ్యే సమాచారం" ఆధారంగా రూపొందించారని, ఇదివరకే CBI, ED, SEBI వంటి ఏజెన్సీలు పరిశీలించాయని గ్రూప్ తెలిపింది. "నిష్పక్షపాత విచారణను దెబ్బతీయడానికి" ఇది ఒక "వ్యవస్థీకృత ప్రయత్నం" అని పేర్కొంది.

ఈ నివేదికను ఖండిస్తూ.. రిలయన్స్ గ్రూప్ కీలక వ్యాఖ్యలు చేసింది. సంస్థ ఖ్యాతిని దెబ్బతీసే, వాటాదారులను తప్పుదారి పట్టించే దురుద్దేశపూర్వక ప్రచారంగా అభివర్ణించింది. కోబ్రాపోస్ట్‌ ను "కార్పొరేట్ హిట్- జాబ్‌ గా పునరుద్ధరించబడిన ప్లాట్‌ ఫారమ్ గా పేర్కొంది. 2019 నుండి నిద్రాణంలో ఉన్న కోబ్రాపోస్ట్‌ కు "సున్నా పత్రికా విశ్వసనీయత ఉందని, ఎజెండా- ఆధారిత స్టింగ్స్ 100 శాతం రికార్డు ఉందని" గ్రూప్ వ్యాఖ్యానించింది.

రిలయన్స్ గ్రూప్, అనిల్ అంబానీ, 55 లక్షల వాటాదారుల స్టాక్ ధరలను తగ్గించడానికి, స్టాక్ మార్కెట్లలో భయాందోళనలు సృష్టించి రిలయన్స్ గ్రూప్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి "పరువు తీయడానికి, తప్పుడు సమాచారం ఇవ్వడానికి, వ్యక్తిత్వాన్ని చంపడానికి ఉద్దేశపూర్వక ప్రచారం" అని ఆ ప్రచురణపై గ్రూప్ ఆరోపణలు చేసింది.

Ambani Empire Under Siege Cobrapost Bombshell Exposes Rs 41 900 Cr Siphoned in Shell Game Scandal

అయితే.. ప్రత్యర్థి కార్పొరేట్‌ లు ఎవరో గ్రూప్ వెల్లడించలేదు. కానీ ఢిల్లీలోని విద్యుత్ పంపిణీ సంస్థ BSES లిమిటెడ్, ముంబై మెట్రో, 1,200 మెగావాట్ల రోసా పవర్ ప్రాజెక్ట్ వంటి ఆస్తులను ప్రత్యర్థులు ధరలు తగ్గించి కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని గుర్తించింది. రిలయన్స్ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్ వంటి దాని లిస్టెడ్ సంస్థలు తమ షేర్లలో ఇటీవలి ట్రేడింగ్ పద్ధతులపై విచారణ కోరుతూ SEBI కు ఫిర్యాదులు కూడా దాఖలు చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+