4 రెట్లు ఎక్కువ వడ్డీ! బ్యాంకులు చెప్పని పెద్ద సీక్రెట్
మనందరం మిడిల్ క్లాస్ పీపుల్. మనకి సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు దాచుకోవడం మాత్రమే తెలుసు. కానీ బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు అలాగే ఉంచితే పెద్దగా వడ్డీ రాదనే విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవడానికి వీలుండదు. అయితే సేవింగ్స్ ఖాతాలో ఉండే డబ్బును లాక్ చేయకుండానే, సాధారణం కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ వడ్డీ పొందే అద్భుతమైన మార్గం ఒకటి ఉంది. చాలామందికి తెలియని ఈ స్మార్ట్ ఆప్షనే 'ఆటో స్వీప్ ఫెసిలిటీ'.
ఎలా పనిచేస్తుంది? అసలు కథ ఇక్కడే ఉంది!
బ్యాంకులు అందించే ఈ 'ఆటో స్వీప్' లేదా ఫ్లెక్సీ డిపాజిట్ విధానంలో మన ఖాతాకు ఒక అకౌంట్ కు ఒక లిమిట్ నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు, మీ సేవింగ్స్ అకౌంట్‌లో నిర్ణయించిన రూ.50,000 కంటే ఎక్కువ డబ్బు డిపాజిట్ అయిన వెంటనే.. ఆ అదనపు మొత్తాన్ని బ్యాంక్ ఆటోమేటిక్‌గా చిన్న చిన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా మార్చేస్తుంది. దీనివల్ల ఆ మిగులు సొమ్ముపై మీకు సేవింగ్స్ ఖాతా కన్నా చాలా ఎక్కువ వడ్డీ వస్తుంది.

అత్యవసరమైతే డబ్బు మళ్లీ మీ చేతికి!
ఇందులోని అసలైన ప్లస్ పాయింట్ ఏమిటంటే.. మీ అకౌంట్‌లోని డబ్బును ఎప్పుడైనా, ఎలాంటి అభ్యంతరం లేకుండా వాడుకోవచ్చు. అత్యవసరంగా షాపింగ్ చేసినా, ఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా చేసినా లేదా వేరొకరికి యూపీఐ ద్వారా డబ్బులు పంపినా.. ఆ డబ్బులు ఆటోమెటిక్ గా ఎఫ్‌డీ నుంచి మళ్లీ సేవింగ్స్ అకౌంట్‌లోకి (స్వీప్-ఇన్) వచ్చేస్తాయి. ఎటువంటి చార్జీలు లేదా పెనాల్టీలు పడకుండానే సాధారణ డిపాజిట్ వడ్డీని ఎంజాయ్ చేస్తూ, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ సొమ్మును వినియోగించుకోవచ్చు.
మరెందుకు ఆలస్యం మీరు కూడా మీ సెవింగ్స్ అకౌంట్ నుంచి ఎక్కవు ఆదాయం రాబట్టుకోవాలని అనుకుంటే వెంటనే మీ బ్రాంచ్ ను సంప్రదించి.. ఆటో స్వీప్ ఫెసిలిటీ గురించి, మీ బ్యాంక్ అందించే వడ్డీ రేట్ల గురించి తెలుసుకోండి.
గమనిక: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే, వన్ ఇండియా దీనిని ధృవీకరించడం లేదు. అధికారిక సమాచారం కోసం బ్యాంకులను సంప్రదించాలి. ఆన్ లైన్ లో వచ్చే లింకుల మీద క్లిక్ చేసి మోసపొవద్దు












Click it and Unblock the Notifications