తక్కువ మెయింటెనెన్స్, మస్తు మైలేజ్: అదిరిపోయే 5 బైక్‌లు ఇవే!

Best 125cc Bikes in India 2025: మీరు ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లి రావడానికి అద్భుతమైన మైలేజ్ ఇచ్చే, మెయింటెనెన్స్ తక్కువగా ఉండే, రైడింగ్‌లో సౌకర్యాన్ని ఇచ్చే బైక్ కోసం చూస్తున్నట్లయితే.. 125సీసీ సెగ్మెంట్ బైకులు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ఇటీవల జీఎస్టీ తగ్గింపు తర్వాత ఈ కేటగిరీలోని అనేకు ప్రముఖ బైకుల తగ్గాయి. దీంతో అవి మరింత చౌకగా మారాయి. ప్రతిరోజూ ఉపయోగించడానికి(డైలీ కమ్యూట్) ఉత్తమమైన, దేశంలోని టాప్ 5 125సీసీ బైకుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ప్రతిరోజూ వినియోగించేందుకు బెస్ట్ 5 125 సీసీ బైకులు ఇవే..

1. TVS Raider 125 (మైలేజ్ కింగ్)
ప్రత్యేకత: యువతకు, స్పోర్టీ లుక్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీని స్పోర్టీ డిజైన్, వేగవంతమైన పనితీరు ప్రత్యేకంగా నిలుస్తాయి.

పనితీరు: 124.8cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ 11.2 bhp శక్తిని, 11.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

వేగం, మైలేజ్: కేవలం 5.8 సెకన్లలో 0 నుంచి 60 km/h వేగాన్ని అందుకోగల సామర్థ్యం దీనికి ఉంది. మైలేజ్ దాదాపు 71 కి.మీ/లీటర్ వరకు ఉంటుంది.

ధర: జీఎస్టీ తగ్గింపు తర్వాత ఎక్స్-షోరూమ్ ధర రూ.80,500 నుంచి ప్రారంభమవుతుంది.

ఫీచర్లు: బ్లూటూత్ డిజిటల్ కన్సోల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, మూడు రైడింగ్ మోడ్‌లు (పవర్, ఎకో, రెయిన్) వంటి ఫీచర్లు ఈ సెగ్మెంట్‌లో అత్యంత అధునాతనంగా ఉన్నాయి.

Best 125cc Bikes in India 2025 Top 5 Low Maintenance High Mileage Bikes for Daily Commute

2. Honda SP 125 (రిఫైన్డ్ ఇంజన్)
ప్రత్యేకత: ఈ బైక్ ఇంజన్ పనితీరు కోసం ప్రసిద్ధ బైక్.

పనితీరు: 123.94cc ఫ్యూయెల్-ఇంజెక్టెడ్ ఇంజన్ 10.7 bhp శక్తిని, 10.9 Nm టార్క్‌ను అందిస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రైడింగ్ చాలా సున్నితంగా ఉంటుంది.

మైలేజ్: క్లెయిమ్డ్ మైలేజ్ 65 కి.మీ/లీటర్ వరకు.

ధర: ఎక్స్-షోరూమ్ ధర రూ.85,564 నుండి ప్రారంభమవుతుంది.

ఫీచర్లు: ఎల్ఈడీ హెడ్‌లైట్, డిజిటల్ కన్సోల్, ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS). తక్కువ నిర్వహణ ఖర్చుతో ఎక్కువ కాలం మన్నే బైక్ కావాలంటే ఇది మంచి ఎంపిక.

3. Hero Xtreme 125R (స్పోర్టీ పవర్)
ప్రత్యేకత: స్పోర్టీ డిజైన్‌తో పాటు కొంచెం ఎక్కువ పవర్ కోరుకునే రైడర్లకు ఈ బైక్ అనుకూలం.

పనితీరు: 125సీసీ BS6 ఇంజన్ 11.5 bhp శక్తిని, 10.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మైలేజ్: మైలేజ్ దాదాపు 66 కి.మీ/లీటర్ వరకు ఉంటుంది.

ధర: ఎక్స్-షోరూమ్ ధర రూ.91,116.

ఫీచర్లు: ఎల్ఈడీ లైటింగ్, డిజిటల్-అనలాగ్ స్పీడోమీటర్, భద్రత కోసం సింగిల్-ఛానల్ ఏబీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. హీరో విస్తృత సర్వీస్ నెట్‌వర్క్ దీని మెయింటెనెన్స్ ఖర్చును తగ్గిస్తుంది.

4. Bajaj Pulsar NS125 (పల్సర్ స్టైల్)
ప్రత్యేకత: స్టైల్, పనితీరులో బ్యాలెన్స్ కోరుకునే వారికి ఈ బైక్ సరైనది. పల్సర్ బ్రాండ్‌ను ఇష్టపడేవారికి ఇది అత్యంత సరసమైన ఆప్షన్.

పనితీరు: 124.45cc DTS-i ఇంజన్ 11.8 bhp శక్తిని, 11 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఈ జాబితాలో అత్యధిక పవర్‌ను ఇచ్చే బైక్‌లలో ఒకటి.

మైలేజ్: మైలేజ్ దాదాపు 60 కి.మీ/లీటర్.

ధర: ఎక్స్-షోరూమ్ ధర రూ.92,182.

ఫీచర్లు: పల్సర్ సిరీస్ అగ్రెసివ్ లుక్, స్థిరమైన రైడింగ్ అనుభవం దీని సొంతం.

5. Hero Super Splendor XTEC (నమ్మదగిన మైలేజ్)
ప్రత్యేకత: ఈ బైక్ ఇండియాలో అత్యంత నమ్మదగిన, రోజువారీ ఉపయోగాలకు అనువైన బైక్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది.

పనితీరు: 124.7cc ఇంజన్ 10.7 bhp శక్తిని, 10.6 Nm టార్క్‌ను అందిస్తుంది.

మైలేజ్: అత్యద్భుతమైన మైలేజ్ 70 కి.మీ/లీటర్ వరకు.

ధర: జీఎస్టీ తగ్గింపు తర్వాత దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.81,998 నుండి ప్రారంభమవుతుంది.

ఫీచర్లు: i3S టెక్నాలజీ (ట్రాఫిక్‌లో ఆటోమేటిక్‌గా ఇంజన్ ఆగిపోవడం/ప్రారంభం కావడం), ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, డిజిటల్ కన్సోల్, సైడ్-స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్ ఫీచర్ వంటివి ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+