మీ కలల కారు కేవలం రూ.3.50 లక్షల నుంచే! సామాన్యుడు కొనగలిగే కార్లు!

చాలా మందికి కొత్త కారు కొనుక్కోవాలనేది ఓ కల. ప్రస్తుత కాలంలో కారు అనేది ఓ విలాస వస్తువు కాదు.. అది కుటుంబ అవసరాలు, సేఫ్టీ, సౌకర్యం కోసం అత్యవసరం. ముఖ్యంగా మొదటి కారు కొనబోయేవారు, చిన్న కుటుంబాలు, ఉద్యోగస్తులు తమ బడ్జెట్‌ను దాటకుండా అద్భుతమైన మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు అందించే కార్ల కోసం చూస్తారు. మీరు కూడా అటువంటి బెస్ట్ డీల్ కోసం చూస్తున్నట్లయితే భారతీయ మార్కెట్లో మైలేజ్‌కు మారుపేరుగా నిలిచిన మారుతి సుజుకి అందించే ఈ నాలుగు హ్యాచ్‌బ్యాక్‌లు మీకు బెస్ట్ ఛాయిస్. ఇవి కేవలం చౌక ధరకే కాకుండా బైక్‌ను గుర్తు చేసే మైలేజీని ఇవ్వడం వీటి ప్రత్యేకత.

1. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో అనేది భారత మార్కెట్లో అత్యంత తక్కువ ధరలో లభించే చిన్న హ్యాచ్‌బ్యాక్. తన హై-రైడింగ్ స్టాన్స్, ఎస్‌యూవీ తరహా డిజైన్‌తో ఇది యువతను ఆకర్షిస్తోంది. మొదటిసారి కారు కొనబోయే వారికి తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్లు కోరుకునే వారికి ఇది నిజమైన వాల్యూ ఫర్ మనీ ఆప్షన్. ఎస్-ప్రెస్సో ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.3.50 లక్షల నుంచి ప్రారంభమై రూ.5.25 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

ఇంజిన్, మైలేజ్:
ఇది శక్తివంతమైన 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది సిటీ రైడింగ్‌కు సరైన పనితీరును అందిస్తుంది.CNG వేరియంట్ అందుబాటులో ఉండటం వల్ల ప్రయాణ ఖర్చులు మరింత తగ్గుతాయి. ఇది పెట్రోల్‌పై 24 kmpl, CNGపై 32 kmpl వరకు అద్భుతమైన మైలేజ్ అందిస్తుంది.

Best Budget Cars in India Under Rs 3 50 Lakh High Mileage Maruti Suzuki Hatchbacks

2. మారుతి సుజుకి ఆల్టో K10
దశాబ్దాలుగా భారతీయ కుటుంబాలలో తన నమ్మకాన్ని నిరూపించుకున్న హ్యాచ్‌బ్యాక్ ఆల్టో K10. ఇది తక్కువ మెయింటెనెన్స్, అధిక రీసేల్ వాల్యూకు ప్రసిద్ధి చెందింది. ఇది తక్కువ ఖర్చుతో మంచి ఫీచర్లు కోరుకునే చిన్న కుటుంబాలకు అద్భుతమైన ఆప్షన్‌గా నిలుస్తోంది. దీని ధరలు రూ.3.70 లక్షల నుంచి రూ.5.45 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఇందులో 1-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. రోజువారీ ప్రయాణాల్లో ఖర్చును తగ్గించాలని భావించే డ్రైవర్ల కోసం CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. మైలేజ్ విషయంలో తన సెగ్మెంట్‌లో అగ్రగామిగా నిలుస్తూ.. ఇది 24 kmpl నుంచి గరిష్టంగా 34 kmpl వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఆల్టో K10 ఐదుగురు కూర్చునేలా రూపొందించబడింది.

3. మారుతి సుజుకి సెలెరియో
సెలెరియో మార్కెట్‌లో మైలేజ్ కింగ్‌గా గుర్తింపు పొందింది. సిటీ ట్రాఫిక్‌లో సులభంగా డ్రైవ్ చేయడానికి అనుకూలమైన డిజైన్ దీని సొంతం. ఎవరైతే రోజూ ఎక్కువ దూరం ప్రయాణిస్తారో, వారికి తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ ప్రయాణాలు చేయడానికి సెలెరియో బెస్ట్ ఆప్షన్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.4.70 లక్షల నుంచి రూ.6.73 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు 25 kmpl నుండి 34 kmpl వరకు మైలేజ్ ఇవ్వడం వల్ల ఇది వినియోగదారుల బడ్జెట్‌ను అదుపులో ఉంచుతుంది.

4. మారుతి సుజుకి వ్యాగన్ఆర్
వ్యాగన్ఆర్ అనేది 'టాల్-బాయ్' డిజైన్‌తో మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది విశాలమైన క్యాబిన్ స్పేస్‌కు మరియు అత్యుత్తమ హెడ్‌రూమ్‌కు ప్రసిద్ధి చెందింది. సింపుల్‌గా, ఎక్కువ స్థలంతో కారు కావాలనుకునే కుటుంబాలకు ఇది మొదటి ఎంపిక. ఇది చాలా అందుబాటులోనే రూ.4.99 లక్షల నుండి రూ.6.95 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో లభిస్తుంది. ఈ కారు 23 kmpl నుండి 34 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది. ఇది నిజంగా బైక్‌లను గుర్తు చేసేంత అద్భుతమైన ఇంధన సామర్థ్యం.

కొత్త కారు కొనేటప్పుడు మైలేజ్, ధర అనేవి రెండు ప్రధాన అంశాలు. మారుతి సుజుకి అందించే ఈ హ్యాచ్‌బ్యాక్‌లు కేవలం తక్కువ ధరలకే కాకుండా, అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని అందించడం ద్వారా ప్రతి సామాన్యుడి కారు కలను సులభతరం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+