LIC పాలసీదారులకు షాక్: ఇక ఆ కార్డులతో యూజ్ లేదు.. కొత్త రూల్

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) కస్టమర్లకు గట్టి షాక్ తగిలింది. ఇకపై క్రెడిట్ కార్డుల ద్వారా ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌లో నేరుగా ప్రీమియం చెల్లించే సదుపాయాన్ని సంస్థ నిలిపివేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే సైలెంట్‌గా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 15 రోజుల క్రితమే తన అధికారిక కస్టమర్ పోర్టల్, మొబైల్ యాప్ నుంచి క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఆప్షన్‌ను ఎల్‌ఐసీ పూర్తిగా తొలగించింది. ప్రస్తుతం వెబ్‌సైట్‌లో కేవలం నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, యూపీఐ (UPI) మార్గాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

భారం తట్టుకోలేకేనా?

సాధారణంగా గూగుల్ పే, ఫోన్‌పే వంటి ఇతర యాప్స్‌లో క్రెడిట్ కార్డ్‌తో ఎల్‌ఐసీ ప్రీమియం కడితే అదనపు ఛార్జీలు పడేవి. కానీ, ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా కట్టినప్పుడు మాత్రం బ్యాంకులు వసూలు చేసే గేట్‌వే/కన్వీనియన్స్ ఫీజులను కస్టమర్ల తరఫున ఎల్‌ఐసీ సంస్థే భరించేది. అయితే, ఈ మధ్య కాలంలో క్రెడిట్ కార్డుల ద్వారా ప్రీమియంలు కట్టే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో బ్యాంకింగ్ ఛార్జీల భారం సంస్థపై మితిమీరిపోవడంతోనే.. ఎల్‌ఐసీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. యాక్సిస్, ఐడీఎఫ్‌సీ వంటి బ్యాంకులతో కలిసి ఎల్‌ఐసీ జారీ చేసిన కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులకు సైతం ఈ కొత్త నిబంధన వర్తిస్తుండటం గమనార్హం.

Big Shock to LIC Policyholders as Credit Card Payment Option Removed from Website and Mobile App
Truecaller: ఆ రూల్ వల్లే పెరిగిన మోసాలు! 140, 1600 సిరీస్ నంబర్ల గుట్టురట్టు..
Truecaller: ఆ రూల్ వల్లే పెరిగిన మోసాలు! 140, 1600 సిరీస్ నంబర్ల గుట్టురట్టు..

మరి క్రెడిట్ కార్డుతో కట్టడం ఎలా?

ఒకవేళ కస్టమర్లు ఖచ్చితంగా క్రెడిట్ కార్డు ద్వారానే ప్రీమియం చెల్లించాలనుకుంటే ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సిందే. భారత్ బిల్ పేమెంట్స్ (BBPS) పరిధిలోకి వచ్చే గూగుల్ పే, ఫోన్‌పే, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా పాలసీ నంబర్ ఎంటర్ చేసి క్రెడిట్ కార్డుతో బిల్లు కట్టవచ్చు. కానీ, ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఈ ప్లాట్‌ఫామ్స్‌పై క్రెడిట్ కార్డ్ వాడినందుకు అయ్యే అదనపు లావాదేవీల రుసుములను (కన్వీనియన్స్ ఫీజు) ఇకపై కస్టమర్లే స్వయంగా భరించాల్సి ఉంటుంది. అయితే ఈ యాప్స్ ద్వారా కడితే క్రెడిట్ కార్డుకు వచ్చే రివార్డు పాయింట్లు మాత్రం యథావిధిగా వస్తాయి.

EPFO: చేతులెత్తేసిన వెబ్ సైట్. మీ పాస్ బుక్ ఓపెన్ అవుతుందా?
EPFO: చేతులెత్తేసిన వెబ్ సైట్. మీ పాస్ బుక్ ఓపెన్ అవుతుందా?

ఉచితంగా కట్టాలంటే ఇవే మార్గాలు

ఎలాంటి అదనపు ఛార్జీలు, కన్వీనియన్స్ ఫీజులు లేకుండా ఉచితంగానే ప్రీమియం చెల్లించాలనుకునే వారు మాత్రం తమ అలవాటు మార్చుకోవాలి. ఎల్‌ఐసీ అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి కేవలం యూపీఐ (UPI), డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఆప్షన్లను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఎల్‌ఐసీ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు ఉన్నా అధికారిక పోర్టల్‌లో ఆప్షన్ తీసేయడంతో.. "ఇక ఈ కార్డుల వల్ల ఉపయోగం ఏముంది?" అంటూ పాలసీదారులు సామాజిక మాధ్యమాల్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+