బ్రేకింగ్ న్యూస్.. సెప్టెంబర్ నెల జీతంలో కోత.. ఎందుకంటే?
నెలాఖరు వచ్చిందంటే చాలు ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. నేడు(సెప్టెంబర్ 30) ఇప్పటికే చాలా ఉద్యోగుల ఫోన్లు టింగ్ టింగుమంటూ మోగాయి. అంటే చాలా మంది ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు క్రెడిట్ అయ్యాయి. కానీ చాలా మంది తమ జీతాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. వారి వేతనాలు కట్ అయ్యి క్రెడిట్ అయ్యాయి. కొంత మంది ఎందుకు కట్ అయ్యాకో తెలియక దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అసలు జీతాలు ఎందుకు కట్ అయ్యాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కేంద్ర సర్కారు ఈపీఎఫ్వో కనీస వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కొత్త నిబంధన వల్ల ఎంతోమంది ప్రైవేట్ ఉద్యోగులు పెన్షన్, ఈపీఎఫ్ ప్రయోజనాలను పొందే అవకాశం లభించినప్పటికీ.. ఉద్యోగుల చేతికి వచ్చే నెల జీతంలో మాత్రం తేడాలు వచ్చే అవకాశం ఉంది.
కొత్త వేతన పరిమితి వల్ల మారే ప్రధానాంశాలు
2014 సెప్టెంబర్ నుంచి బేసిక్ ప్లస్ డీఏ కలిపి రూ.15,000 ఉన్న వారికి మాత్రమే పెన్షన్ అర్హత ఉండేది. ఇప్పుడు కనీస వేతన పరిమితిని రూ.25,000కు పెంచడతో కొత్తగా ఉద్యోగంలో చేరేవారి బేసిక్ శాలరీ రూ.25,000 వరకు ఉన్నా వారు ఈపీఎస్ పెన్షన్ పథకానికి అర్హులవుతారు. గతంలో కంపెనీలు చెల్లించే గరిష్ట పెన్షన్ వాటా పరిమితి రూ.1,250గా ఉండేది. ఇప్పుడు పెంచిన పరిమితి ప్రకారం సంస్థల గరిష్ట పెన్షన్ వాటా రూ.2,083 వరకు పెరగనుంది.

ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ నెల మధ్యలో(సెప్టెంబర్ 17) అమలులోకి వచ్చినందున ఈ నెల జీతాన్ని కంపెనీలు రెండు భాగాలుగా లెక్కిస్తున్నాయి. మొదటి 16 రోజులు(సెప్టెంబర్ 1-16) పాత పరిమితి రూ.15,000 ప్రకారం.. చివరి 14 రోజులు(సెప్టెంబర్ 17-30) పెంచిన రూ.25,000 పరిమితి ప్రకారం జీతం లెక్కింపు జరుగుతుంది.
చేతికొచ్చే జీతం ఎందుకు తగ్గుతుంది?
గతంలో బేసిక్ జీతం పరిమితి రూ.15,000పై 12 శాతం అనగా రూ.1,800 మాత్రమే పీఎఫ్ కింద కట్ అయ్యేది. కానీ ఇప్పుడు రూ.25,000 సీలింగ్ అమలులోకి రావడంతో రూ.25,000 బేసిక్ వేతనం ఉన్న ఉద్యోగి ఖాతా నుంచి 12 శాతం అనగా రూ.3,000 వరకు పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కట్ అవుతుంది. కొన్ని సంస్థల్లో డబుల్ పీఎఫ్(ఉద్యోగి వాటా+కంపెనీ సీటీసీ వాటా) ఉద్యోగి జీతం నుంచే కట్ చేస్తుడడం వల్ల దాదాపు రూ.6,000 వరకు జీతంలో కోత పడే అవకాశం ఉంది. దీనివల్ల రిటైర్మెంట్ సేవింగ్స్, పెన్షన్ ఫండ్ గణనీయంగా పెరిగినప్పటికీ.. ప్రస్తుత సెప్టెంబర్ నెలలో చేతికి అందే నికర జీతం తగ్గనుండటంతో కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులకు సమాచారం అందిస్తూ మెయిల్స్ పంపాయి.














Click it and Unblock the Notifications
