Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2018లో బడ్జెట్: విత్త మంత్రిపైనే రియాల్టీ ఆశలు.. మౌలిక హోదా కల్పించి జీఎస్టీ తగ్గించాలని అభ్యర్థనలు

న్యూఢిల్లీ: నల్లధనం వెలికితీత పేరుతో 2016 నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించారు. ఆపై ఆర్థిక సంస్కరణల అమలులో కీలక దశ 'జీఎస్టీ' గత జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చింది. దీనికి తోడు రియల్ ఎస్టేట్ రంగంలో అక్రమ లావాదేవీల నియంత్రణ కోసం 'రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)' అమలులోకి వచ్చింది. దీనివల్ల 2017లో రియల్ ఎస్టేట్ రంగం పలు ఇబ్బందులను ఎదుర్కొన్నదన్నఅభిప్రాయం ఉంది.

ఆర్థిక రంగంలో కీలక భూమిక పోషించే రియల్ ఎస్టేట్ రంగం పట్ల సానుకూల చర్యలు తీసుకోవాలని దేశీయ, విదేశీ పెట్టుబడి దారులు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని అభ్యర్థిస్తున్నారు. 2016, 2017 నాటి పరిణామాలతో తలెత్తిన మాంద్యాన్ని అధిగమించి రియల్టీ రంగం దూసుకెళ్లాలంటే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అభిప్రాయ పడుతున్నారు.

 ‘రెరా'తో వినియోగదారుల్లో ఫరిడవిల్లిన విశ్వాసం

‘రెరా'తో వినియోగదారుల్లో ఫరిడవిల్లిన విశ్వాసం

బడ్జెట్‌లో ప్రభుత్వ ప్రతిపాదనలు అనుకూలంగా ఉంటే రియల్టీ మళ్లీ మెరుపువేగంతో దూసుకుపోతుందని, ఆర్థిక రంగంలోనూ వేడి రాజుకుంటుందని రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ ప్రతినిధులు అంటున్నారు. నేరుగా కాకున్నా రియల్టీలో పెట్టుబడులకు పన్ను రాయితీలు కల్పించినా సరే తమ పరిశ్రమకు లాభం కలుగుతుందని వారు చెబుతున్నారు. ‘రెరా' అమలులోకి రావడంతో రియాల్టీ డెవలపర్లు పారదర్శకతతో వ్యవహరించడం వల్ల వినియోగదారుల్లో విశ్వాసం బలోపేతం అవుతుందని అంటున్నారు. అయితే జీఎస్టీ వల్ల తమ బిజినెస్‍ను ముందుకు తీసుకెళ్లడానికి పలు ఇబ్బందులు ఎదుర్కొన్నామని రియాల్టీ డెవలపర్లు ఆందోళన చెందుతున్నారు.

మౌలిక హోదాతో పెట్టుబడులు పొందేందుకు ఇలా వీలు

మౌలిక హోదాతో పెట్టుబడులు పొందేందుకు ఇలా వీలు

ఆర్థిక ప్రగతి దిశగా ముందుకెళ్లేందుకు అనుకూల వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఉన్నది. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తూ పన్ను వసూళ్ల వ్యవస్థను మరింత మెరుగు పర్చాలని సూచిస్తున్నారు. ఎంతోకాలంగా తమకు మౌలిక వసతుల కల్పన రంగంగా గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రియల్‌ ఎస్టేట్‌ రంగ ప్రముఖులు అభ్యర్థిస్తున్నారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నారెడ్కో) కూడా రియాల్టీకి మౌలిక వసతి కల్పించాలని కేంద్రాన్ని కోరింది. వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ వల్ల పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు పెంచే అంశంపై ద్రుష్టి సారించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కనుక 2018 బడ్జెట్ ప్రతిపాదనల్లోనైనా రియాల్టీ రంగానికి మౌలిక రంగ హోదా కల్పించాలి. దీనివల్ల తక్కువ వడ్డీ రేట్లకే తమ ప్రాజెక్టుకు అవసరమైన రుణాలను డెవలపర్లు పొందడానికి అవకాశం లభిస్తుంది. గృహ నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుంది. డిమాండ్‌ పెరుగుతుంది. హౌజింగ్‌ నిర్మాణ రంగంలో డెట్‌, పెన్షన్‌ ఫండ్స్‌ ఇన్వె్‌స్టమెంట్‌కు అవకాశం ఉంటుంది. గణనీయ స్థాయిలో ఉద్యోగాలను కల్పించేందుకు వెసులుబాటు లభిస్తుంది.

ఐటీ మినహాయింపులు పెంచాలి

ఐటీ మినహాయింపులు పెంచాలి

గృహ రుణాల వడ్డీ రేట్లను తగ్గించాలని అభ్యర్థిస్తున్నారు. ఐటీ చట్టం 80సి సెక్షన్‌ కింద ప్రస్తుతం 1.5 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు ఉంది. గృహ రుణాల అసలు చెల్లింపులకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షలకు పెంచితే హౌజింగ్‌ రుణాలకు డిమాండ్‌పెరుగుతుంది. దీంతో వేతన జీవులకు ప్రయోజనం చేకూరుతుంది. తొలిసారి ఇంటిని కొనుగోలు చేస్తున్న వారికి 80 ఇఇ సెక్షన్‌ కింద రూ. 50 వేల వరకు అదనంగా పన్ను మినహాయింపు లభిస్తోంది. ఈ మొత్తాన్ని రూ. 2 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి రూ. 2.5 లక్షలు ఉంది. దీన్ని రూ.3 లక్షలకు పెంచాలని సూచిస్తున్నారు. వాస్తవిక ద్రుక్పథంతో పన్ను శ్లాబులను సవరించాలని అభ్యర్థిస్తున్నారు.

 సకాలంలో ప్రాజెక్టుల పూర్తితో కనీసం 15 శాతం మిగులు

సకాలంలో ప్రాజెక్టుల పూర్తితో కనీసం 15 శాతం మిగులు

హౌజింగ్‌ ప్రాజెక్టులకు అనుమతుల్లో జాప్యం వల్ల డెవలపర్లు పూర్తి చేయని సందర్భాలు ఉంటున్నాయి. దీని వల్ల డెవలపర్లపైనే కాక కొనుగోలుదారులపైనా భారం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు సింగిల్‌ విండో ద్వారా ఇవ్వాలని డెవలపర్లు డిమాండ్‌ చేస్తున్నారు. మెగా ప్రాజెక్టులకు నిర్దేశిత కాలంలో అనుమతులు వస్తే ప్రాజెక్టు వ్యయం 15 శాతం తగ్గడానికి ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. దీన్ని కొనుగోలుదారులకు బదిలీ చేయడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం వసూలు చేస్తున్న జీఎస్టీ 12 శాతం వల్ల ఇతర స్టాంప్ డ్యూటీ తదితర ఖర్చులతో ఇల్లు కొనుగోలు దారుడిపై అదనపు భారం మోపినట్లవుతుందని చెప్తున్నారు. కనుక జీఎస్టీ శ్లాబ్ తగ్గించాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే వివిధ ప్రాంతాల్లోని భూములపై గల వివాదాల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని రియాల్టీ డెవలపర్లు కోరుతున్నారు. ఇక ఇళ్ల నిర్మాణానికి కీలకమైన ‘భూసేకరణ చట్టాన్ని' సవరించాల్సిన అవసరం ఉన్నదని అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+