విదేశీయులకు రెడ్ కార్పెట్ పరిచిన నిర్మలమ్మ.. ఇక ఇండియన్ షేర్లకు రెక్కలే!
Budget 2026: భారత స్టాక్ మార్కెట్లను ప్రపంచ పెట్టుబడుల హబ్‌గా మార్చే దిశగా కేంద్ర సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర బడ్జెట్ 2026లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విదేశీయులు నేరుగా భారతీయ షేర్లలో పెట్టుబడి పెట్టేందుకు వెసులుబాటు కల్పిస్తూ కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు. దీనివల్ల భారత కంపెనీల్లోకి అంతర్జాతీయ మూలధనం భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
నేరుగా షేర్ల కొనుగోలుకు ఛాన్స్
ఇప్పటివరకు విదేశీ ఫండ్స్ ప్రధానంగా పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ద్వారా లేదా ఎన్నారై మార్గాల ద్వారా మాత్రమే వచ్చేవి. ఇది సాధారణ విదేశీ వ్యక్తికి కొంచెం కష్టమైన పనే. అయితే తాజా బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం.. విదేశాల్లో నివసించే వ్యక్తులు 'పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్' ద్వారా నేరుగా భారతీయ ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది భారత మార్కెట్లలో విదేశీ భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేస్తుంది.

పెరిగిన పెట్టుబడి పరిమితులు
విదేశీయులకు మరింత స్వేచ్ఛనిస్తూ పెట్టుబడి పరిమితులను ప్రభుత్వం భారీగా పెంచింది. ఒక విదేశీ వ్యక్తి ఒక భారతీయ కంపెనీలో పెట్టే పెట్టుబడి పరిమితిని 5 శాతం నుంచి 10 శాతానికి పెంచారు. విదేశీ వ్యక్తులందరూ కలిసి ఒక కంపెనీలో కొనుగోలు చేసే మొత్తం వాటా పరిమితిని 10 శాతం నుంచి 24 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. దీనివల్ల విదేశీ పెట్టుబడిదారులు భారతీయ కంపెనీల్లో మరింత అర్థవంతమైన వాటాలను పొందేందుకు, దీర్ఘకాలిక మూలధనాన్ని అందించేందుకు వీలు కలుగుతుంది.
కార్పొరేట్ బాండ్ మార్కెట్లో సంస్కరణలు
కేవలం ఈక్విటీ మార్కెట్లే కాకుండా కార్పొరేట్ బాండ్ మార్కెట్లో లిక్విడిటీని పెంచడానికి ప్రభుత్వం 'మార్కెట్ మేకింగ్ ఫ్రేమ్ వర్క్'ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం కొన్ని సంస్థలు కార్పొరేట్ బాండ్లను నిరంతరం కొనుగోలు, విక్రయ ధరలను సూచించాల్సి ఉంటుంది. దీనివల్ల సాధారణ పెట్టుబడిదారులు బాండ్ల నుంచి బయటకు రావడం లేదా కొత్తవి కొనడం చాలా ఈజీ అవుతుంది. బ్యాంక్ లోన్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఈ చర్యలన్నీ కలిసి భారత ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడుల ప్రవాహాన్ని వేగవంతం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications