EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..!
క్లెయిమ్ సెటిల్ మెంట్ చేసే తేదీ వరకు చందాదారుడికి వడ్డీ చెల్లించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సెటిల్ మెంట్ చేసే నెల 24వ తేదీ వరకు సెటిల్ అయిన క్లెయిమ్‌లకు, ముందు నెల చివరి వరకు మాత్రమే వడ్డీ చెల్లిస్తున్నారు. ఆమ్నెస్టీ స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు యజమానుల నుంచి సాధారణ ఆన్‌లైన్ డిక్లరేషన్ సరిపోతుందని కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందుకు సంబంధించి ఈపీఎఫ్ స్కీమ్ 1952కి సవరణను బోర్డు ఆమోదించింది. దీని ప్రకారం సెటిల్మెంట్ తేదీ వరకు సభ్యులకు వడ్డీ చెల్లిస్తారు.
అంతే కాకుండాసెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇన్విట్‌లు, రిట్లులో జారీ చేసే యూనిట్లలో పెట్టుబడి కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్‌లు)లో పెట్టుబడుల కోసం రిడెంప్షన్ పాలసీ, 50 శాతం రీఇన్వెస్ట్‌మెంట్ ఇటిఎఫ్‌లలోకి రానుంది. 7.37 కోట్ల మంది చందాదారులు, మొత్తం 32.56 కోట్ల మంది సభ్యులను కలిగి ఉన్న ఈపీఎఫ్ఓ ఆదాయం(రాబడి) మెరుగుపరచడానికి వచ్చే ఆరేళ్లలో ETF రిడెంప్షన్ వ్యవధిని 4 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలకు పెంచాలని భావిస్తోంది.

ఈపీఎఫ్ఓ భారత్ 22, సిపిఎస్‌ఇ ఇటిఎఫ్‌ల వంటి ఇటిఎఫ్‌ల ద్వారా రిడెంప్షన్ రాబడిలో 50 శాతం ఈక్విటీలో తిరిగి పెట్టుబడి పెట్టబడుతుంది, మిగిలిన 50 శాతం ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్‌లు వంటి ఇతర ఆస్తుల తరగతులలో పెట్టుబడి పెట్టబడుతుంది. ఈక్విటీలో పెట్టుబడి ద్వారా మెరుగైన రాబడిని పొందాలనే లక్ష్యంతో పెట్టుబడి నిబంధనలలో మార్పులు చేస్తున్నారు. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా నోటిఫై చేసిన 15 శాతం వరకు ఈక్విటీలో పెట్టుబడి పెట్టవచ్చు.
EPFO ఆగస్టు 2015లో సెన్సెక్స్ లేదా నిఫ్టీపై ETFల ద్వారా ఈక్విటీలో 5 శాతం పెట్టుబడితో ఈక్విటీ పెట్టుబడిని ప్రారంభించింది. 2017 నుంచి ETFలలో పెట్టుబడిని పెడుతూ.. తాజా అక్రెషన్‌లో 15 శాతానికి పెంచారు. కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియా నేతృత్వంలోని 44 మంది సభ్యుల CBT, ఉద్యోగులు, యజమానుల ప్రతినిధులను కమిటీ శనివారం నిర్ణయం తీసుకుంది. ఆటో క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ సౌకర్యం కోసం పరిమితిని రూ. 50,000 నుంచి రూ. 1 లక్షకు పెంచుతూ గతంలో తీసుకున్న నిర్ణయంపై కూడా బోర్డు చర్చించింది. పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి తర్వలో ఏటీఎం తరహా కార్డులను అందుబాటులోకితీసుకొచ్చే అవకాశం ఉంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications