అత్యధికంగా గోల్డ్ నిల్వలు ఉన్న దేశాలు.. భారత్ స్థానం ఎక్కడుందంటే?

బంగారం ఒక విలువైన లోహం. దీనికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంది. మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఏ సీజన్‌లో అయినా బంగారం కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఇక పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వినియోగదారులతో షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. బంగారం అనేది పెట్టుబడులలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి సమయాల్లో విశ్వసనీయమైన విలువ నిల్వగా పనిచేస్తుంది. అందుకే ప్రతీ దేశం బంగారాన్ని నిల్వ చేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తాయి. అవసరమైతే వాటిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఒక దేశ కరెన్సీ విలువను కూడా బంగారం నిల్వలు ప్రభావితం చేస్తాయి.

అత్యధిక బంగారం నిల్వలు ఉన్న దేశాల జాబితాను తాజాగా వివిధ సంస్థలు ప్రకటించాయి. వాటి ఆధారంగా టాప్ 10 దేశాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

Countries with the highest gold reserves Where is India s position

ర్యాంక్ దేశం బంగారం నిల్వ (మెట్రిక్ టన్నులలో)
1 అమెరికా 8,133.46
2 జర్మనీ 3,352.65
3 ఇటలీ 2,451.84
4 ఫ్రాన్స్ 2,436.88
5 రష్యా 2,332.74
6 చైనా 2,262.45
7 స్విట్జర్లాండ్ 1,040.00
8 జపాన్ 845.97
9 భారత్ 822.09
10 నెదర్లాండ్స్ 612.45

ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిల్వలు కలిగిన దేశం అమెరికా. దీని వద్ద 8,133.46 టన్నుల బంగారం నిల్వ ఉంది. ఇది మిగతా దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువ. అయితే ఈ జాబితాలో భారత్ 9వ స్థానంలో ఉంది. భారత్ వద్ద 822.09 టన్నుల బంగారం నిల్వ ఉంది. బంగారం వినియోగంలో భారత్ ముందు వరుసలో ఉంటుంది. పెళ్లిళ్లు, పండుగలు, ఇతర శుభకార్యాలలో బంగారం కొనడం ఇక్కడ ఒక ఆనవాయితీ. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా వంటి దేశాలు కూడా భారీగా బంగారం నిల్వలను కలిగి ఉన్నాయి. ఇవి ఆర్థికంగా బలమైన దేశాలు.

బంగారం నిల్వలు ఎందుకు ముఖ్యమైనవి?

దేశాలు బంగారం నిల్వలను ఎందుకు ఉంచుకుంటాయి అంటే, బంగారం నిల్వలు ఒక దేశ ఆర్థిక స్థిరత్వానికి కీలకం. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి సమయంలో విశ్వసనీయమైన విలువ గల స్టోర్‌గా పనిచేస్తాయి. బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడి. ఆర్థిక సంక్షోభ సమయాల్లో బంగారం విలువ పెరుగుతుంది. కాబట్టి, దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడానికి బంగారం నిల్వలను ఉపయోగిస్తాయి. ఒక దేశ కరెన్సీ విలువను కూడా బంగారం నిల్వలు ప్రభావితం చేస్తాయి. ఒక దేశం ఎక్కువ బంగారం నిల్వలను కలిగి ఉంటే, ఆ దేశ కరెన్సీ విలువ పెరుగుతుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో కూడా బంగారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొన్ని దేశాలు బంగారాన్ని చెల్లింపు సాధనంగా కూడా ఉపయోగిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+