రైళ్లు బంద్.. ఒక్కసారిగా పెరిగిన ఫ్లైట్ టికెట్స్!

దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్జనతా పార్టీ పిలుపునిచ్చిన ఆందోళనల కారణంగా కట్టుదిట్టమైన ఆంక్షలు అమలులోకి వచ్చాయి. పలు రైళ్ల రద్దు, సరిహద్దుల్లో తనిఖీలతో నగరంలో ప్రయాణ వాతావరణం సంక్లిష్టంగా మారింది. రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు విమానాల వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే, వెళ్లే విమానాల్లో ఆఖరి నిమిషం బుకింగ్స్ ఒక్కసారిగా పెరిగాయి. పండుగల సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో ఈ ఆంక్షలు కొనసాగితే విమాన ఛార్జీలు మరింత ప్రియమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఒక్కసారిగా మారిన జర్నీ ప్లాన్స్

రైలు సర్వీసులకు అంతరాయం కలగడంతో అత్యవసరంగా ప్రయాణాలు చేయాల్సిన వారు ప్రత్యామ్నాయాల అన్వేషణలో పడ్డారు. వీకెండ్ జర్నీస్, పండుగల రద్దీ ఇప్పటికే ఎక్కువగా ఉండటంతో విమాన టికెట్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. విమానయాన రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ఆందోళనలు మరికొన్ని రోజులు కొనసాగితే రైలు, బస్సు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో విమానాలను ఆశ్రయించే అవకాశం ఉంది. దీనివల్ల రాబోయే రోజుల్లో ఆఖరి నిమిషం టికెట్ ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది.

Delhi Protests Cause Train Disruptions and Flight Bookings Surge Airfares Skyrocket Across Routes
Delhi: దేశ రాజధానిలో బంద్!.. అణువణువునా నిఘా నేత్రాలు
Delhi: దేశ రాజధానిలో బంద్!.. అణువణువునా నిఘా నేత్రాలు

రూట్ల వారీగా పెరిగిన ధరలు: వారణాసి, అమృత్‌సర్ మార్గాల్లో మంటలు

వివిధ నగరాల నుంచి ఢిల్లీకి వచ్చే మార్గాల్లో టికెట్ ధరలు గణనీయంగా పెరిగాయి. వారణాసి నుంచి ఢిల్లీకి సాధారణంగా ఉండే వన్-వే ఛార్జీలతో పోలిస్తే దాదాపు 15 శాతం వరకు ధరలు పెరిగినట్లు ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధులు చెబుతున్నారు. అక్కడ ఒకవైపు టికెట్ ధర రూ. 6,200 నుంచి ప్రారంభమై గరిష్టంగా రూ. 14,000 వరకు వెళ్లింది. అలాగే అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి సాధారణంగా ఉండే రూ. 4,000 టికెట్ ధర ఏకంగా రూ. 8,000కి చేరింది. లుధియానా నుంచి విమాన టికెట్ల ధరల్లో రోజంతా తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించాయి. ఒకానొక దశలో రూ. 12,987 వరకు చేరిన టికెట్ ధరలు, ఆ తర్వాత సాయంత్రానికి కాస్త తగ్గుముఖం పట్టాయి.

భయం ఉంటే ఏకంగా 'దేశాన్నే బంద్' చేయండి.. కేంద్రంపై సీజేపీ సెటైర్లు!
భయం ఉంటే ఏకంగా 'దేశాన్నే బంద్' చేయండి.. కేంద్రంపై సీజేపీ సెటైర్లు!

ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీపై ఆందోళన

కేవలం టికెట్ ధరలే కాకుండా ప్రయాణికులను మరో పెద్ద సమస్య వేధిస్తోంది. ఢిల్లీ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉండటం, మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది.. దీంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది సమయానికి విమానాశ్రయానికి చేరుకోవడం కష్టంగా మారింది. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాలు అందుకోవాల్సిన ప్రయాణికులు, కనెక్టింగ్ ఫ్లైట్స్ మిస్ కాకూడదనే ఉద్దేశంతో ఎంత ధరైనా సరే టికెట్లు కొనుగోలు చేయడానికి సిద్ధపడుతున్నారు.

పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు: రానున్న రోజుల్లో మరింత భారమేనా?

ఇప్పటికే జెట్ ఫ్యూయల్ ధరలు పెరగడం, కరెన్సీ విలువ తగ్గడంతో విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయి. దీనికి తోడు ప్రస్తుత ఆందోళనల కారణంగా డిమాండ్ అకస్మాత్తుగా పెరిగితే ఛార్జీల బాదుడు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ట్రావెల్ ఇండస్ట్రీ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ శాంతిభద్రతల దృష్ట్యా ఆంక్షలు సుదీర్ఘంగా కొనసాగితే, సాధారణ ప్రయాణికుల జేబులకు మరింత చిల్లు పడక తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+