రికార్డు బ్రేక్ చేసిన డీజిల్ ధర: భారీగా పెట్రోల్ ధర పెంపు
petrol price, diesel price, hike in petrol price, hike in diesel price, పెట్రోల్ ధర, డీజిల్ ధర, పెట్రోల్ ధర పెంపు, డీజిల్ ధర పెంపు
న్యూఢిల్లీ: డీజిల్ ధర గత రికార్డులను బ్రేక్ చేసింది. పెట్రోల్ ధర కూడా భారీగా పెరిగింది. అంతర్జాతీయంగా చమురు ధరలు ర్యాలీ కొనసాగిస్తుండడంతో సోమవారం డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయి.
డీజిల్ ధర లీటర్‌కు రూ.61.74 వద్ద రికార్డు గరిష్టాన్ని తాకింది, పెట్రోల్ ధర లీటర్‌కు రూ.71 దాటింది ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర సోమవారం రూ.71.18కి పెరిగింది. 2014 ఆగస్టు తర్వాత ఇదే అత్యధిక పెరుగుదల. అదే రీతిలో లీటర్ డీజిల్ ధర రూ. 61.74కు పెరిగింది.

ముంబైలో డీజిల్ ధర రూ.65.74గా నమోదైంది. ముంబైలో స్థానిక విక్రయం పన్ను అత్యధికంగా ఉండడంతో ఢిల్లీలో కన్నా డీజిల్ ధరలు అక్కడ ఎక్కువగా ఉన్నాయి. రోజువారీ ధరల సమీక్ష చేపట్టినప్పటి నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం వీటిపై ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించింది.
అయితే, అంతర్జాతీయంగా చమురు ధరల ర్యాలీ కొనసాగుతుండడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. గత నెల నుంచి డీజిల్ ధరలు రూ.3.4 పెరగగా, పెట్రోల్ ధరలు రూ.2.09 పెరిగాయి.












Click it and Unblock the Notifications