ట్రంప్ టారిఫ్ దెబ్బ.. మార్కెట్ అబ్బా! 4 రోజుల్లో రూ. 10 లక్షల కోట్లు గోవిందా!

భారత షేర్ మార్కెట్ గురువారం భారీ పతనాన్ని చవిచూసింది. సెన్సెక్స్ 780 పాయింట్లు నష్టపోయి 84,180 వద్ద ముగియగా.. నిఫ్టీ 264 పాయింట్లు కోల్పోయి 25,876 వద్ద స్థిరపడింది. వరుసగా నాలుగో రోజు మార్కెట్లు నష్టపోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. గత 4 రోజుల్లోనే పెట్టుబడిదారుల సంపద ఏకంగా రూ.10 లక్షల కోట్లు ఆవిరైపోయింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ నాలుగు రోజుల్లో రూ.472 లక్షల కోట్లకు పడిపోయింది.

మార్కెట్ పతనానికి 5 కీలక కారణాలు
1. ట్రంప్ 500 శాతం టారిఫ్ హెచ్చరిక: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు మద్దతు తెలపడం మార్కెట్‌ను భయపెట్టింది. రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై ఒత్తిడి పెంచేందుకు ఈ బిల్లును ఆయుధంగా వాడుతున్నారు. ఈ బిల్లు ప్రకారం రష్యా దిగుమతులపై 500 శాతం టారిఫ్ విధించే అవకాశం ఉండటం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందనే ఆందోళన నెలకొంది.

Donald Trump Tariff Shock Hits Markets Investors Lose Rs 10 Lakh Crore in 4 Days

2. వెనిజులాలో రాజకీయ సంక్షోభం: వెనిజులాలో అకస్మాత్తుగా తలెత్తిన రాజకీయ అనిశ్చితి ప్రపంచ చమురు మార్కెట్లను కలవరపెడుతోంది. వెనిజులా వద్ద ఉన్న భారీ చమురు నిల్వల కారణంగా, అక్కడ జరిగే ఏ మార్పులైనా గ్లోబల్ ఆయిల్ ధరలను ప్రభావితం చేస్తాయి. ఇది జియో-పొలిటికల్ టెన్షన్లను పెంచి మార్కెట్ పతనానికి కారణమైంది.

3. దిగ్గజ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి: మార్కెట్ హెవీవెయిట్స్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు గురువారం ఒక శాతం వరకు పడిపోయాయి. ఈ వారంలో ఈ రెండు కంపెనీల షేర్లు దాదాపు 4 శాతం నష్టపోవడం సూచీల పతనానికి ప్రధాన కారణమైంది. మెటల్, ఐటీ రంగాల ఇండెక్స్‌లు కూడా 1 శాతం నుంచి 2శాతం వరకు నష్టపోయాయి.

4. బలహీనమైన అంతర్జాతీయ మార్కెట్లు: గురువారం ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడయ్యాయి. జపాన్ నిక్కీ 1.2శాతం, చైనా సూచీలు 0.8శాతం మేర పతనమయ్యాయి. అమెరికా నాస్‌డాక్ ఫ్యూచర్స్ కూడా నష్టాల్లో ఉండటంతో భారత మార్కెట్లపై విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడి పెరిగింది.

5. ఆర్థిక వృద్ధి రేటుపై ఆందోళనలు: భారత జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు ఇన్వెస్టర్లను అప్రమత్తం చేశాయి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంచనా ప్రకారం వృద్ధి రేటు 7.4శాతం ఉన్నప్పటికీ, ద్వితీయార్థంలో ఇది 6.9 శాతానికి తగ్గే అవకాశం ఉందని ఇక్రా (ICRA) నివేదికలు చెబుతున్నాయి. ఈ మందగమన అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+