టెస్లా కార్ల అమ్మకాలు పతనం.. బంపర్ ఆఫర్లతో మస్క్ మామ మాయ !
ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా టెస్లా కార్ల అమ్మకాలు ఒక్కసారిగా పడిపోవడంతో సంస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. ముఖ్యంగా యూరప్‌లో అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. దీంతో కంగుతిన్న టెస్లా సంస్థ అమ్మకాలను పెంచేందుకు నడుం బిగించింది. కస్టమర్లను ఆకర్షించడానికి భారీ ఆఫర్లను ప్రకటించింది. వడ్డీ లేని రుణాలు, ఉచిత ఛార్జింగ్ వంటి బంపర్ ఆఫర్లతో వినియోగదారులను ఊరించే ప్రయత్నం చేస్తోంది.
టెస్లా కార్లను బహిష్కరించాలని పిలుపు:
అయితే, టెస్లా సంస్థకు కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయా? అంటే, కాదనే చెప్పాలి. గత కొంతకాలంగా ఎలాన్ మస్క్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అమెరికా రాజకీయాల్లో మస్క్ జోక్యం చేసుకుంటున్నారని, తన పలుకుబడిని ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు సెలబ్రిటీలు ఏకంగా టెస్లా కార్లను బహిష్కరించాలని పిలుపునివ్వడం సంచలనం రేపింది. మస్క్ రాజకీయంగా ఎదుగుతుండటాన్ని తప్పుబడుతూ వారు టెస్లా కార్లను కొనకూడదని ప్రచారం చేస్తున్నారు.

టెస్లా షోరూమ్‌లపై దాడులు:
ఇక కొందరు అసంతృప్త టెస్లా యజమానులైతే మరింత ముందుకెళ్లి తమ కార్లపైనే నిరసన గళం వినిపిస్తున్నారు. "ఎలాన్ మస్క్ చర్యలు తెలిసేలోపే ఈ కారు కొన్నాం" అంటూ స్టిక్కర్లు వేసి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. కొన్నిచోట్ల ఆగ్రహించిన జనం టెస్లా షోరూమ్‌లపై దాడులు చేస్తున్నారు. కార్లను తగలబెడుతున్నారు. దీంతో టెస్లా కార్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
ఎలాన్ మస్క్ ఆఫర్లు :
అయితే, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమ్మకాలు పడిపోయినా.. తన ప్రయత్నాలను ఆపడం లేదు. ఎలాగైనా అమ్మకాలు పెంచాలనే కసితో కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నారు. వినియోగదారులను ఊరించేందుకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నారు. ఎంపిక చేసిన మోడళ్లపై 0% వడ్డీతో రుణాలు ఇస్తున్నారు. ఇక సైబర్‌ట్రక్ కొనేవారికి మరింత బంపర్ ఆఫర్ ఇచ్చారు. కేవలం 1.99% వడ్డీకే రుణాలు ఇస్తామని ప్రకటించారు.
ఇది మాత్రమే కాదు.. టెస్లా కార్ల యజమానులకు జీవితాంతం ఉచిత సూపర్ ఛార్జింగ్ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రపంచవ్యాప్తంగా 60 వేలకు పైగా టెస్లా సూపర్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. వాటి వద్ద ఎంచక్కా ఉచితంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. కేవలం 15 నిమిషాల్లో 322 కిలోమీటర్లు ప్రయాణించేంత ఛార్జింగ్ చేసుకోవచ్చంటే ఇది నిజంగా గొప్ప ఆఫర్ అని చెప్పాలి.
అంతేకాదు, మోడల్ 3 కొనేవారికి అమెరికా ప్రభుత్వం నుంచి $7,500 పన్ను రాయితీ కూడా లభిస్తుంది. అయితే, దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. కొనుగోలుదారులకు 700 పాయింట్ల కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉండాలి. ఒకవేళ పన్ను రాయితీ రాకపోయినా.. బాధపడాల్సిన అవసరం లేదు. టెస్లా సంస్థ కేవలం 0.99% వడ్డీకే ఫైనాన్స్ అందిస్తోంది.
మొత్తానికి టెస్లా సంస్థ అమ్మకాలు పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ ఆఫర్లు టెస్లాను గట్టెక్కిస్తాయా? ఎలాన్ మస్క్ మళ్లీ తన కార్లతో మ్యాజిక్ చేస్తారా? వేచి చూడాలి!
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications