Bank Holidays: ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు!

2026 జనవరి నెల ముగియడంతో, ఫిబ్రవరి నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల (Bank Holidays) పై స్పష్టత వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరిలో అమలులో ఉండే బ్యాంక్ హాలిడే క్యాలెండర్‌ను విడుదల చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు వర్తించే ఈ సెలవులు కొన్ని సందర్భాల్లో రాష్ట్రాల వారీగా భిన్నంగా ఉంటాయి.

ఫిబ్రవరి నెలలో మొత్తం తొమ్మిది రోజులు బ్యాంకులు మూసివేయబడనున్నాయి. ఇందులో ఆదివారాలు, రెండవ. నాల్గవ శనివారాలతో పాటు కొన్ని ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక దినోత్సవాలు ఉన్నాయి.

February 2026 Bank Holidays in India RBI Releases State-Wise Holiday List for All Banks

Bank Holidays లిస్ట్..

ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది. అదే విధంగా ఫిబ్రవరి 8, 15, 22 తేదీలు కూడా ఆదివారాలు కావడంతో బ్యాంకులు పనిచేయవు. ఫిబ్రవరి 14న రెండవ శనివారం, ఫిబ్రవరి 28న నాల్గవ శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు అమలులో ఉంటుంది.

ప్రాంతీయ సెలవుల విషయానికి వస్తే, ఫిబ్రవరి 18న లోసర్ పండుగ సందర్భంగా సిక్కింలోని గాంగ్‌టక్‌లో బ్యాంకులు మూసివేస్తారు. ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మహారాష్ట్రలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 20న రాష్ట్ర అవతరణ దినోత్సవాల కారణంగా మిజోరం రాజధాని ఐజ్వాల్, మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లలో బ్యాంకులు పనిచేయవు.

ప్రత్యక్షంగా వెళ్లి చేయాల్సిన పనులు..

ఈ నేపథ్యంలో బ్యాంకులకు ప్రత్యక్షంగా వెళ్లి చేయాల్సిన ముఖ్యమైన పనులు ఉంటే, సెలవుల తేదీలను ముందుగానే పరిశీలించి ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది. చెక్కులు, డాక్యుమెంట్ సంబంధిత పనులు, లోన్ల ప్రక్రియలు వంటి వాటిని సెలవులకు ముందు పూర్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే, బ్యాంకుల బ్రాంచీలు మూసివున్నా వినియోగదారులకు డిజిటల్ సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదు. నెట్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ వంటి సదుపాయాలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. బ్యాలెన్స్ చెక్ చేయడం, డిజిటల్ ట్రాన్స్‌ఫర్లు, బిల్ పేమెంట్లు వంటి సేవలను నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+