వేళ్ల మీద వడ్డీ లెక్కలు. అదిరిపోయే సింపుల్ ట్రిక్స్!

ఇంట్లో పెద్దలు ఎవరైనా అకస్మాత్తుగా వచ్చి "ఒక పది వేల రూపాయలకు నెలకు రెండు రూపాయల వడ్డీ చొప్పున ఏడాదికి ఎంతవుతుందో లెక్క కట్టు" అంటే.. మనలో చాలా మంది నీళ్లు నములుతుంటారు. వెంటనే జేబులో నుంచి స్మార్ట్‌ఫోన్ తీసి క్యాలిక్యులేటర్ యాప్ ఓపెన్ చేస్తాం. కానీ, అసలు క్యాలిక్యులేటర్ అవసరం లేకుండానే, మెదడుకు కొంచెం పని చెబితే వడ్డీ లెక్కలు చిటికెలో తేల్చేయవచ్చు. ముఖ్యంగా నేటి డిజిటల్ యుగంలో యూపీఐ (UPI), ఈఎంఐ (EMI)ల వాడకం పెరిగిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన 'వడ్డీ మ్యాజిక్' చిట్కాలు ఇవే..

మొదట గుర్తుపెట్టుకోవాల్సింది... ఫార్ములాలు కంటే "100కి ఎంత?" అనే ఆలోచన. ఉదాహరణకు రూ.10,000పై 1% వడ్డీ అంటే రూ.100. అదే 5% అయితే రూ.500. ఇక కాలాన్ని బట్టి గుణిస్తే చాలు. అంటే రూ.10,000కు 5% వడ్డీ 2 ఏళ్లకు రూ.1,000 అవుతుంది. ఎలాంటి క్లిష్టమైన సూత్రాలు లేకుండా, లెక్క సూటిగా తేలిపోతుంది.

Finance Hacks for Gen Z How to Calculate Loan Interest Without a Calculator Using Simple Base-10 Tricks

ఇంకో స్మార్ట్ ట్రిక్-'10% బేస్'. ఏ మొత్తంలోనైనా ఒక సున్నా తీసేస్తే 10% రెడీ. రూ.8,000కి 10% అంటే రూ.800. ఇప్పుడు 5% కావాలంటే దాని సగం.. రూ400. 15% కావాలంటే 10% + 5%- రూ1,200. ఇలా శాతాలను చిన్న భాగాలుగా విడదీసి లెక్కిస్తే, పెద్ద సంఖ్యలూ సులభంగా చేతిలో పడతాయి.

నెలవారీ, సంవత్సర వడ్డీల మధ్య కన్ఫ్యూజన్‌కు కూడా ఒక ఈజీ హాక్ ఉంది. సంవత్సర వడ్డీని 12తో భాగిస్తే నెలవారీ వడ్డీ వస్తుంది. ఉదాహరణకు 12% సంవత్సర వడ్డీ అంటే నెలకు 1%. కాబట్టి రూ.5,000పై నెలకు రూ.50 వడ్డీ. 6 నెలలకు రూ.300. సింపుల్‌గా, స్పష్టంగా-ఎలాంటి గందరగోళం లేదు.

అంచనా వేయడం నేర్చుకోండి (Approximation)

ప్రతిసారీ రూపాయి పైసలతో సహా లెక్కించాల్సిన అవసరం లేదు. ఒక రఫ్ ఐడియా ఉంటే ఆర్థిక నిర్ణయాలు వేగంగా తీసుకోవచ్చు. ఉదాహరణకు రూ. 20,000కు 8% వడ్డీ అంటే.. అది 10% (రూ. 2,000) కంటే కొంచెం తక్కువగా ఉంటుందని, అంటే సుమారు రూ. 1,600 నుంచి రూ. 1,700 మధ్య ఉంటుందని వెంటనే గ్రహించాలి.

మొత్తానికి, వడ్డీ లెక్కలు అనేవి కేవలం పరీక్షల కోసమే కాదు.. రోజువారీ జీవితంలో ఉపయోగపడే లైఫ్ స్కిల్. స్నేహితుడికి ఇచ్చే అప్పు నుంచి బ్యాంకు డిపాజిట్లు, లోన్ యాప్‌ల వరకు ఎక్కడైనా పనికొస్తాయి. ఈ చిన్న చిన్న ట్రిక్స్ అలవాటు చేసుకుంటే, ఇకపై క్యాలిక్యులేటర్ కోసం వెతకాల్సిన అవసరమే ఉండదు-మీ వేళ్లే మీ బెస్ట్ క్యాలిక్యులేటర్!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+