Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Flipkart : రిపబ్లిక్‌ డే సేల్‌ వచ్చేసింది. భారీ డిస్కౌంట్లు, బంపర్ ఆఫర్లు

పండుగ సీజన్ వచ్చేసింది. మనం ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ప్రకటన కూడా వచ్చేసింది. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్(Flipkart) సేల్ స్టార్టింగ్ డేట్ ప్రకటించేసింది. అది కూడా భారీ డిస్కౌంట్ తో. ఇక ఈ బంపరాఫర్ వివరాలు లేట్ చేయకుండా తెలుసుకోండి.

పండుగ సీజన్‌కు మరింత ఉత్సాహం తెచ్చేలా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరో బంపర్ ప్రకటన చేసింది. కొత్త ఏడాదిలో తొలి భారీ సేల్‌కు సిద్ధమవుతున్నట్లు అధికారికంగా వెల్లడించింది. షాపింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ తేదీలను సంస్థ ఖరారు చేయడంతో ఆన్‌లైన్ మార్కెట్‌లో సందడి మొదలైంది.

Flipkart Announces Republic Day Sale Starting January 17 with Big Discounts and Bank Offers

ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన వివరాల ప్రకారం, రిపబ్లిక్ డే సేల్(Republic Day Sale) జనవరి 17 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్లకు మాత్రం ఈ సేల్‌పై ప్రత్యేక అవకాశం కల్పించింది. వారికి సాధారణ వినియోగదారుల కంటే 24 గంటల ముందే, అంటే జనవరి 16 నుంచే సేల్‌లో షాపింగ్ చేసే అవకాశం లభించనుంది. పండుగల వేళ ముందస్తు డీల్స్ అందుకోవాలనుకునే వారికి ఇది శుభవార్తగా మారింది.

ఈ సేల్‌లో భాగంగా బ్యాంక్ ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ అందిస్తామని సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ పరిమిత కాలం పాటు మాత్రమే వర్తిస్తుందని, షరతులు అమలులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ స్పష్టం చేసింది.

ఉత్పత్తుల వారీగా డిస్కౌంట్ల వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ, గత సేల్స్ అనుభవం ఆధారంగా ఈసారి కూడా విస్తృత శ్రేణి ఉత్పత్తులపై ఆఫర్లు ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, బ్లూటూత్ స్పీకర్లు, ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై భారీ తగ్గింపులు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

అదేవిధంగా రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, టీవీలు వంటి గృహోపకరణాలపై కూడా ఆకర్షణీయమైన డీల్స్, ఎక్స్చేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ వంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సేల్‌కు సంబంధించిన పూర్తి ఆఫర్ల వివరాలను సేల్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు వెల్లడించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

ఈ సేల్‌కు సంబంధించి వినియోగదారులు ముందుగానే సమాచారం తెలుసుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్‌, యాప్‌లో ప్రత్యేక మైక్రోసైట్‌ను లైవ్‌లోకి తీసుకొచ్చింది. ఇందులో రాబోయే ఆఫర్లకు సంబంధించిన టీజర్లు, బ్యాంక్ డీల్స్, టైమ్‌లైన్ వివరాలు అందుబాటులో ఉన్నాయి. పండుగ సీజన్‌లో భారీ డిస్కౌంట్లతో షాపింగ్ చేయాలనుకునే వారికి ఈ రిపబ్లిక్ డే సేల్ పెద్ద అవకాశంగా మారనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+