పెట్రోల్, డీజిల్ ధరల్లో తాజా సవరణలు?

దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు మిశ్రమ ధోరణిని కనబరుస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, ప్రీమియం వేరియంట్లు, ప్రైవేటు రిటైలర్లు మాత్రం ఇటీవల ధరలను భారీగా పెంచాయి. పశ్చిమాసియాలో తీవ్ర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు విధించిన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలనే గడువు కారణంగా అంతర్జాతీయ ముడిచమురు ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరాయి.

ఈ అనిశ్చిత పరిస్థితులు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తోన్నాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) ధరలను నియంత్రించడం, అవి స్వయంగా నష్టాలను భరించడం వల్ల ఈ వారం సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ జోక్యం, కంపెనీల ధరల భారం మోసే విధానం వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం కలిగిస్తోంది.

తీవ్ర ప్రతికూల పరిణామాల్లోనూ దేశంలో ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ రేట్లు స్థిరంగానే ఉంటోన్నాయి. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 10 రూపాయ‌ల చొప్పున ఎక్సైజ్ ట్యాక్స్ భారాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలేవీ కూడా ఈ పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయట్లేదు. తమ నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాయి. దీనివల్ల రిటైల్ ధరలు తగ్గట్లేదు.

Global Crude Near 4-Year High as Petrol and Diesel Price Remain Stable in India after Rs 10 duty cut

ఈ పరిణామాల మధ్య వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలిలా ఉన్నాయి.

హైదరాబాద్ లో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 107.46

ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77

కోల్‌కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41

ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54

చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06

భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94

డీజిల్ ధరలు ఇవీ..

హైదరాబాద్ లో డీజిల్ ధర: లీటరుకు రూ. 95.70,

ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67

కోల్‌కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02

ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03

చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61

భువనేశ్వర్‌లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+