వంటగ్యాస్ రేట్లు భారీగా పెరిగిన వేళ.. పెట్రోల్ ధరలు ఇలా!!
LPG Cylinder Price: వంటగ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు పెరిగాయి. ఒక్కో సిలిండర్‌పై ఏకంగా రూ.195. 50 పైసలు పెరిగాయి. ఈ ధరలు ఈ తెల్లవారు జాము నుంచే అమలులోకి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే చమురు కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు.
కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం వరుసగా ఇది రెండో నెల. కిందటి నెల అంటే మార్చి 1వ తేదీన కూడా వీటి రేట్లు పెరిగాయి. అప్పట్లో ఒక్కో సిలిండర్‌పై ఏకంగా 28 రూపాయలుపెరిగింది. నాలుగు నెలల్లోనే ఐదోసారి ధరలు పెరిగాయి. ఇప్పుడు తాజాగా మరో 195 రూపాయల మేర అదనపు భారం వినియోగదారులపై పడింది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుంది. ముఖ్యంగా హోటళ్ళు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఈ పరిణామాల మధ్య అందరి దృష్టి కూడా పెట్రోల్, డీజిల్ రేట్లపై పడింది. ముడి చమురు ధరలు తీవ్రంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ సంక్షోభం హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు అంతరాయం కలిగే ప్రమాదంపై ఆందోళనలను రేకెత్తించింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ కీలక మార్గం గుండానే సాగుతుంది. దీని ప్రభావంతో ఈ వార ప్రారంభంలో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 115 డాలర్లు దాటింది.
తీవ్ర ప్రతికూల పరిణామాల్లోనూ దేశంలో ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ రేట్లు స్థిరంగానే ఉంటోన్నాయి. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 10 రూపాయల చొప్పున ఎక్సైజ్ ట్యాక్స్ భారాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలేవీ కూడా ఈ పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయట్లేదు. తమ నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాయి. దీనివల్ల రిటైల్ ధరలు తగ్గట్లేదు.
ఈ పరిణామాల మధ్య వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ లో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 107.46
ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77
కోల్‌కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41
ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54
చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06
భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94
డీజిల్ ధరలు ఇవీ..
హైదరాబాద్ లో డీజిల్ ధర: లీటరుకు రూ. 95.70,
ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67
కోల్‌కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02
ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03
చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61
భువనేశ్వర్‌లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications