బంగారం ధరల్లో షార్ప్ ఫాల్
నేడు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. ఓ షార్ప్ ఫాల్ కనిపించింది. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్ లో అమెరికా డాలర్ విలువలో చోటుచేసుకున్న హెచ్చుతగ్గుల మధ్య దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ వీటి ధరలు భారీగా పెరగకపోవడంతో అటు కొనుగోలుదారులు, ఇటు రిటైల్ పెట్టుబడిదారులకు ఊరటనిచ్చింది.
దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,51,054 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో సాధారణ ఆభరణాల తయారీకి భారీగా వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,38,091 వద్ద ట్రేడవుతోంది. వెండి ధరలో పెద్దగా మార్పులేవీ లేవు. కిలో వెండి ధర 2,65,100 వద్ద స్థిరపడింది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో స్థానికంగా పెరిగిన ఆభరణాల డిమాండ్ కూడా ఈ ధరల స్థిరత్వానికి తోడ్పడుతోందని జ్యువెలరీ వర్గాలు భావిస్తున్నాయి.

ఢిల్లీలో 24 క్యారెట్ల గ్రాము బంగార ధర రూ. 15,169, 22 క్యారెట్లు రూ. 13,906, ముంబైలో 24 క్యారరెట్లు రూ. 15,154, 22 క్యారెట్లు రూ. 13,891, కోల్‌కతాలో రూ. 15,154, రూ. 13,891, చెన్నైలో రూ. 15,350, రూ. 14,071 పలుకుతోంది. వెండి కేజీ ధర ఢిల్లీలో రూ. 2,65,100, ముంబై- రూ. 2,65,100, కోల్‌కతా- రూ. 2,65,100, చెన్నై- రూ. 2,80,100 వద్ద స్థిరపడింది. రాబోయే రోజుల్లో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానాలు, అంతర్జాతీయ ద్రవ్యోల్బణ గణాంకాలు బంగారం ధరల గమనాన్ని నిర్దేశించనున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం, వెండి ధరల్లో తగ్గుదల చోటు చేసుకుంది. కామెక్స్ ట్రేడింగ్‌లో గత 24 గంటల్లో అంతర్జాతీయ స్పాట్ బంగారం ధర ఔన్సుకు 0.31 శాతం తగ్గి, 4,337.90 డాలర్ల వద్ద స్థిరపడింది. వెండి ఔన్సుకు 0.99 శాతం తగ్గి 69.48 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయ స్పాట్ బంగారం సెషన్ 24-క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాములకు రూ. 1,50,133.00 వద్ద ట్రేడ్ అవుతోంది.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,338, 22 క్యారెట్లు - రూ. 14,060, 18 క్యారెట్లు - రూ. 11,790
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,137, 22 క్యారెట్లు- రూ. 13,876, 18 క్యారెట్లు - రూ. 11,363
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,163, 22 క్యారెట్లు- రూ. 13,890, 18 క్యారెట్లు - రూ. 11,365
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,137, 22 క్యారెట్లు- రూ. 13,876, 18 క్యారెట్లు - రూ. 11,363
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,137, 22 క్యారెట్లు- రూ. 13,876, 18 క్యారెట్లు - రూ. 11,363
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,137, 22 క్యారెట్లు- రూ. 13,876, 18 క్యారెట్లు - రూ. 11,363












Click it and Unblock the Notifications